Brahmamudi serial today Episode: కావ్యకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన రాజ్ కాఫీ ఎలా ఉందని అడుగుతాడు. బాగానే ఉందని కావ్య చెప్పగానే.. అసలు నీకు రొమాన్సే తెలియదు. ముందు కాఫీలో షుగర్ తక్కువైంది అనాలి. అప్పుడు నేను కరెక్టుగానే వేశాను కదా ఏదీ చూస్తాను అని కొంచెం తాగాక మళ్లీ ఈ కాఫీ తీసుకుని నువ్వు తాగి ఇప్పుడు సరిపోయింది అని చెప్పాలి అప్పుడే కదా సూపర్ రొమాన్స్ అవుతుంది అంటూ రాజ్ చెప్పగానే.. సినిమాటిక్ గా చేయడం నాకు రాదు కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది అని కావ్య చెప్తుంది.
ఏం ఫీలింగ్ అని రాజ్ అడగ్గానే.. మీరు కేర్‌గా చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ ఆ యామిని వల్ల మీరు నాకు దూరం అవుతారోనని చాలా భయపడ్డాను. తెగిపోయిన గాలి పటంలా మారిన నా జీవితానికి దారమై నిలిచారు. అందరూ ఆస్తులు అంతస్తులు కోరుకుంటారు. కానీ ఒక్క భార్య మాత్రమే భర్త ఎప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. ఐదో తనాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుందండి ఈ లోకంలో అంటూ ఎమోషనల్ అవుతుంది కావ్య. దీంతో రాజ్ అవును కళావతి నేను ఆ యామిని దగ్గరకు ఎలా వెళ్లాను అని అడుగుతాడు. గతంలో మీరు ఆ యామిని ప్రేమ పావురం కదా..? ఆ చాన్స్‌నే అడ్వాంటేజ్‌గా తీసుకుని మీకు యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఆ యామనికి మేనబావ అని మీ అమ్మనాన్నలు చిన్నప్నుడే చనిపోతే వాళ్లే చేరదీసి పెంచారని మిమ్మల్ని నమ్మించింది. మీరు అలా నా దగ్గరకు వచ్చి నా కడుపులో బిడ్డకు ఎవరు అని నిలదీస్తుంటే.. ఆ తండ్రి మీరే అని చెప్పలేక.. మీకు గతం గుర్తు చేయలేక నాలోనేనే నరకం అనుభవించాను.
మీ బిడ్డకు మీరే తండ్రి అని నిలదీస్తే ఏ భార్య అయినా ఏం సమాధానం చెప్పగలదు అండి. ఆరోజు మీరు అలా దోషిని నిలదీసినట్టు నిలదీసి అడుగుతుంతే.. చచ్చిపోవాలనిపించింది. కానీ నా కడుపులో బిడ్డ కోసం ఆగిపోయాను. మనం ఇలా కష్టపడటానికి కారణం ఆ యామినియే.. అది కావాలని అంతా తెలిసినా నాటకం ఆడి మిమ్మల్ని సొంతం చేసుకోవాలిని నన్ను దూరం చేయాలని చూసింది. కానీ మనది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు.. ఆ దేవుడే మనల్ని మళ్లీ కలిపాడు అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. దీంతో రాజ్ కోపంగా ఆ యామిని ఇంత చేస్తుంటే.. చూస్తూ ఎందుకున్నావు కళావతి చంపేయాల్సింది. మీరు కాదు నిన్ను ఇంతలా బాధపెట్టిన ఆ యామినిని నేనే చంపేస్తాను అంటాడు రాజ్. దీంతో వద్దండి దాని పాపాన అదే పోతుంది అంటూ కావ్య ఆపినా… రాజ్ ఆగకుండా కోపంగా యామినిని చంపేస్తాను అంటూ వెళ్లిపోతాడు.
కావ్య కూడా వెనకాలే వెళ్తుంది. యామిని ఇంటి దగ్గరకు వెళ్లగానే.. రాజ్‌ను ఆపి ఏవండి నా మాట వినండి.. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆవేశంలో మీరు ఏదైనా చేస్తే మళ్లీ అందరూ బాధపడాల్సి వస్తుంది అని కావ్య చెప్తుండగానే.. అంటే నిన్ను అంత బాధపెట్టిన దాన్ని వదిలేయాలా..? చేతకానీ వాడిలా చేతులు కట్టుకుని కూర్చోవాలా..? అంటాడు రాజ్. ప్రతి దానికి టైం అంటూ ఉంటుంది అంటున్నా.. అని చెప్పగానే.. నాకు నీ అంత ఓపిక లేదు కళావతి అంటూ రాజ్ ఇంట్లోకి వెళ్తాడు. పైన టెర్రస్ నుంచి అంతా గమనిస్తుంటారు వైదేహి, యామిని. వైదేహి భయంగా బేబీ అలా స్థంభంలా చూస్తూ నిలబడిపోయావు.. రాజ్ ఇంత ఆవేశంతో వచ్చాడు.. నువ్వు వెళ్లి దాక్కో.. నువవు లేవని చెప్పి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను.. అంటూ చెప్పగానే.. రానివ్వమ్మా.. ఏదో ఒకటి చేస్తాను.. అని చెప్తుంది యామిని.
రాజ్ ఇంట్లోకి వచ్చి యామిని గట్టిగా పిలుస్తాడు. యామిని రాగానే కొట్టబోతుంటే.. వెంటనే యామిని రాజ్ కాళ్ల మీద పడి ఏడుస్తూ క్షమించమని అడుగుతుంది. తప్పు చేశానని ఒప్పుకుంటుంది. నీ కోసం పిచ్చి దానిలా నీకు తెలియకుండా నీ వెంటే తిరిగాను.. అనుకోకుండా నీకు యాక్సిడెంట్ అయింది అని చెప్తుండగానే.. దాన్ని నువ్వు వాడుకోవాలి అనుకున్నావా..? అంటూ రాజ్ తిట్టగానే.. అవును కావ్య ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను.. కావ్య కడుపుతో ఉన్నా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు.. అప్పుడే నాకు అర్థం అయింది మీది జన్మజన్మల బంధం అని యామిని చెప్తుండగానే..
కావ్య కోపంగా నువ్వు నటించడం ఆపలేదు యామిని. నువ్వు ఇంకా నటిస్తున్నావు.. అంటుంది. దీంతో అయ్యో అది కాదు కావ్య ఇప్పుడు నేను మనఃస్ఫూర్తిగా చెప్తున్నాను.. రాజ్ ఆనందమే నాకు ముఖ్యం.. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు నాకు అంటుంది యామిని. యామిని ఎంత చెప్పినా రాజ్ కోపంగా యామినికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కారులో వెళ్తూ రాజ్‌ను చూసి కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం