E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. ప్రేమకు ముద్దుపెట్టిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. ప్రేమకు ముద్దుపెట్టిన ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 16th : నర్మదా శ్రీవల్లి ఎవరితోనో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి. అంత సీరియస్ గా ఈమె మాట్లాడుతుంది అంటే ఏ కంపెనీ కూల్చడానికి ప్రయత్నిస్తుంది అని అనుకుంటుంది.. వేదవతి శ్రీవల్లి ఎవరితోనో మాట్లాడుతుంది. నాకు తెలిసి మీ అక్క తోనే అనుకుంటాను అని అనగానే.. వాళ్ళిద్దరూ కలిసి భద్రతో ఫోన్ చేయడంతో భద్ర ఫోన్ బిజీ వస్తుంది.. ఇంకా డౌటే లేదు భద్ర తోనే మాట్లాడుతుంది అని అనుకుంటుంది. శ్రీవల్లి చాలా సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. నర్మద వేదవతి ఎదురుగా రావడంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటుగా అడ్డంగా దొరికాను అనుకుంటుంది.. ఇక తర్వాత ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని వేదవతి అడిగితే మా అమ్మతో అని అబద్ధం చెప్తుంది కానీ నర్మద మాత్రం వల్లి మీద అనుమానం ఉంది అని అంటుంది ఆ మాటతో వల్లి నేను అడ్డంగా దొరికిపోయాను. ఇంక నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు అని భయపడిపోతూ ఉంటుంది..

శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్…

శ్రీవల్లి ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది అని తెలుసుకున్న నర్మదా కచ్చితంగా భద్రావతి తోనే మాట్లాడుతుంది అని అనుమాన పడుతుంది. ప్రేమ కాపురాని ఎలా కూల్చాలి అని భద్రావతి తో చెబుతున్న సమయంలో సడన్గా నర్మదా వేదవతి ఎంట్రీ ఇవ్వడంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య గారు ఇలా వచ్చారు ఏమైనా కావాలా మీకు అని శ్రీవల్లి అడుగుతుంది. కానీ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని వాళ్ళిద్దరూ అడగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. నేను ఇప్పుడు ఆ భద్రత మాట్లాడుతున్నాను అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని అనుకుంటుంది. అసలు ఈ ఫోన్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది శ్రీవల్లి. అయితే నర్మదకు ఫోన్ ఇస్తూ ఉండగా కావాలని ఫోన్ కింద పడేసి పగలగొట్టేస్తుంది.. శ్రీవల్లి పై నర్మదకు అనుమానం రావడంతో వార్నింగ్ ఇస్తుంది.

నీ బాగోతం బయటపెడతాను..

Advertisement

నువ్వు ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది. అసలు ప్రేమ ఏం తప్పు చేసిందని నువ్వు ఇలా తన జీవితమే నాశనం చేయాలని చూస్తున్నావు. ఆ భద్రావతి తో చేతులు కలిపి నువ్వు చేస్తున్న మోసాలు నాకు తెలియవు అని అనుకుంటున్నావా అని నర్మదా అనగానే శ్రీవల్లి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది. నువ్వు ఏం చేసినా కూడా ఎవరు ఏమీ అనుకోరు అనుకుంటున్నావేమో.. ఈసారి గనక నువ్వు ఏదైనా చేస్తే ఈ ఇంట్లోకి కాదు ఈ భూమ్మీద లేకుండా చేస్తాను అని నర్మదా అంటుంది. నువ్వు ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడావు? ఏం మాట్లాడావు అన్నది కూడా నేను కాల్ రికార్డు మొత్తం తీయడం క్షణాల్లో పని. నా గనక తిక్క రేగితే ఆ కాల్ రికార్డును తీసుకొచ్చి నీ పని చెప్తాను అని వల్లితో అనగానే వల్లి భయపడిపోతుంది. ఏంటి నర్మద నా మీద పడింది ఎలాగైనా సరే నాకు కాల్ రికార్డ్ ని సంపాదించాలని ఉంది కదా ఆ తర్వాత నా గురించి మొత్తం తెలిసిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది.

అమూల్య, విశ్వం లవ్ ట్రాక్..

అమూల్య విశ్వంలో ప్రేమ, ధీరజ్ లను కలపాలి అనే ప్రయత్నంలో ఒకరికి తెలియకుండా ఒకరు దగ్గరవుతూ ఉంటారు. విశ్వం చేస్తున్న మంచి పనికి అమూల్య ఫీదా అవుతుంది. అదేవిధంగా అమూల్య కూడా విశ్వంకి మెల్లగా దగ్గర అవుతుంది అని ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు ఒకరంటే ఒకరు కొట్టుకున్న ఈ జంట.. ఇప్పుడు ఒక జంటను కలపాలని ప్రయత్నంలో వాళ్లు కూడా కలిసిపోతారని గత కొన్ని ఎపిసోడ్ నుంచి చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి అమూల్య విశ్వం ఇద్దరు కూడా ప్రేమలో పడేలా కనిపిస్తున్నారని తెలుస్తుంది.

సాగర్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

సాగర్ బయట లంచం తీసుకుని వచ్చిన డబ్బులని మెల్లగా ఇంటికి తీసుకొని వస్తాడు. నర్మదా గదిలో లేదని చూసి ఆ డబ్బులను ఎక్కడైనా దాచి పెట్టాలి అని అనుకుంటాడు. కానీ అప్పుడే నర్మదా సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో సాగర్ ఒక్కసారగా షాక్ అవుతాడు. ఈ డబ్బులు ఎక్కడివి చూస్తుంటే లక్షల్లో ఉన్నట్లు కనిపిస్తుంది అని అడుగుతుంది. ఇవి నా డబ్బులు మా నాన్న అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకొని ఇలా బ్యాంకులో వేసుకున్నాను అని సాగర్ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు, నర్మదకు అనుమానం గనుక వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అని తనని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు సాగర్.. తనకోసం తెచ్చిన మల్లెపూలను పెట్టి నర్మదను ఈ డబ్బులు విషయన్ని పక్కన పెట్టేలా చేస్తాడు.. ఎపిసోడ్కి ఇదే హైలెట్గా నిలుస్తుంది..

ప్రేమకు ముద్దుపెట్టుకున్న ధీరజ్..

ప్రేమని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని ధీర మరో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత మెల్లగా భద్రావతి ఇంట్లోకి ధీరజ్ వెళ్తాడు. అక్కడే ఉన్నా భద్రావతి కాశీపూర్ తర్వాత లోపలికి వెళ్లడంతో మెల్లగా లోపలికి వెళ్లి ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ సాంగ్స్ వింటూ పడుకొని ఉండడంతో అక్కడికి ఏ సాంగ్స్ పెట్టుకుందో చూడాలి అనుకుంటాడు.. అయితే ఈ ప్రేమ మగాళ్లు వట్టి మాయగాళ్ళు అంటూ పాట వినడంతో ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు. ప్రేమ లేచిన తర్వాత ప్రేమని అరవకుండా ముద్దు పెట్టేస్తాడు. ధీరజ్ ముద్దు పెట్టడంతో ప్రేమ షాక్ లో ఉండిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో వీళ్ళిద్దరూ రొమాంటిక్ గా ఉంటారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది మెసేజ్ ఇవ్వకుండా చూడాల్సిందే..

Also Read :లైవ్ లో ఏడ్చేసిన ఫరియా.. దిమ్మతిరిగే కౌంటర్ భయ్యా..!

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×