OTT Movie : ఓటీటీలో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. రోజురోజుకూ ఇలాంటి సినిమాలకు ఆదరణ పెరుగుతుండడంతో ఓటీటీలు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను, ఈ జానర్ కు చెందిన ఎంగేజింగ్ స్టోరీలను పుష్ చేస్తున్నాయి. ఇక ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి మూవీనే. ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘జవానుం ముల్లపూవుం’ (Jawanum Mullappoovum). 2023లో రిలీజ్ అయిన ఈ మలయాళ ఫ్యామిలీ డ్రామా-థ్రిల్లర్ కు రఘు మీనన్ దర్శకత్వం వహించగా, సురేష్ కృష్ణన్ రచించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. కొచ్చి నేపథ్యంలో సాగే ఈ కథలో, స్కూల్ టీచర్ అయిన జయశ్రీ, ఆమె కుటుంబం, కోవిడ్ మహమ్మారి సమయంలో సాంకేతిక జ్ఞానం లేకపోవడం వల్ల ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. శివద నాయర్, సుమేష్ చంద్రన్, రాహుల్ మాధవ్, దేవి అజిత్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫీల్-గుడ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రారంభమై, క్రమంగా సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంది,
కథలోకి వెళ్తే…
కథ జయశ్రీ (శివద నాయర్) అనే స్కూల్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన ఆర్మీ నుండి రిటైరైన భర్త గిరిధర్ (సుమేష్ చంద్రన్), గాడ్జెట్-ఫ్రెండ్లీ కుమార్తె దియా (బేబీ సాధిక మీనన్)తో కొచ్చిలో నివసిస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో, జయశ్రీ ఆన్‌లైన్ టీచింగ్ కు అలవాటు పడటానికి కష్టపడుతుంది. ఎందుకంటే ఆమెకు సాంకేతిక జ్ఞానం పెద్దగా ఉండదు. గిరిధర్ ఒక క్రమశిక్షణ ఉన్న లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతాడు. అయితే దియా ఆధునిక గాడ్జెట్ వినియోగం ఆ ఫ్యామిలీ డైనమిక్స్‌ను మారుస్తుంది.
ఒక రోజు జయశ్రీ యొక్క ల్యాప్‌టాప్ సమస్యల కారణంగా, ఆమె సాయం కోసం సాజన్ పీటర్ (రాహుల్ మాధవ్) అనే టెక్నీషియన్‌ను సంప్రదిస్తుంది. కానీ అర్ధరాత్రి అతన్ని పిలవడంతో ఊహించని కష్టాలు ఎదురవుతాయి. జయశ్రీ అనుకోకుండా ఒక సైబర్ స్కామ్‌లో చిక్కుకుంటుంది. ఇది ఆమె కుటుంబం ఆర్థిక, వ్యక్తిగత జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ సాలమన్ (బాలాజీ శర్మ), ఇతరులు (దేవి అజిత్, సినీ అబ్రహం) ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కానీ కథ క్రమంగా సస్పెన్స్‌ఫుల్ థ్రిల్లర్‌గా మారుతుంది.
జయశ్రీ మరియు గిరిధర్ కలిసి ఈ సవాళ్లను ఎదుర్కొంటూ, కుటుంబ బంధాలను బలోపేతం చేసుకుంటారు. అయితే సైబర్ దాడి వెనుక ఉన్న నిజం కథలో అనేక ట్విస్ట్‌లను తీసుకొస్తుంది. క్లైమాక్స్‌లో కుటుంబం ఈ సమస్యలను ఎలా అధిగమిస్తుందనేది ఒక భావోద్వేగమైన ముగింపుతో వెల్లడవుతుంది. ఇంతకీ టీచర్ ఈ సమస్యను ఎలా ఫేస్ చేసింది? అసలు ఆ కంప్యూటర్లో అంతగా ఏముందని ? టీచర్ ను ఆమె కుటుంబాన్ని చిక్కుల్లో పడేసిన ఆ సైబర్ క్రైమ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : స్మశానంలో చోటు కోసం కొట్టుకుచచ్చే పిచ్చోళ్ళు… ఓటీటీలో గత్తర లేపుతున్న కీర్తి సురేష్ మూవీ