Family Stars Promo: జబర్దస్త్ కమెడియన్ హీరో సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు
హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్.. బుల్లితెరపై నటిస్తున్న చేస్తున్న నటీనటులు ఈ షోలో సందడి చేస్తుంటారు. తాజాగా ఈ షో నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. సీరియల్, బిగ్‌బాస్ సెలబ్రెటీలు చాలా మంది గెస్టులుగా వచ్చారు. గౌతమ్ కృష్ణ , ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, పంచ్ ప్రసాద్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ ప్రోమో చాలా సరదాగా సాగింది. ఎపిసోడ్ నవ్వులు పూయించేలా ఉందని అర్థమవుతుంది. ఇందులో జబర్దస్త్ పవిత్రకు జోడి దొరికేసింది. ఒకసారి ప్రోమో ఎలా ఉందో చూసేద్దాం..
ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో..
సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కి యావర్‌తో పాటు బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ సహా జబర్దస్త్ కమెడియన్లు కూడా వచ్చారు. ఇందులో ఫుడ్డీస్ వర్సెస్ ఫిట్‌నెస్ ఫ్రీక్స్ పేరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రోమో అంతా బానే ఉంది కానీ చివరిలో ఈ స్టేజ్ మీద ఒక మాట చెప్పాలి పవిత్రకి.. అంటూ యావర్ సిగ్గుపడ్డాడు. ఇంతలో ఏయ్ పిచ్చి లేసిందా మా అమ్మ ఉంది ఇక్కడ.. అంటూ పవిత్ర చెప్పింది.. నిజం చెప్తున్నా పవిత్ర నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే సిగ్గుపడుతూ.. అదొక షో అన్న సంగతి కూడా మర్చిపోయి పవిత్రని ఎత్తుకొని తిప్పుతాడు. ప్రోమో కి ఇదే హైలెట్గా నిలిచింది. అయితే ఇది కేవలం షో వరకేనా లేక నిజంగానే ప్రపోజ్ చేసాడా? అన్నది తెలియలేదు.. కానీ ప్రస్తుతం అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా కూడా ఈమధ్య బుల్లితెరపై లవ్ ట్రాక్లు ఎక్కువవుతున్నాయి. కంటెంట్ కోసం జనాలను పిచ్చోళ్లను చేయడం ఆ తర్వాత మేము ఫ్రెండ్స్ కేవలం స్కిట్ కోసమే చేసామంటూ కవర్ చేయడం కామన్ అయిపోయింది.. అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే ప్రోమో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఎపిసోడ్ ఎంత రచ్చగా సాగుతుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Also Read : మంచు విష్ణు ‘ కన్నప్ప’కు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శన…
బిగ్ బాస్ ప్రిన్స్ యావర్…
బిగ్‌బాస్ సీజన్ 7 ద్వారా బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు ప్రిన్స్ యావర్. అంతకుముందు కొన్ని సినిమాలు, షోలలో కనిపించినా బిగ్‌బాస్ ద్వారానే యావర్‌కి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్‌లో యావర్ తన బ్రదర్స్‌తో అన్న మాటలు, చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన బాధను చెప్పి ఆడియన్స్ ను కన్నీళ్లు పెట్టించారు. యావర్ విన్నర్ అయితే కాలేదు కానీ బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. అటు పవిత్ర విషయానికి వస్తే.. ఫ్యామిలీ స్టార్స్ షో రెగ్యులర్‌గా చేస్తుంది. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే గతేడాది పవిత్ర తన లవ్‌కి బ్రేకప్ చెప్పేసింది. సంతోష్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన పవిత్ర తన గురించి అప్పుడు పెద్ద పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మేము విడిపోతున్నాము అంటూ మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ బిజీగా ఉంది.