Gundeninda GudiGantalu Today episode January 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి అనుకున్న ప్లాన్ ప్రకారం చిన్న కొడుకు, కోడలు ఇంటికి వచ్చారు. రవి, శృతిలకు చూసిన ప్రభావతి కాళ్లు చేతులు ఆడవు. తన కొడుకు ఆస్తి ఉన్న కోడలు ఇంటికి రావడంతో ఆనందంలో మునిగిపోతుంది. తన అదృష్టదేవత ఇంట్లో అడుగుపెట్టబోతుందని భావిస్తుంది. కానీ, మనోజ్ అసూయపడుతాడు. రవి ఇంట్లోకి వస్తే.. తనకు రెస్పెక్ట్ ఉండదని భావిస్తాడు. రవి, శ్రుతిలు ఇంటికి రావడం సత్యం కూడా నచ్చదు. దీంతో సైలెంట్ గా ఉండిపోతాడు. పెళ్లయిన తర్వాత తొలిసారి రవి, శృతిలు ఇంట్లో కాలు పెడుతున్నారు. కాబట్టి.. హారతి ఇవ్వమని రోహిణిని పిలుస్తోంది. కానీ, అందులోనే మీనా హారతి తీసుకొని వస్తుంది. కానీ, ఆ హారతి పళ్లేన్నా రోహిణి ఇవ్వమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. ఇక రోహిణి హారతి తీసుకురావడానికి వెళ్తే మీనా హారతి తీసుకొని వస్తుంది. హారతి రోహిణి ఇవ్వాలని అనుకుంటుంది. కానీ మీనా హారతి తీసుకోవడం చూసి ప్రభావతి రోహిణికివ్వు రోహిణి ఇస్తుంది అని అంటుంది. దానికి శృతి మీనా ఇస్తే ఏమైనా తప్పు జరుగుతుందా ఆంటీ అని అడుగుతుంది.. అదేం లేదమ్మా అని అనగానే మీనాని ఇవ్వాలి అని శృతి అంటుంది ఇక రవి రోహిణి వదిన మీనా వదిన ఇద్దరు కలిసి ఇవ్వండి అని అంటాడు. శృతి ఏది చెప్పినా అడ్డకోలుగా మాట్లాడుతుంది. దాంతో సత్యం షాక్ అవుతాడు. ఇక ప్రభావతి కవర్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. ప్రభావతి చిన్న కోడలు దృష్టిలో మంచిది అవ్వాలని ట్రై చేస్తుంది. ఇంట్లోకి వచ్చి రాగానే గొప్పలు చెప్పుకుంటుంది. ప్రేమలు కురిపిస్తుంది. మీరు ఇంట్లోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనగానే శృతి మీరేం కష్టపడ్డారు ఆంటీ అంతా మీనా వల్లే కదా జరిగింది అని ప్రభావతి గాలి తుస్సున తీసేస్తుంది.. మీనా లేకపోతే నేను మీ ఇంట్లో అడుగు పెట్టే దాన్ని కాదు. అంటూ ప్రభావతికి షాక్ ఇస్తుంది. మీనా ను తన ముందే పొగడడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఇదేంటి వస్తూనే నా గుప్పెట్లో పెట్టుకోవాలని నేను అనుకుంటే మీ నాకు కనెక్ట్ అవుతుంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇక మీనా శృతి లు బాగా క్లోజ్ అయిపోతారు. బాలు ఏం చేయలేక వెళ్ళిపోతాడు. రాజేశ్ కు ఈ విషయాన్ని చెప్పి బాధపడతాడు..
ఇక నేను ఎంత అనుకున్నా కానీ మా అమ్మ మాత్రం అనుకున్నది సాధించేసింది అని బాలు అంటాడు. ఇక చేసేదేమీ లేదు ఆ లక్షలు మింగినోడిలాగే లేచిపోయినోడిని కూడా ఇంట్లో పెట్టుకోవాలి మా నాన్నకు ఎన్ని సమస్యలు వచ్చి పడతాయని బాలు తెగ ఫీల్ అవుతాడు. దానికి రాజేష్ వాళ్ళు నీకు శత్రువులు కాదు బాలు వాళ్ళు నీ తోడబుట్టిన వాళ్లే నీ ఇంటికి వస్తే తప్ప ఏమీ లేదు అనేసి రాజేష్ బాలుకు సర్దు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక బాలు ఇంటికి వెళ్ళగానే మీనా పై కోపంగా చూస్తాడు. నువ్వు హారతి ఇంట్లోకి తీసుకొచ్చావు కొంచమైనా నీకు ఉందా నాన్నకి ఇలా జరగడానికి కారణం వాడే వాడిని ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు అని అరుస్తాడు. ఇక మీనా మీకు ఏదైనా కోపమే మీ నాన్నగారే ఒప్పుకున్నారు మధ్యలో మీది ఏంటి నాకు అర్థం కావట్లేదని సీరియస్ అవుతుంది. ఇక ప్రభావతి కూడా బాలుని చేయాలని అనుకుంటుంది.. ఇక శృతి ఇంట్లోకి రాగానే మీనా కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటుంది అది చూసి పార్వతి షాక్ అవుతుంది. నా కోడలి నుంచి డబ్బులు రాబట్టాలని నేను ఎన్నో కలలు కన్నాను. ఇదేంటి మీనాకు కనెక్ట్ అవుతుందని షాక్ అవుతుంది. ఇక శృతికి మీనా వంట పని నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ప్రభావతి అది చూసి మీనాన్ని తిడుతుంది. అంత గొప్ప ఇంట్లో పుట్టిన అమ్మాయి వంట పని ఎలా చేస్తుందని మీనాని అరుస్తుంది. అది బాలు ప్రభావతిపై అరుస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..