E-Paper
Advertisement

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ నెల సంపాదన ఎంతంటే?

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ నెల సంపాదన ఎంతంటే?
Advertisement

Madhuri Rathod:సోషల్ మీడియాలో ఆల్బమ్ సాంగ్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న మాధురి రాథోడ్ (Madhuri Rathod) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా రాతిరి రాతిరిలో, ప్రమీల ఓ ప్రమీల, సన్న సన్న బియ్యమే మదనో నా వయ్యారి అంటూ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల “బాసింగ బలాలు” అంటూ మరో పాటతో దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈపాటే వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక అలాంటి ఈమె తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.

మాధురి రాథోడ్ నెల సంపాదన ఎంతంటే?

ముఖ్యంగా ఈ పాటలలో ప్రధాన పాత్రలు పోషించిన ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, డాన్స్ మూమెంట్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ప్రత్యేకంగా వీరిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలా గత కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఇటీవల భారీగా గుర్తింపు లభించింది. చిన్నపిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో మీరంటే తెలియని వారంటూ లేరు అలా తెలంగాణ ఫోక్ సాంగ్ లతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వీరిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలో అనూహ్యంగా ఎఫైర్ కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ఫోక్ సాంగ్స్, యూట్యూబ్, యూట్యూబ్ సాంగ్స్, బ్రాండ్ ప్రమోషన్లు , పెయిడ్ కొలాబరేషన్లు, స్పాన్సర్షిప్ల ద్వారా నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయం తెలిసిన నెటిజన్లు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫోక్ సాంగ్స్ తో గుర్తింపు.. వివాదంతో విమర్శలు..

Advertisement

ఇకపోతే ఈమె చిక్కుకున్న వివాదం ఏమిటి అనే విషయానికొస్తే.. ఫోక్ సాంగులతో తనతో పాటు భారీ పాపులారిటి సొంతం చేసుకున్న ఈశ్వర్ సాయితో ఏకాంతంగా గదిలో పట్టుబడటమే ఈమెను వివాదంలోకి నెట్టివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇదివరకే పెళ్లి జరిగి, బాబు ఉన్న ఈశ్వర్ సాయితో మాధురి ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా అతని భార్యకు దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య.. మాధురి రాథోడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన భర్త మంచోడని మాధురి వల్లే తన భర్త అలా తయారయ్యాడు అంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

also read:అగ్నిపరీక్ష కాదు.. అభిజిత్, నవదీప్ ల స్వయంవరం.. మండిపడ్డ కామన్ మ్యాన్!

ఈశ్వర్ సాయి భార్యపై సోషల్ మీడియాలో పేలుతున్న ట్రోల్స్..

Advertisement

అయితే ఈ విషయాలపై ఈశ్వర్ సాయి భార్య చేసిన కామెంట్లపై నెటిజన్స్ ఆమెను విమర్శిస్తున్నారు. అటు మాధురికి మద్దతు పలుకుతూ ఈశ్వర్ సాయి ని ఏకిపారేస్తున్నారు. ఇటు ఉప్పల్ బాలు కూడా..నీ భర్త మంచోడా.. ఒకవేళ మంచోడు అయితే నిన్ను కాదని మాధురి రాథోడ్తో ఎందుకు రిలేషన్ కొనసాగిస్తాడు.. అతనికి పెళ్లి జరిగిందని, భార్య ఉందని, కొడుకు కూడా ఉన్నాడనే విషయం తెలియదా? ఒక అమ్మాయిపై నిందలు వేసే ముందు మనది కూడా చూసుకోవాలి కదా అంటూ ఈశ్వర్ సాయి భార్యపై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పించారు.

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×