Heavy Rains: తెలంగాణలో వర్షం దంచికోడుతుంది. పలు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. దీంతో అయిపోయిందా అని అనుకుందాం అంటే ఇంకా ఎక్కువగా కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శనివారం రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు ఐఎండీ గుర్తించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది.
మరో రెండు రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..
అంతేకాకుండా తెలంగాణకు మరో రెండ్రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్ వ్యాప్తంగా అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం
నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, మియాపూర్, కొండాపూర్‌లో కుండపోత వాన పడింది. పటాన్‌చెరు, కూకట్‌పల్లి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, జవహర్‌నగర్, ప్యాట్నీ, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇటు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలోనూ వర్షం పడుతోంది.
Also Read: భారత్‌తో చైనా దోస్తీకి సై.. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?
తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం
మరోవైపు సంగారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమవ్వడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 13.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా మేడపల్లెలో 11.9 సెంటిమీటర్లు, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 11.3 సెంటిమీటర్లు, మేడారంలో 10.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 10.7 సెంటిమీటర్లు, ఖమ్మం జిల్లాలోని కొనిజెర్లలో 9.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఏర్కారంలో 8.6 సెంటిమీటర్లు, మేడ్చల్‌లో 8.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్
భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం
ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం#HyderabadRains #TelanganaRains pic.twitter.com/oPH7gQbjQ6
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025