E-Paper
Advertisement

టీడీపీ కంచుకోటపై మిత్రపక్షాల కన్ను.. ఉత్తరాంధ్రలో మారిన పవన్, బీజేపీ వ్యూహం!

టీడీపీ కంచుకోటపై మిత్రపక్షాల కన్ను.. ఉత్తరాంధ్రలో మారిన పవన్, బీజేపీ వ్యూహం!
Advertisement

North Andhra Politics: ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. అయితే, పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే.. సైలెంట్‌గా రూట్ మ్యాప్ మారుస్తోంది జనసేన. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు ఉత్తరాంధ్రలో వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ బెల్ట్‌పై స్పెషల్ నజర్ పెట్టారు. టీడీపీకి ఎక్కడైతే గ్రిప్ తక్కువగా ఉందో.. ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటూ జనసేన జెండా నాటేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్సే టార్గెట్‌గా జనసేన స్పీడ్ పెంచడం.. సైలెంట్‌గా చెక్ పెట్టే వ్యూహమే అనే చర్చ మొదలైంది.

ఉత్తరాంధ్రపై క్లియర్ కట్ ప్లాన్‌.. కమలం పార్టీ

Advertisement

మరోవైపు, కమలం పార్టీ కూడా ఉత్తరాంధ్రపై క్లియర్ కట్ ప్లాన్‌తో ఉంది. ఇప్పటికే ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ స్ట్రాంగ్ నెట్‌వర్క్ బీజేపీకి ప్లస్ పాయింట్. విశాఖ వేదికగా జరిగిన RSS జాతీయ సమావేశాలు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్‌కు నితిన్ నబీన్, మోహన్ భగవత్ వంటి బిగ్ షాట్స్ హాజరవ్వడం పొలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతోంది. గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వంటి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ.. కేంద్రం మార్క్ డెవలప్‌మెంట్ అజెండాతో జనం మధ్యలోకి వెళ్లేందుకు కమలనాథులు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.

2029 రాజకీయానికి బీజేపీ బిగ్ స్కెచ్..

Advertisement

2029 రాజకీయాన్ని ఇప్పుడే డిసైడ్ చేసేలా బీజేపీ బిగ్ స్కెచ్ వేస్తోంది. వైజాగ్ మాజీ ఎంపీ, జాతీయ ఉపాధ్యక్షురాలు పురందేశ్వరి అనుభవాన్ని ఉత్తరాంధ్రలో ఉపయోగించుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ గనక సరైన సీట్లు కేటాయించకపోతే.. జనసేనను కూడా కలుపుకొని సొంతంగా పవర్ చూపించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్‌. ఉత్తరాంధ్రలో తమ ఉనికిని కాపాడుకుంటూనే.. భవిష్యత్తులో నంబర్ వన్ ప్లేస్ సాధించడమే పవన్, బీజేపీ కాంబో టార్గెట్‌గా కనిపిస్తోంది. మరి తమ్ముళ్ల కంచుకోటను వీళ్లు బ్రేక్ చేయగలుగుతారా..? అనేది వెయిట్ అండ్ సీ.

Also Read: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు ఢీకొని దంపతులు మృతి!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×