Gundeninda GudiGantalu Today episode December 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను కలవడానికి వచ్చిన శృతి పై సంజు దాడి చెయ్యాలని అనుకుంటాడు. మీనా వాడిని దారుణంగా కొడుతుంది. శృతిని కాపాడి ఇంటికి తీసుకొని వెళ్తుంది. ధైర్యం చెబుతుంది.. అనవసరంగా టెన్షన్ పడొద్దు అని ఇంటికి తీసుకు వెళుతుంది. ఇంట్లో కూర్చుని పెట్టి కుటుంబం అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది? ఉమ్మడి కుటుంబంలో ఉంటే.. రక్షణ, ధైర్యం.. మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్ గా ఉంటే అలాంటి నమ్మకాలు, ధైర్యం ఉండదని, ఇప్పటికైనా అందరితో కలిసి విధంగా ఆలోచించు.. రవిని అర్థం చేసుకో అని చెబుతోంది. అప్పుడే రవి ఇంటికి వస్తాడు. శృతి నీకేం కాలేదు కదా అని టెన్షన్ పడతాడు. వదిన ఫోన్ చెయ్యగానే నేను ఎంత టెన్షన్ పడ్డానో అని శృతిని ఓదారుస్తాడు. మీనా ఏం కాలేదు అంటుంది. ఇక నేను వెళ్తాను అని చెప్తుంది. శృతి థ్యాంక్స్ చెప్తుంది. నేను నీకు పరాయి దాన్ని కాదు అక్కను అవుతానని చెప్తుంది.
ఇక బాలు మీనాకు ఫోన్ చేస్తాడు. మీనా నేను కాస్త బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను అనేసి అంటుంది. ఈ మీనా మళ్లీ కొంపమీదకి ఏదో తీసుకొస్తుందని బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు. మీనా సురేందర్ దగ్గరికి వెళ్తుంది. శృతి పై సంజయ్ దాడి చేసిన విషయాన్ని వాళ్లకు చెప్తుంది. శృతి వాళ్ళమ్మ టెన్షన్ పడుతుంది. ఇక సురేంద్ర నాకు శృతి అని వాళ్ళు ఎవరో తెలియదని ముందుగానే అంటాడు. ఓ ఉన్మాదికిచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఆ విషయం తెలుసుకున్న మీ కూతురు రవిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉందని చెబుతోంది. మీరు చూసిన ఆ రాక్షసుడు తనను వేదిస్తున్నాడని చెప్తుంది. తనపై యాసిడ్ దాడి చేశాడంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది. ఇప్పటికైనా మీ కూతురికి అండగా ఉండి, తన ప్రాణాలను కాపాడుకోండి అని సలహా ఇచ్చి వెళ్లిపోతోంది.. ఇంటికి రాగానే మీనా పై కోపంతో అరుస్తాడు. నేను శృతిని కలవడానికి వెళ్ళాను అండి అనేసి అంటుంది. శృతి ఎవరు అని బాలు అడగ్గానే రవి వాళ్ళ భార్యను కలవడానికి వెళ్ళాను అంటుంది. రెస్టారెంట్లు అన్ని మాటలు అన్న తనని కలవడానికి నువ్వు ఎందుకు వెళ్లావు అని అనగానే నేను చెప్పేది కాస్త వింటారా అని అడుగుతుంది. అప్పుడే మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. మీడియా వాళ్ళు మీనా చేసిన సాహసాన్ని పొగుడుతూ బిరుదులు ఇస్తారు. దానికి బాలు ఫుల్ ఖుషి అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక బాలుని కూడా మీడియా వాళ్ళు అడుగుతారు. మీ భార్య గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అనగానే బాలు మీనా చాలా మంచి అమ్మాయి. కానీ ఇంత ధైర్యం చేసిందంటేనే నమ్మలేకపోతున్నాము. కానీ ఒక అమ్మాయిని కాపాడింది అంటే మాకు సంతోషంగా ఉందని బాలు చెప్తాడు. ఇక ప్రభావతి మనోజ్ రోహిణి భయంతో ఇంట్లోకి వచ్చేస్తారు. బాలు మీడియా వాళ్ల దగ్గర నుంచి మీనా విసిరిన రాయిని తీసుకుంటాడు. నిజం చెప్పు నువ్వు ఇంత బరువున్న రాయిని ఎలా విసిరావు అనేసి అడుగుతాడు. ఇక ఇంట్లోకొచ్చిన రోహిణి బాలు మీనాలు ఇద్దరూ రౌడీలుగా మారి అందరిని కొడుతూ గొడవలు తెచ్చి పెడుతున్నారు. కొద్ది రోజులు పోతే వీళ్ళు కలిసి రౌడీ అండ్ కో అనే కంపెనీని స్టార్ట్ చేస్తారేమో అనేసి అనగానే మనోజ్ బాగా చెప్పావని నవ్వుతాడు. బాలు లోపలికి రాగానే మమ్మీ ఈ స్టోన్ చూసావా ఎలా ఉందో మీనాను నువ్వు అన్న మాటలు అన్ని విన్నావుగా నీకు ఏదైనా మీనాను అంటావా బయటికి వెళ్ళింది అని అరుస్తావా అంటూ రాయిని చూపించి బెదిరిస్తాడు. మీనా కొట్టిన దెబ్బలు చూసి భయపడిన ప్రభావతి నేనెందుకు అంటాను.. గుడికి వెళ్తే మంచిదే కదా అని అంటుంది. ఇక ఈ లక్షలు మింగినోడు ఏదో అన్నాడు. మనోజ్ కు చూపిస్తూ ఇన్ డైరెక్టర్గా వార్నింగ్ ఇస్తాడు బాలు. ఈ సమయంలో అమ్మాయి అంటే అనుకువగానే కాదు.. అవసరమైతే ఆదిశక్తుల పోరాడాలంటూ మీనాను పొగిడేస్తాడు.. ఇక మౌనిక కూడా నిన్ను చూసి నేర్చుకుంటాను అని అంటుంది. ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం టెన్షన్ పడుతుంటారు..
ఇక ఇంట్లో అందరు మీనాను చూసి భయపడతారు. ఏదైనా అడగాలని అన్నా కూడా కొడుతుందేమో అని టెన్షన్ పడతారు. ఇక బాలు భార్య చేసిన దానికి ఫుల్ ఖుషి అవుతుంటాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. తన ఫ్రెండ్స్ మీనా చేసిన సాహసానికి నువ్వు ఎలాగైనా పార్టీ ఇవ్వాలని అడుగుతారు. ఇక బాలు మీ నాన్న చూసి మురిసిపోతూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. మీనా ఏంటండీ అలానే చూస్తున్నారు అంటే. నువ్వు నిజంగా ఆ రాయితో కొట్టావా? నాకు ఇంకా డౌట్ గానే ఉంది అనేసి బాలు అంటాడు. మీరు మీ ఎదవలు అనుమానాలు అంటుంది. నన్ను తక్కువ చేసి చూస్తున్నారు నా గురించి మీకు తెలియదనుకుంటాను అని అనగానే ఆపమ్మ నీ గురించి బాగా తెలిసింది చూశాంగా ఎలా కొట్టావో అనేసి అంటాడు. ఇక దానికి మురిసిపోతుంది మీనా. ఇక రాత్రి అవగానే ఫ్రెండ్స్ అందరూ పార్టీ ఇవ్వాలని అడుగుతున్నారు నేను వెళ్తున్నాను ఇంట్లో నువ్వే మేనేజ్ చేయాలి అనేసి చెప్తాడు బాలు. మళ్లీ తాగడం మొదలు పెట్టారా అనగానే లేదు లేదు నువ్వు చేసిన దానికి పార్టీ అడిగారు అందుకే వెళ్తున్నాను నువ్వు కొంచెం మేనేజ్ చేయాలి అని చెప్పేసి మీనాకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు.. ఇక మీనా మురిసిపోతూ ఉంటుంది. ఇక బార్లో రాజేష్ మీనా గురించి పొగడ్తలతో ముంఛేత్తుతాడు.. ఇక పక్కనే సంజయ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుంటాడు. పొగుడుతుంటే వాళ్ళు రగిలిపోతాడు. రాజేష్ పొరపాటున సంజయ్ కాలు తగిలింది కింద పడతాడు. దాంతో గొడవకు దిగుతాడు సంజయ్. తన ఫ్రెండుని కొడతావని బాలు సంజయ్ ని చిత్తగొట్టేస్తాడు. ఎవరు ఎంతమంది ఆపాలని చూసినా తన ఫ్రెండ్నే కొడతావని బాలు దారుణంగా కొడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ తో ఏం జరుగుతుందో చూడాలి..