E-Paper
Advertisement

సీఎం రేవంత్‌‌రెడ్డి‌కు కేంద్రం షాక్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ, రియాక్టయిన ముఖ్యమంత్రి

సీఎం రేవంత్‌‌రెడ్డి‌కు కేంద్రం షాక్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ, రియాక్టయిన ముఖ్యమంత్రి
Advertisement

Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ అకస్మాత్తుగా క్యాన్సిల్ అయ్యింది. ముఖ్యమంత్రి టూర్‌కు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఉన్నట్లుండి ఏం జరిగింది? చాలామంది కాంగ్రెస్ నేతలు సీఎం టూర్‌పై చర్చించుకోవడం మొదలైంది.

 

సీఎం రేవంత్‌‌రెడ్డి‌కు కేంద్రం షాక్

Advertisement

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో ఈ టూర్‌కు క్లియరెన్స్ నిరాకరించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికా వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అమెరికా పర్యటన రద్దు కావడంతో ప్రస్తుతం లండన్ నుంచి హైదరాబాద్‌కు ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అమెరికా వెళ్లాల్సిన అధికారుల బృందం టూర్ కొనసాగనుంది.

అమెరికా టూర్ రద్దైనా లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ యథాతథంగా కొనసాగతనుంది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎల్ఎస్ఈ, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యంగా స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతో కీలక భేటీలు జరగనున్నాయి. ఆగస్టు 23న అంటే ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు రానున్నారు.

Advertisement

 

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ

షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తీసుకురావడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చుతామన్నారు. యువత భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రయోజనాలు రాజకీయాలకు అతీతమన్నారు. మరోవైపు కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించినట్టు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌ని ఎవరూ ఆపలేరని అన్నారు.

ఉన్నట్లుండి సీఎం రేవంత్‌రెడ్డి.. అమెరికా టూర్ క్యాన్సిల్ వెనుక అసలు ఏం జరిగింది? దీనిపై తెలంగాణ నేతలు చర్చించుకోవడం మొదలైంది. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రొటోకాల్‌ నిబంధన అనేది ఉంటుంది. ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

 

లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

సీఎం రేవంత్‌రెడ్డి.. యూకే-యూఎస్‌ పర్యటన కోసం చాలారోజుల కిందట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. యూకే పర్యటనకు విదేశాంగశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. రెండురోజుల కిందట సీడబ్ల్యూసీ సమావేశానికి ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి.

ALSO READ: పోలీసుల అదుపులో లింగమనేని సంజూష్? ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇవిగో

సమావేశాల తర్వాత అక్కడి నుంచి నేరుగా లండన్‌ చేరుకున్నారు. శుక్రవారం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని బ్లావట్నిక్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ను సందర్శించనున్నారు.అలాగే సాయంత్రం ఎమిరేట్స్‌ స్టేడియంలో ఈపీఎల్‌ ఫుట్‌బాల్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమానికి హాజరవుకానున్నారు. టూర్ క్యాన్సిల్ వెనుక మరింత సమాచారం తెలియాల్సివుంది.

 

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×