OTT Movie : ఈ సోషల్ మీడియా యుగంలో ఎక్కడ చూసినా ప్రాంక్ ల గోల ఎక్కువగా ఉంది. ఇవి చాలా మంది సరదాకి చేస్తున్నా, కొన్ని ప్రమాదాలు కూడా తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ ఫాస్ట్-పేస్డ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. ఇందులో ఒక ప్రాంక్ వల్ల జీవితాలే తలకిందులు అవుతాయి. ఈ సినిమా సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులకు ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Don’t Hang Up’ ఒక బ్రిటిష్ హారర్-థ్రిల్లర్ సినిమా. ఇది జో జాన్సన్, అలెక్సిస్ వాజ్స్‌బ్రోట్, డామియన్ మాసే దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో గ్రెగ్ సుల్కిన్ (సామ్ ఫుల్లర్), గారెట్ క్లేటన్ (బ్రాడీ మానియన్), బెల్లా డేన్ (పేటన్ గ్రే) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2016,జూన్ 4న లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, 2017 ఫిబ్రవరి, 10న థియేటర్లలో విడుదలైంది. IMDbలో 5.6/10 రేటింగ్ ను పొందింది. 83 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మరియు అపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సామ్ , బ్రాడీ , జెఫ్, రాయ్ అనే టీనేజ్ స్నేహితులు, తమ ఖాళీ సమయంలో ప్రాంక్ కాల్స్ చేసి, వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. ఒక ప్రాంక్‌లో వీళ్ళంతా మిసెస్ కోల్బీన్ కు కాల్ చేసి, ఆమె ఇంట్లో దొంగలు ఉన్నారని, ఆమె కూతురు ఇజ్జీ ప్రమాదంలో ఉందని నమ్మిస్తారు. ఈ కాల్ వీడియో వైరల్ అవుతుంది. కానీ ఈ ప్రాంక్‌కు భయంకరమైన పరిణామాలు ఉంటాయని వారికి తెలియదు. ఒక రోజు సామ్ ఒంటరిగా ఇంట్లో ఉండగా, బ్రాడీ అతని ఇంటికి వస్తాడు. సామ్ తన స్నేహితురాలు పేటన్ తో సంబంధంలో సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. ఇద్దరూ మరిన్ని ప్రాంక్ కాల్స్ చేస్తూ సరదాగా గడపాలని నిర్ణయించుకుంటారు. ఇక వీళ్ళు మరో ప్రాంక్ చేస్తారు. వీళ్ళు తమ పొరుగువాడు లారీకి పిజ్జా ఆర్డర్ చేసి, దొంగలు పిజ్జా డెలివరీ మనిషిగా మారువేషంలో వస్తున్నారని చెప్పి ప్రాంక్ చేస్తారు.
అయితే అదే రాత్రి, సామ్, బ్రాడీకి “మిస్టర్ లీ” అనే ఒక వ్యక్తి నుండి కాల్ వస్తుంది. అతను వారికి ఫోన్ కట్ చేయవద్దు అని ఆదేశిస్తాడు. మొదట వీళ్ళు దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ మిస్టర్ లీ వారి పేర్లు, వ్యక్తిగత వివరాలను కూడా చెప్పడంతో వాళ్ళల్లో భయం మొదలవుతుంది. అతను వాళ్ళ ఇంటిలో వెబ్‌క్యామ్ ద్వారా ప్రతి కదలికను గమనిస్తున్నాడని తెలుస్తుంది. బ్రాడీ తల్లిదండ్రులను అతను బందీగా పట్టుకుని, అతని ఆదేశాలను పాటించకపోతే వారిని చంపుతానని బెదిరిస్తాడు. మిస్టర్ లీ వారిని ఒకరిపై ఒకరు తిరగబడేలా ఒక భయంకరమైన గేమ్ ఆడతాడు. అతను ఇప్పటికే జెఫ్‌ను చంపానని, ఇప్పుడు బ్రాడీ తల్లిదండ్రులు పేటన్ ప్రమాదంలో ఉన్నారని చెబుతాడు. సామ్, బ్రాడీ ఒకరినొకరు రక్షించడానికి ప్రయత్నిస్తూ, మిస్టర్ లీ ఉచ్చులో చిక్కుకుంటారు.
Read Also : ఆణిముత్యం లాంటి కుర్రోడు… అమ్మాయేమో అరాచకం.. ఇద్దరూ కలిస్తే రచ్చ రచ్చే