Ashu Reddy:అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఊహించని క్రేజ్ దక్కించుకున్న ఈమె.. రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. జూనియర్ సమంతగా పేరు అందుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంకా పలు ఆల్బమ్ సాంగ్లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె మరోవైపు సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లో.. స్రవంతి చొక్కారపు తో కలసి వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ఈమెతో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ గొడవ పడడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి, తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డాక్టర్ ప్రియా శెట్టి (Priya Shetty). అసలు విషయంలోకి వెళ్తే.. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సందడి చేశారు. అంతేకాదు ఇటీవల బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2లో పాల్గొన్న కామనర్స్ కూడా ఈ ఫ్యామిలీ స్టార్స్ షోలో పాల్గొన్నట్లు ప్రోమోలో చూపించారు.
also read:పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సుధీర్ తో కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. “ఇట్స్ టైం టు పార్టీ నౌ” అనే పాటకు అందరూ డాన్స్ చేశారు. తర్వాత ప్రియా శెట్టి మాట్లాడుతూ సుధీర్ తో.. ఇంకెన్నాళ్లు ఈ పాత మరదళ్లతో.. కొత్త మరదల్ని నేను అవుదాం అనుకుంటున్నాను అంటూ చెప్పగా.. మధ్యలో అషూ రెడ్డి కలగజేసుకొని.. హలో కొంచెం తగ్గు.. మేమేం అవ్వాలి అంటూ కామెంట్ చేసింది. దీంతో ప్రియా శెట్టి సుధీర్ తో మీకు ఓకే కదా అని అడగగా.. సుధీర్ నాకు డబుల్ ఓకే అంటూ తన అభిప్రాయం చెప్పారు. ప్రియా శెట్టి మాట్లాడుతూ.. తెలుసు.. మీరు చెప్పక్కర్లేదు .. నేను వచ్చిందే ఫస్ట్ టైమే.. మరీ ఇంత రూడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అషూరెడ్డితో కాస్త విభేదానికి దిగింది ప్రియా శెట్టి. అషూ రెడ్డి మాట్లాడుతూ బయట మీకు చెప్పుకోవడానికి మైక్ ఉంది కదా.. చెప్పొచ్చు కదా అంటూ అషూ రెడ్డి ఎవరినో చూసి మాట్లాడుతుండగా.. ప్రియా శెట్టి మాట్లాడుతూ.. అంటే మీరు నన్ను తిడుతున్నారా? వాళ్లను తిడుతున్నారా? వాళ్లను తిడుతుంటే నన్ను తిడుతున్నట్టుంది అంటూ కామెంట్ చేసింది.
అంతటితో ఆగకుండా ప్రియా శెట్టి అక్కడి నుండి కోపంగా స్టేజ్ నుంచి వెళ్ళిపోయింది. అయితే అషూ రెడ్డి మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం చూడవచ్చు. మరి అసలు ఏం జరిగింది ? అనేది తెలియాలి అంటే.. అక్టోబర్ 11 ఆదివారం రాత్రి 7:30 వరకు ఎదురు చూడాల్సిందే.