Gundeninda GudiGantalu Today episode june 16th : భోజనాలు కూడా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు.. ఏదైనా మన లేచిపోయినోడు రేంజ్ వేరు అని బాలు కూడా భోజనాలపై ప్రశంసలు కురిపిస్తాడు. మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది.. ఫంక్షన్ కి వచ్చిన విద్యను చూసిన బాలు ఎలాగైనా సరే రోహిణి బండారాన్ని అని బయట పెట్టాలని అనుకుంటాడు.. విద్యను అడిగితే విద్య మాత్రం మాట్లాడుకున్న మౌనంగా ఉంటుంది.. ఏదో ఒకటి నేనే చూస్తాను కచ్చితంగా ఈ రోహిణి ఎవ్వరు బయట పెడతానని బాలు మీనాతో అంటాడు..
మీనాకు ఒక పెద్ద కాంట్రాక్టు రావడంతో చాలా సంతోషంగా ఉంటుంది.. దాదాపు 5 లక్షల కాంట్రాక్టు దీన్ని మనం చేస్తే మన పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆర్డర్లను మనకే వస్తాయి అని మీనా బాలుతో అంటుంది.. కానీ దానికి మనం ఇంకాస్త డబ్బులుని సరి చేయాలి అప్పుడే మనం పైకి వస్తామండి అని అంటుంది.. అయితే వాళ్ళు అడ్వాన్స్ కాస్త తక్కువ ఇచ్చారు.. ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవాలి అని అనగానే నా దగ్గర అయితే ప్రెసెంట్ డబ్బులు లేవు మీనా అని బాలు అంటాడు..శృతిని డబ్బులు అడగడం మంచిది అని మీనా అంటుంది. ఒకసారి అడిగి చూద్దామా అని మీనా అంటుంది. మరి ఆమె సాయం చేస్తుందో లేదో మీనా అని బాలు అన్న కూడా మీనా ఒకసారి అడిగి చూద్దామండి అని అంటుంది..
రవి, శృతి సినిమా విషయంలో గొడవ పడుతూ ఉంటారు.. ఎప్పుడూ నా ఇష్టాలు కాకుండా నీ ఇష్టాలే చూడాలని అంటావా అని రవి కూడా శృతి తో మాటకు మాట వాదిస్తూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మీరు సమయానికి వచ్చారు లేకపోతే ఈ సినిమా చూడలేక చచ్చిపోతాను అని అంటుంది. అయితే ఎందుకు మీరు ఇలా వచ్చారు అని అడగ్గానే మీనా కి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది.. దానికి వాళ్ళు అడ్వాన్స్ తక్కువ ఇచ్చారు మీరు కొంచెం సర్దుబాటు చేస్తారని మీ దగ్గరికి వచ్చామని చెప్పగానే.. శృతి నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను అని అంటుంది అటు రవి కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను అని అంటాడు.. ఇద్దరు కూడా ఒకరినొకరు అనుకుంటూ ఉండగా ఎవరో ఒకరు ఇవ్వండి అని మీనా అంటుంది…
అయ్యో ప్రభావతి డాన్స్ క్లాస్ కి చింతామణి వస్తుంది. అక్కడ మీనా గురించి లేనిపోనివి ఎక్కించి ప్రభావతికి చెప్తారు..మీనా ఆర్డర్ ని గనుక చేస్తే మీ చేతుల నుంచి జారిపోతుంది మీరు చెప్పిన మాట వినదు అని ప్రభావతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇక మీనా గురించి పూర్తిగా తెలుసుకొని ప్రభావతి ఆమె చెప్పింది నిజమే అని అనుకుంటుంది. నేను మీనా ని ఆర్డర్ కి రాకుండా చేయాలంటే ఏం చేయాలి అని ప్రభావతి అడుగుతుంది.. డెకరేషన్ రోజు మీనా నీ ఇంట్లో నుంచి బయటికి రానివ్వకండి అంతే.. ఈ విషయాన్ని మీరు మీనాతో మాత్రం చెప్పకండి. నేను పోటీకి వస్తున్నదని మీతో లేనిపోనివి చెప్పానని అనుకుంటుంది అని కావాలని అంటుంది.
ప్రభావతి చాలా ఆవేశంగా ఇంట్లోకి వస్తుంది.. అయితే ఇంట్లోకి రాగానే అరుస్తూ ఆవేశంగా కేకలు పెడుతూ వస్తుంది. ప్రభావతి ఏయ్ మీనా.. నా గురించి ఏం చెప్తున్నావే బయట కనీసం అత్త అన్న మర్యాద కూడా లేకుండా బయట నా గురించి చెడుగా చెప్తున్నావా.? అసలు నా గురించి తప్పుగా ఎందుకు చెప్తున్నావ్ అంటే నేను ఒక గయ్యాలి నేను అందరితో చెప్తున్నావా అని ప్రభావతి మీనా నీ ఘోరంగా అవమానించేలా మాట్లాడుతుంది. మీనా గురించి ఎవరు ఎంత చెప్తున్నారు సరే ప్రభావతి మాత్రం వినకుండా నా గురించి బయట చెప్తే మాత్రం అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. ఏమీ అనకుండానే నాపై ఎవరో చాడీలు చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు శృతి అని మీనా బాధ పడిపోతుంది. ప్రభావతి అన్న మాట విన్న బాలు మీనా గురించి నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడుతున్నావా అసలు ఏం జరుగుతుంది నీకు అని అంటాడు.
రాజేష్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ 2000 ఫైనాన్స్ ఇస్తాడు అని బాలిక చెప్పడంతో వాడు కావాలనే మన మీద పగబెట్టాడు రా వాడిని ఏదో ఒకటి చేయాలి అని బాలు అంటాడు. అటు సుమతి ఆస్పత్రికి అరుణ్ తన తల్లిని తీసుకొని వస్తాడు. అయితే సుమతి ఆమెని చాలా బాగా చూసుకోవడంతో అరుణ్ సుమతీల మధ్య లవ్ ట్రాక్ మొదలు ఎలా కనిపిస్తుంది. అరుణ్ వాళ్ళ అమ్మకి సుమతి బాగా నచ్చింది.. నా కుటుంబం గురించి ఎన్నో డీటెయిల్స్ అడిగినా అరుణ్ వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇల్లు మాత్రం బృందావనం అవుతుంది అని అంటుంది.. తర్వాత అరుణ్ సుమతిని ప్రేమగా చూస్తాడు..
బాలు ఎటువంటి ట్రిప్పులు లేవు అని ఇంట్లో కూర్చుని ఉండగా మీనా మీకు ఇప్పుడు ట్రిపుల్ ఏమీ లేవా.. అయితే ఈ కూరగాయలు కట్ చేయండి నేను వంట చేస్తాను అని బాలుకి పెద్ద పని అప్పగిస్తుంది.. మొగుళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటే పెళ్ళాలు అస్సలు ఊరుకోరు కదా కూరగాయలే కదా కట్ చేస్తాను అని బాలు అంటాడు.. ప్రభావతి బాలుని ఇలా చూస్తే కచ్చితంగా అరుస్తుంది పెళ్ళాం వలలో చిక్కుకున్నాడు అని తిడుతుంది అని మీనా అనుకుంటూ ఉంటుంది. మీరు ఇలా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మీ అమ్మ నా కొడుకుని పూర్తిగా మార్చేసింది అని బాధపడిపోతుందేమో అని మీనా అంటుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన ప్రభావతి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా బాలు కత్తి తీసుకొని లోపలికి వస్తాడు. అది చూసిన ప్రభావతి ఏంట్రా కత్తితో చంపేస్తావా ఏంటి నువ్వు మీ ఆవిడకి ఏవైనా చెప్పు నాకు ఏ సంబంధం లేదు అని అంటుంది. ఆవిడ నిన్న నీకు కాదు పూలవతి మా నాన్నని ఈ వయసులో కూడా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అని అన్నావు కదా అందుకే నాకు నచ్చలేదు అని అంటాడు ఇక మాట వినగానే ప్రభావతి బాలుని వంగొ పెట్టి గుద్దేస్తుంది దాంతో బాలు గుండెకాయలు గులాబ్ జామ్ లాగా రాలిపోయాయి అని అంటాడు. ఈ విధంగా మనోజ్ ని కొట్టి ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు కదా అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..