Gundeninda GudiGantalu Today episode August 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు చూపించిన పెద్ద షాప్ చూసి చాలా బాగుంది అని అంటారు. మనోజ్ ఎంత పని దొంగ అయిన ఓనర్ కుర్చీలో కూర్చుంటే దర్జాగా ఉన్నాడు అని బాలు మురిసిపోతాడు. సత్యం బాలు మాటతో సంతోష పడతాడు. ప్రభావతి కూడా బాలు మాట విని సంతోషపడుతుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లి షాప్ చాలా బాగుంది సెంటర్లో ఉంది కదా మంచి లాభాలు వస్తాయి ఏంటో ఆలోచిస్తూ ఉంటారు. ఇక మీనా భోజనాలు అయ్యాయి రండి అనేసి అంటుంది. అందరూ భోజనానికి కూర్చుంటే శృతి మీనా అని కూడా భోజనం చేయమని అడుగుతుంది. కానీ మీనా మాత్రం నేను ఇప్పుడు చెయ్యను..
మీరందరూ తిన్న తర్వాత తింటానులే అని అంటుంది. మీనాని ఎంత బ్రతిమలాడినా మీనా కూర్చోదు. దానికోసం సపరేట్ గా కూరల్లో వండి పెట్టుకుని ఉంటుందిలే.. అందుకే ఇప్పుడు తినదు తర్వాత దాచిపెట్టుకుని తెచ్చుకుని తింటుంది లేని ప్రభావతి అంటుంది. మీనా సీరియస్ అవుతుంది. మనోజ్ షాప్ పేరుపై పెద్ద చర్చ జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. అంత పెద్ద షాపు కొంటే మనోజ్ ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ తలా ఒక పేరు పెట్టమని చెప్తారు. మీనా మాత్రం సుశీల ఫర్నిచర్స్ అని పెడితే బాగుంటుందని అంటుంది.. అమ్మమ్మ గారిది మంచి మనసు ఆవిడ పేరు మీద పెడితే బాగా జరుగుతుంది అని అంటుంది. కానీ ఎవరు కూడా ఆ పేరు గురించి ఆలోచించరు. మేము ఆలోచించి మంచి పేరు నిర్ణయిస్తామని రోహిణి మనోజ్ అంటారు. ఇక రూమ్ లోకి వెళ్లిన వాళ్ళిద్దరూ ఏం పేరు పెట్టాలని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.
రోహిణి అత్తయ్య పేరు పెడితే బాగుంటుంది కదా అని అంటుంది. దానికి అస్సలు ఒప్పుకోవడం మనోజ్. నా పేరు కలిసి రావడం లేదు ఆమె పేరు పెడితే మన షాప్ కూడా దివాలా తీస్తుంది అని అంటారు. గదిలోకి వెళ్తున్న బాలు వీళ్ళ మాటలు విని అక్కడికి వస్తాడు. బట్టలు తీసుకొస్తున్న మీనా బాలు అటుగా వెళ్లడం చూసి ఏమైందని అనుకుంటుంది. మా అమ్మ పేరు మీద పెడితే కచ్చితంగా మనం చిప్పకూడు తినాలి అని మనోజ్ అనడం బాలు రికార్డ్ చేస్తాడు.
వాళ్ళిద్దరూ బెడ్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే బాలు సడన్గా ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా మా రూమ్ లోకి వచ్చేసావ్ కనీసం పర్మిషన్ కూడా తీసుకోవాలని లేదా అని మనోజ్ అంటాడు. నేను ఊరికే రాలేదు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని బాలు అంటాడు. ఏమైందిరా ఎందుకు వచ్చావు చెప్పు అని అడుగుతాడు మనోజ్.. షాప్ కి నువ్వు ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకా ఆలోచించలేదు డిసైడ్ అయ్యాక అందరికీ చెప్తామని మనోజ్ అంటాడు. నువ్వు అమ్మపేరే షాప్ కి పెట్టాలి. ఈ రికార్డు బయట పెట్టాను అనుకో నీ బండారం మొత్తం బయటపడి మళ్లీ నువ్వు గుడి ముందు చేరుతావు అని అంటాడు.
Also Read : ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!
ఆ రికార్డు అమ్మ వింటే కచ్చితంగా మనల్ని బయటకు గెంటేస్తుంది అని మనోజ్ రోహిణి టెన్షన్ పడుతూ ఉంటారు.. మీనా ఎందుకండీ వాళ్ళని ఇబ్బంది పెడతారు అది వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న షాప్ అది వాళ్ళ ఇష్టం కదా అని అంటుంది.. అమ్మకి నేనంటే ఇష్టం లేకపోయినా అమ్మంటే నాకు ఇష్టం అమ్మ చేతి గోరుముద్దలు తినాలని నాకు ఉంటుంది మీనా అని బాలు అంటాడు. ఇదేనేమో తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అని మీనా అంటుంది. మరి బాలు చెప్పినట్లు మనోజ్ ప్రభావతి పేరుతో షాప్ ఓపెన్ చేస్తాడా? లేదా మరో కొత్త పేరుని పెట్టుకుంటాడా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..