Gundeninda GudiGantalu Today episode july 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి మాత్రం కామాక్షిని ఆపుతూ ఉంటుంది. కొట్టు ఇంటి దగ్గర ఉంటే ఎవరు పరువు పోయింది ఆ మనోజ్ గాడు ఆడుకోవడం మా చీటీ పట్టుకొచ్చే వాళ్ళందరూ చూశారు నాతో అన్నారు కూడా అని అంటుంది. నువ్వేం బాధపడకు మీనా ? నీ పూలు కొట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తుందిలే అని కామాక్షి వెళ్లిపోతుంది.. కానీ మీనా మాత్రం బాధ పడుతూనే ఉంటుంది. మీనా దగ్గరికి భోజనం తీసుకెళ్లిన బాలు ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? ఎవరో నువ్వంటే ఇష్టం లేనివాళ్లే ఇలా చేశారు నువ్వేం బాధపడకు అని అంటాడు. నాకు నేను గుర్తింపు తెచ్చుకోవడానికి అదొక్కటే కారణం. అదే లేకుండా పోవడంతో నాకు చాలా బాధగా ఉంది అని మీనా అంటుంది. నువ్వు ఇలా సంపాదించడం ఓర్వలేకే ఎవరో కావాలనే ఇలా చేశారు. ఆ దేవుడనేవాడు ఉంటే కచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు అని బాలు అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా చేత కూడా పూలు ఇంటికి పంపిస్తే ఎలా ఉంటుంది అని బాలు ఆలోచిస్తాడు. ఈ ఐడియా చాలా బాగుందిరా.. మరి బండి కావాలి కదా అని అంటారు. బండిని కొందాము నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయని అంటారు. అయితే ముందు బండిని చూసొద్దాం అని వెళ్తాడు. అక్కడ మీనాకు నచ్చిన రంగు బండి దొరకపోవడంతో ఏదో ఒక బండిని సెలెక్ట్ చేస్తాడు బాలు.. ఆ అయితే ఇంకొక 10000 కావాలని అడుగుతాడు. ఒక ముసలాయనొచ్చి నా ఇంటిలో రౌడీలున్నారు. అది ఖాళీ చేయిస్తే నేను మీకు ఆ 10000 ఇస్తానని అంటాడు.. బాలు ఆ రౌడీ దగ్గరికి వెళ్తాడు..
ఆ రౌడీలకు మొదట మర్యాదగా వార్నింగ్ ఇస్తాడు.. ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ రౌడీలు బాలుపై గొడవకు దిగుతారు. మీరు మాటలతో చెప్తే వినేటట్టు లేరు కచ్చితంగా మీకు ఏదో ఒకటి చేయాలి అని బాలు వాళ్లతో గొడవకు దిగుతాడు. రౌడీలను చితగ్గొట్టి ఆ ఇంట్లోంచి ఖాళీ చేయిస్తాడు బాలు. బయట పెద్దాయన ఉండడం చూసినా రౌడీలు మేము ఇంటిని కాళీ చేసి వెళ్ళిపోతాం కొట్టదు అని చెప్పండి పెద్దయ్య అని కాళ్ళ మీద పడతాడు దాంతో బాలు వాళ్ళని వదిలేస్తారు.
అటుగా వచ్చిన కామాక్షి ప్రభావతి అక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతుంది అని చూడ్డానికి వెళ్తారు. అక్కడ బాలుని చూసి షాక్ అవుతారు. బాలు ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అని కామాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత వీడు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారని షాక్ అవుతారు. ఆ పెద్దాయన డబ్బులు ఇవ్వడం చూసిన ప్రభావతి కచ్చితంగా ఇంట్లో అడగాలి అని అనుకుంటుంది. బాలు మాత్రం ఇంటికి వెళ్ళగానే అందరికీ ఫోన్ చేసి బయటికి రమ్మని అడుగుతాడు. అయితే అందరూ బయటకు వచ్చి ఈ స్కూటీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి రా అని అడుగుతారు.
Also Read : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..
ఏది ఏమైనా మీనా కోసం ఈ స్కూటీ కొన్న మాకు చాలా సంతోషంగా ఉందని సత్యం కూడా తన కొడుకుని చూసి పొంగిపోతాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి మీనా కోసం ఇలాంటివి చేయడం చాలా సంతోషంగా ఉంది అని అందరూ బాలుపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇంతకీ ఈ స్కూటీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి రాని అడుగుతాడు సత్యం. ప్రభావతి మాత్రం వాడు రౌడీయిజం చేసి రౌడీలను కొట్టి సంపాదించాడు అని అంటుంది. ఆ విషయం పట్టుకొని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది ప్రభావతి. నా ఇంట్లో ఉండనే ఉండదు వెళ్ళిపో అని బాలుని బయటకి గెంటేస్తుంది. అప్పుడే ఆ ఇంటికి రౌడీలను ఇల్లు ఖాళీ చేయించిన పెద్దమనిషి వస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి..