Gundeninda GudiGantalu Today episode February 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ట్రిప్ కి వచ్చిన వ్యక్తిని వదిలేసి పార్క్ దగ్గర పాంప్లెట్లు ఇవ్వాలని వాచ్మెన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాచ్మెన్ కి పాంప్లెట్స్ ఇచ్చి అతనికే కొంత డబ్బులు ఇచ్చి పార్క్ కి వచ్చినోళ్ళు అందరికీ పంచమని చెప్పి వెళ్ళిపోతాడు అదే టైంలో మనోజ్ అక్కడ ఉండడం చూసి బాలు షాక్ అవుతాడు. ఇతను ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు అన్న అని వాచ్మెన్ అడిగి తెలుసుకుంటాడు. రెండు నెలల నుంచి ఆళ్ళిద్దరూ పని పాట లేకుండా పోరంబోకులుగా ఉంటూ ఇక్కడే ఇంట్లో బాక్స్ తెచ్చుకుని తినడం టైం పాస్ చేస్తూ ఉంటారు అని వాచ్మెన్ చెప్తాడు. ఆ మాట వినగానే బాలు ఇంట్లో వాళ్లకు ఎలాగైనా ఈ విషయం చెప్పాలని వీడియో రికార్డ్ చేస్తాడు. ఇక ఇంటికి వెళ్ళగానే అరుస్తూ శృతిని లాప్టాప్ తీసుకు రమ్మని చెప్తాడు. కానీ శృతి మాత్రం నా లాప్టాప్ నేను ఇవ్వను అని అంటుంది నీకు ఒక షార్ట్ ఫిలిం చూపిస్తాను. వెంటనే తీసుకురా అనేసి బాలు అంటాడు.. మనోజ్ బాగోతాన్ని బయట పెడతాడు. అందరు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు చూసావా నానా మీ పెద్ద కొడుకు లక్షల మింగిన కొడుకు ఎలా అంటున్నాడు వాడు చేసే జాబ్ ఇదే మీరు గుండెపోటు మాత్రం తెచ్చుకోకండి నాన్న అని సెటర్లు వేస్తాడు. ఇక ప్రభావతి మనోజ్ బండారం బయటపడుతుందని బాలుని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ బాలు మాత్రం ప్రతి విషయాన్ని బయట పెట్టాలని వీడియోలు మీద వీడియోలు చూపిస్తాడు. రోహిణి బాలు కావాలని చేస్తున్నాడని అనుకుంటుంది. బాలు ఇది క్లైంట్ విషయం కాదమ్మా అని అక్కడ ఉన్న పార్క్ వాచ్మెన్ తో, కార్ షో రూమ్ లో వీడియోని రికార్డ్ చేసి చూపిస్తాడు. వీడు రోజు చేసే పని ఇది లక్షల మింగడం మాత్రమే కాదు జాబ్ కూడా లేకుండా పార్కులో తిరుగుతున్నాడు ఈ ప్రభావతం మాతా దానికి సాక్ష్యం అనేసి అంటాడు.. మనోజ్ ఇంటికి రాగానే నాలాంటి పెద్ద పర్సన్ ఇంటికి రాగానే ఇలాంటి పూలు కొట్టారు ఇక్కడ కనిపిస్తే నాకు ఎంత చిరాకు కనిపిస్తుంది నేను ఎంతో కష్టపడి అసలే సీనియర్ ఎగ్జిక్యూటివ్ని నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అనేసి అనగానే మనోజ్ కి బాలు ఆ వీడియోని చూపిస్తాడు. తమరు పడే కష్టం ఇదే కదా అనేసి బాలు అంటాడు. ఆ తర్వాత ప్రభావతి మనోజ్ నీ కవర్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ పాలు మాత్రం ప్రభావతి నోరు మూయిస్తాడు. ఇక సత్యం ఇదంతా నా తప్పే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోలేకపోయానని బాధపడతాడు.
మీ అమ్మ ఇన్ని రోజులు వాన్ని జాబ్ లేకుండానే దాచి పెట్టింది అంటే వాడి తప్పేం లేదు మీ అమ్మ వాళ్ళని సమర్థించి మనల్ని మోసం చేసిందని సత్యం బాలుతో అంటాడు. ఇక బాలు మీనా శృతి రవి అందరూ కలిసి రోహిణిని దారుణంగా తిడతారు. మీనా ఇంకాస్త ఎక్కువగా సెటైర్లు వేస్తుంది. మా ఆయన ఇస్త్రీ చొక్కాలు వేసుకొని వెళ్తున్నాడు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆమాత్రం మీ ఆయన ఎక్కడ చేస్తున్నాడని నన్ను నాన్న మాటలు అన్నావు కదా మీ ఆయన చేసే పని మా ఆయన చేయట్లే అని సెటైర్లు వేస్తుంది.
అందరూ తలా ఒక మాట అనడంతో రోహిణి బాధపడుతూ లోపలికి వెళ్తుంది మనోజ్ లోపలికి వెళ్లి ఎంత ఓదార్చాలని చూసినా కూడా రోహిణి మాత్రం అస్సలు మనోజ్ నేను నమ్మను అని మొహానే చెప్పేస్తుంది. ఇక రోహిణి విజ్జి దగ్గరికి వెళ్తుంది. తనకి జరిగిన విషయాన్ని చెప్తుంది.. బిజీ మాత్రం నువ్వు చేసినంత పోలిస్తే మనోజ్ చేసింది పెద్ద తప్పు కాదు నువ్వు ఎంత పెద్ద మోసం చేసి తనని పెళ్లి చేసుకున్నవో తెలుసా అంటే అవును నేను చేసింది మోసమే నేను దానికి రోజు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నీ మనోజ్ ని ఎంత నమ్మాను నాకు లైఫ్ సెక్యూరిటీగా ఉంటాడని చాలా ఊహించుకొని తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని రోహిణి బాధపడుతుంది.
ఇక నాకు చిన్నప్పుడే ఒక పెళ్లి జరిగిపోయింది అది అనుకోకుండా జరిగింది అలానే వెళ్ళిపోయింది ఇప్పుడు నా ఇష్ట ప్రకారంగా నేను మనోజ్ ని పెళ్లి చేసుకుని బ్రతుకుతున్నాను జాబ్ లేదన్న విషయాన్ని నాకు చెప్పి ఉంటే నేను అంత ఫీల్ అయ్యే దానికి కాదు అని రోహిణి ఫీల్ అవుతుంది. మనోజు విజ్జి కి ఫోన్ చేస్తాడు. విజ్జి రోహిణి ఇక్కడ లేదని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..