Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ రాజకీయాలు ఏవిధంగా ఉండనున్నాయి? పార్టీని మిగతా రాష్ట్రాలకు విస్తరించే పనిలో పడ్డారా? బీజేపీ నుంచి పూర్తిగా అండదండలు ఉన్నాయా? దశాబ్దం కాలం సమయం ఇవ్వాలని ఎందుకు అడిగారు? ఇంతకీ త్రిశూల వ్యూహం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అన్నదానిపై చర్చ మొదలైంది.
జనసేన ఫ్యూచర్ రాజకీయాల గురించి తన అంతరంగాన్ని బయటపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అందుకు టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. కేవలం తనకు దశాబ్దంపాటు సమయం ఇవ్వాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు.ఇంతకీ పవన్ అసలు టార్గెట్ వైసీపీ అని అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.
చీటికి మాటికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలను ఒక్కటే కోరుతున్నారు. దశాబ్దంపాటు కూటమి బంధం బలంగా ఉంటుందని చెబుతున్నారు. దశాబ్ద కాలం తనకు సమయం ఇవ్వాలని, మిమ్మల్ని నాయకులుగా, దేశ నిర్మాణంలో కీలక వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తనది అని చెప్పుకొచ్చారు. ఈలోగా ఏపీలో అభివృద్ధి ఒక లెవల్‌కి వస్తుందన్నది కొందరు నేతల మాట.
పార్టీ కూడా బలంగా తయారు అవుతుందని, అప్పుడు సొంతంగా పోటీ చేయాలన్నది జనసేనాని ఆలోచనగా చెబుతున్నారు. ఈ దశాబ్దం పాటు రాజకీయాలు ఏవిధంగా ఉంటాయన్నది కూడా వివరించారు. దసరా తర్వాత ‘త్రిశూల్’ కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు పవన్ కళ్యాణ్.
ALSO READ: తెలంగాణ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలన్న సీఎం చంద్రబాబు
ప్రతి క్రియాశీలక సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతే ప్రధాన అంశాలుగా ఆ కార్యక్రమం ఉండబోతుందని వెల్లడించారు. మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్ దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామం మొదలు నియోజకవర్గం, పార్లమెంటు, జిల్లా, రాష్ట్ర స్థాయి బలమైన శక్తిగా పార్టీని ఎదిగించాలన్నది జనసేన ఆలోచన.
బాధ్యతలు మోయడంలో కుటుంబాన్ని విస్మరించానని, సినిమాలపై సరిగా దృష్టి పెట్టలేదన్నారు పవన్ కల్యాణ్. అన్నీ వదిలేశానేమో కానీ జన సైనికులు, వీర మహిళలపై సంపూర్ణ దృష్టి పెట్టానన్నారు. దాని ఫలితం దేశంలో ఘనమైన విషయం సాధించామన్నారు. 100 శాతం విజయం సాధించడమంటే ఆశామాషీ కాదన్నారు.
నాయకులు కావాలనే ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికీ దిశానిర్దేశం చేస్తానన్నారు. దేశ నిర్మాణం కోసం, బలోపేతం కోసం కలిసి అడుగులు వేద్దామన్నారు. అన్నట్లు జనసేన సభకు జాతీయ పార్టీ లుక్ వచ్చింది. పార్టీ కార్యక్రమం కోసం జనసేన కార్యకర్తలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు.
ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. వారిలో కర్ణాటక కార్యకర్తలు ఆ రాష్ట్ర జెండాను తీసుకొచ్చారు. జనసేన జెండాలతో కలిపి ఆ జెండాను ప్రదర్శించారు. దీంతో పవన్ కల్యాణ్ ఆ జెండాతో పాటు కండువాలను తెప్పించుకుని మెడలో వేసుకుని జెండాను ఊపారు. దీంతో సభ జరుగుతున్న ప్రాంతం ఒక్కసారిగా మార్మోగిపోయింది.
మనం బలహీనపడితే ఏపీలో మళ్లీ అరాచక పాలన వస్తుందని చెప్పకనే చెప్పారు. అందువల్లే కూటమి దశాబ్దంపాటు సాగాలన్నారు. అందుకే 15 ఏళ్ల పాటు రాజకీయ స్థిరత్వం అవసరమని నొక్కి వక్కానించారు. భాగస్వామ్య పక్షాలతో సమస్యలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. గడచిన ఐదేళ్లు తమ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏనాడూ కేంద్రం సహాయం కోరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
దసరా తర్వాత త్రిశూల్ కార్యక్రమం: పవన్ కళ్యాణ్
ప్రతి క్రియాశీలక సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతే ప్రధాన అంశాలుగా త్రిశూల్ కార్యక్రమం
నాయకులు కావాలనే ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికీ దిశానిర్దేశం చేస్తాను
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/H6jdrTvbg9
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2025