Gundeninda GudiGantalu Today episode August 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి అన్నమాట సీరియస్ అయినా మీనా బాలుకి పెద్ద క్లాస్ పీకుతుంది. ఎవరు ఎలా పోతే నీకెందుకు మీరెందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అని నేను అంటుంది. ఇక పూలు డెలివరీ చేయడానికి అర్ధరాత్రి బయటకు వెళ్తుంది. పార్టీలో సంజయ్ అన్న మాటకు బాధపడిన మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. మౌనిక సంజయ్ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ వస్తుంది. వెనకాల లారీ వస్తున్న సంగతి కూడా గమనించకుండా మౌనిక రోడ్డుపై నడుచుకుంటూ రావడం చూసిన మీనా మౌనికను పక్కకు లాగేస్తుంది. అసలు ఏమైంది మౌనిక అర్ధరాత్రి పూట నువ్వేంటి రోడ్డు మీద నా ఒళ్ళు తెలియకుండా నడుస్తున్నామని మీనా అడుగుతుంది.
మౌనిక అసలు విషయం మీనాకు చెప్పేస్తుంది. సంజయ్ పెడుతున్న బాధల గురించి మౌనిక మీ నాతో చెప్పేస్తుంది. మీనా ఇన్ని బాధలు పడుతూ అక్కడ ఎందుకు ఉండాలా వచ్చేసేయి అనేసి అంటుంది. మౌనిక మాత్రం ఆయన్ని మార్చుకునేందుకు నేను ప్రయత్నిస్తున్నాను వదిన ఇదే లాస్ట్ టైం అని రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మౌనికను కలిసిన మీనా ఇంటికి రావడంతో బాలు ఏమైంది అంత డల్ గా ఉన్నావ్ అని టెన్షన్ పడతాడు. అయితే మీనా బాలుని మోసం చేసేస్తుంది. ఏం జరిగిందో చెప్పమంటే అసలు మీనా చెప్పదు. మౌనిక బాధల గురించి నాకు తెలిస్తే ఖచ్చితంగా సంజయ్ ని చంపేస్తాడు అని ఆలోచిస్తుంది.
ఇంటికి వెళ్ళిన మౌనికను చూసి సంజయ్ వచ్చావా నీ పుట్టింటికి వెళ్లి ఏడుస్తూ ఉంటావు అనుకున్నా మళ్ళీ ఇక్కడికే వచ్చావా అని బాధపడేలా మాట్లాడుతాడు. పార్టీలో అంతా అవమానం జరిగితే మళ్లీ ఇంటికి ఎలా వచ్చావు నీకు కొంచమైన సిగ్గు శరం లేదా అంటూ మౌనికను దారుణంగా తిడతాడు సంజయ్. నాకు పెళ్లయింది ఇదే నా ఇల్లు ఇక్కడికి తప్ప ఎక్కడికి వెళ్లాలి అని మౌనిక అడుగుతుంది. పార్టీలో ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు నన్నే మాటలు అంటున్నారు అని మౌనిక అంటుంది. ఇదంతా నాకు తెలియదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అవమానిస్తాడు..
తర్వాత రోజు ఉదయం మీనా పువ్వులను తీసుకొని తన తల్లి దగ్గరికి వెళుతుంది.. పార్వతి జ్వరంతో కూడా పువ్వులు అమ్ముతూ ఉంటుంది.. ఏంటమ్మా నువ్వు జ్వరం వచ్చి కూడా పువ్వులు నమ్ముతున్నావు అడుగుతుంది మీనా.. నువ్వెందుకు అమ్మ తీసుకొచ్చావు మాకు పువ్వులు కూడా తెచ్చిస్తున్నావంటే మీ అత్త ఎంత రచ్చ చేస్తుందో ఆలోచించవా అని పార్వతి అంటుంది. అప్పుడే అక్కడికి గుణ శివ ఇద్దరూ రావడం చూసిన మీనా రెచ్చిపోతుంది..
Also Read: ఢీకి బ్రహ్మముడి కావ్య ఎంట్రీ..దండం పెట్టేసిన ఆది.. ట్విస్ట్ అదిరింది..
అసలు నీ వయసెంత వాడి వయసెంత వాడితో నువ్వు తిరుగుతావ్ ఏంట్రా అని క్లాస్ పీకుతుంది. శివ వద్దని చెప్తున్న కూడా మీనా మాత్రం ఆగకుండా గుణ ని తిడుతుంది. గుణ మాత్రం మీనాకు బుద్ధ చల చేయాలని అనుకుంటాడు. ఇలాంటి వాడితో దూరంగా ఉండకపోతే నీ భవిష్యత్తు బాగోదు అమ్మ నీ మీద ఆశలు పెట్టుకుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని శివ కి చెప్తుంది.
రోహిణి దిలీప్ కి డబ్బులు ఇవ్వాలని మనోజ్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది. మనోజ్ ని మోసం చేసినందుకు బాధపడుతుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. మనోజ్ గుడ్డిగా రోహిణి నమ్మి ఆ లక్ష రూపాయలు ఇచ్చేస్తాడు. బాలు కి మరో పెద్ద సమస్య రాబోతుందని ఓ వ్యక్తి చెప్తాడు.. కానీ బాలు మాత్రం సమస్యలు నా చుట్టూనే ఉంటాయి వాటి గురించి రేపు పట్టించుకోను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో బాలు గురించి గుండెలు పగిలి నిజం మీనాకు తెలిసిపోతుంది. బాలుకు మీనా దూరమవుతుందేమో చూడాలి..