E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఫుల్ హ్యాపీ.. గుణను చిత్తక్కొట్టిన బాలు.. ప్రభా మాటతో షాక్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఫుల్ హ్యాపీ.. గుణను చిత్తక్కొట్టిన బాలు.. ప్రభా మాటతో షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 16th : బాలు కస్టమర్ ను డ్రాప్ చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా.. అక్కడికి వచ్చిన మనోహర్ నీ చూసి బాలు నీ ప్రేమ ఎంతవరకు సక్సెస్ అయింది బ్రదర్ అంటూ వస్తాడు. మీరు చెప్పిన ప్లాను అంతా చేశాను.. కాకపోతే ఇదంతా నేను కేవలం ప్లాన్ ప్రకారం చేశాను అని చెప్పగానే నన్ను చాలా అసహ్యించుకొని వెళ్ళిపోయింది. ఇకమీదట నన్ను ప్రేమిస్తుందని నేను అనుకోవడం లేదు అని అతను అనగానే అలా కాదు ఇంకొక ప్లాన్ చేయాలి అని చెప్తాడు.. ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పలేదు అని బాలు అడుగుతాడు తనకి నీ పుట్టినరోజు అని చెప్పి పిలిచి మళ్లీ దగ్గర ఏ ప్రయత్నం చెయ్యు అని సలహా ఇస్తాడు ఇక మనోహర్ బాలు చెప్పినట్లుగానే విద్యని తన దగ్గరికి రప్పించుకునే పని మొదలు పెడతాడు.. విద్య మాత్రం రోహిణి కాపురం ఏమైపోతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది.

రోహిణి హ్యాపీ..

మనోజ్ దగ్గర ఇన్సూరెన్స్ చేయించాలని ఒక అతను షో రూమ్ కి వెళ్తాడు. అయితే అక్కడ రోహిణి తన కోసం పాలసీ తీసుకుంది అని చెప్పగానే.. మొదట సీరియస్ అయినా మనోజ్ తనకి ఏమైనా పర్వాలేదు అని తీసుకుంది అని అతను చెప్పగానే కాస్త కరిగినట్టు కనిపిస్తాడు. ఇక పాలసీ గురించి ఆ వ్యక్తి ఫోన్ చేసి చెప్పగానే రోహిణి అవునా నిజమా చాలా థాంక్స్ అని అంటుంది. మీరు చూస్తే చాలా మంచి వాళ్ళు లాగా ఉన్నారు. మీరు భర్త చూస్తే వెర్రి మొహం లాగా ఉన్నాడు అని అతను అంటున్నా సరే రోహిణి మాత్రం పాలసీ కన్ఫామ్ అయిపోయింది అని తెలుసుకొని సంతోషంగా ఉంటుంది. మనోజ్ పేరు మీద వచ్చిన ఇన్సూరెన్స్ తో తనకు ఏదైనా అయితే చూపించవచ్చు అని రోహిణి చేసిన ప్లాన్ మాత్రం హైలెట్ గా ఉంటుంది.

మీనా ప్లాన్ సక్సెస్..

Advertisement

విద్య అలా నడుస్తుంది వెళ్తూ ఉండగా ఎదురుగా పువ్వులు ఇచ్చి వస్తున్న మీనాన్ని చూసి ఒక్కసారిగా సంతోషంగా ఉంటుంది. మీనా నీతో మాట్లాడాలి అని అంటుంది. కానీ మీనా మాత్రం నీతో మాట్లాడాలని నాకు లేదు నేను చాలా కోపంగా ఉన్నాను. రోహిణి గురించి ఎన్ని సార్లు నేను అడిగినా కూడా నువ్వు ఏమీ చెప్పలేదు.. కానీ ఇంత మోసం చేస్తుందని అసలు ఊహించలేదు అని మీనా విద్య పై సీరియస్ అవుతుంది. తన భవిష్యత్తు బాగుండాలని నేను కూడా కోరుకున్నాను కాబట్టి నిజాలు చెప్పలేదు మీనా అని విద్య చెప్తుంది.. ఎంతైనా తను నా ఫ్రెండ్ కదా తన గురించి చెప్తే బాగోదు కదా అని చెప్పలేదు మీనా అని విద్య అనగానే సరేలే నీ ఇష్టం అని అంటుంది. రోహిణి గురించి కాదు ఇప్పుడు నా గురించి అడగడానికి నేను వచ్చాను అని అనగానే మీనా నా దగ్గర ఏమి అడగడానికి వచ్చావు అని అంటుంది.

మనోహర్ ను ప్రేమిస్తున్న విద్య..

మనోహర్ తన ప్రేమ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో అని తెలుసుకున్న విద్య ఆ విషయాలని పూసకొచ్చినట్లు మీనాతో చెప్తుంది. ఇక మనోహర్ తనని ఎత్తగా ప్రేమిస్తున్నాడో అనే మీనా చెప్పడంతో విద్య గాల్లో తేలిపోతూ ఉంటుంది. అతను పెట్టిన అన్ని పరీక్షలు పాస్ అయ్యాడు. కాబట్టి నువ్వు అతని ప్రేమించి పెళ్లి చేసుకో అని నేను సలహా ఇస్తుంది.. మీనా ఇచ్చిన సలహా ప్రకారం.. మనోహర్ ప్రేమని ఒప్పుకోవలి అని అనుకుంటుంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకోవడంతో ఆమె సంతోషానికి అడ్డుకట్ట లేకుండా పోయింది. మొత్తానికి విద్యకు కూడా జోడి దొరికేసింది అని తెలిసిపోతుంది..

శివను ఎత్తుకొచ్చిన గుణ..

Advertisement

శివ కాలేజీలో ఎగ్జామ్ ఉందని వెళ్తూ ఉండగా అక్కడ కూర్చున్న గుణం మనుషులు తనని బలవంతంగా తీసుకుని వస్తారు. నువ్వు ఈ లెక్కల్ని చూడాల్సిందే అని బలవంతంగా తనను ఒక గదిలో ఉంచి మరి గుణ అకౌంట్స్ ఎలా ఉన్నాయో చెప్పమని చెప్తాడు. అయితే అగునా మనుషులు బాలు కారు ఎక్కడంతో.. వాళ్లు కార్లో కూర్చొని మందు కొడుతూ ఉండగా బాలు చూసి నా కార్ని కంపకంపు చేశారు కదరా అని వాళ్లతో గొడవ పడతాడు. ఇక గుణ అని తెలియగానే ఇంకాస్త రెచ్చిపోతాడు బాలు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత శివ అక్కడ ఉన్నాడు అని చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయ్యి శివ నీ కొట్టబోతాడు.. నేనేం రాలేదు బావ వీళ్ళే నన్ను బలవంతంగా తీసుకొని వచ్చారు అని చెప్పగానే ఇక గుణ మనుషులని ఒక ఆట ఆడుకుంటాడు బాలు. బాలు కొట్టిన దెబ్బలను చూస్తూ గుణ షాప్ లో ఉండిపోతాడు. అసలు బాలు ఎందుకు కొడుతున్నాడు అని ఆలోచిస్తూ అలానే ఉండిపోతాడు.

రోహిణికి గుడ్ న్యూస్..

శృతి ఇంటికి రాగానే తన ఫ్రెండుకి మేకప్ వేయాలి నువ్వు వెళ్తావా వెళ్ళవా అని రోహిణి దగ్గరికి వచ్చి అడుగుతుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వడం లేదు కదా నేను ఎలా వెళ్లి మేకప్ వేయాలి అని రోహిణి అడుగుతుంది. అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టొద్దు అని చెప్పారు కదా ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఏం బాగుంటుంది అని రోహిణి అంటుంది.. అయినా ఇప్పుడు ఇది బయటకు వెళ్లి ఎంతమంది కొంపలు కూల్చాలి అని ప్రభావతి కఠినంగా మాట్లాడుతుంది.. కానీ సత్యం మాత్రం కోడలు బయటికి వెళ్లే స్వతంత్రం తనకు ఉంది నువ్వు ఏమి మాట్లాడద్దు ఇందులో అని అంటాడు రోహిణి మాత్రం తన తల్లిని కలుసుకోబోతున్న నేను చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. ప్రేమకు ముద్దుపెట్టిన ధీరజ్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×