E-Paper
Advertisement

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు ఢీకొని దంపతులు మృతి!

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు ఢీకొని దంపతులు మృతి!
Advertisement

Palnadu Road Accident: అమరావతి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

వెల్లటూరు రోడ్డులోని హనుమాన్‌నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దంపతులిద్దరూ బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక జీపు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బైక్ పైనున్న దంపతులు రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను వల్లూరి రవి (58), ఆయన భార్య సావిత్రి (55)గా గుర్తించారు. కాగా, సావిత్రి స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. రోజువారీ పనుల్లో భాగంగా బయటకు వెళ్లిన దంపతులు ఇలా అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన జీపు డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement

Also Read: ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

Tags

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×