E-Paper
Advertisement

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులపై క్రేజీ ఆఫర్లు.. ఎన్ని వేలు డిస్కౌంట్ ఇస్తుందంటే!

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులపై క్రేజీ ఆఫర్లు.. ఎన్ని వేలు డిస్కౌంట్ ఇస్తుందంటే!
Advertisement

Hero Special Offer on Flex-Fuel Bikes: దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు ప్రోత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తన ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌ సైకిళ్లపై ప్రత్యేక ఆఫర్‌ ను ప్రకటించింది. ఇటీవలే E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో స్ప్లెండర్+, HF డీలక్స్ బైక్‌ లను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు ఈ రెండు మోడళ్లపై రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

తగ్గింపు తర్వాత ధరలు ఎలా ఉన్నాయంటే?

తగ్గింపు తర్వాత స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.78,710కు చేరగా, HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ ధర రూ.68,792గా ఉంది. ఇప్పటికే, తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్‌ లుగా పేరున్న ఈ రెండు మోడళ్లు ఇప్పుడు మరింత చౌక ధరలకు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

ధరల పరంగా చూస్తే, స్ప్లెండర్+ ఫ్లెక్స్ మోడల్ సాధారణ E20 వెర్షన్ కంటే కేవలం రూ.1,153 మాత్రమే ఎక్కువగా ఉంది. మరోవైపు HF డీలక్స్ ఫ్లెక్స్ మోడల్ మాత్రం దాని E20 కంప్లైంట్ i3S వేరియంట్ కంటే సుమారు రూ.1,650 తక్కువ ధరకే లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని వినియోగదారులు పెద్దగా ఖర్చు లేకుండానే పొందే అవకాశం ఉంది.

త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకుల అమ్మకం

ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ ల అమ్మకాలు తొలుత ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఇతర మార్కెట్లలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని హీరో మోటోకార్ప్ బావిస్తోంది.

ఫ్లెక్స్ ప్యూయల్ బైకుల ఇంజిన్ గురించి..

Advertisement

స్ప్లెండర్+ ఫ్లెక్స్, HF డీలక్స్ ఫ్లెక్స్ మోడళ్లలో హీరోకు బాగా పరిచయమైన 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. అయితే, దీనిని ప్రత్యేకంగా E20 నుంచి E85 వరకు వివిధ ఇథనాల్ మిశ్రమాలతో పనిచేసేలా అప్‌ డేట్ చేశారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా ఈ ఇంజిన్ హై ఇథనాల్ శాతం ఉన్న ఇంధనాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది.

E85 ప్యూయల్ తో ఈ ఇంజిన్ 8,000 ఆర్‌పీఎం వద్ద 8.6 హెచ్‌పీ శక్తిని, 6,000 ఆర్‌పీఎం వద్ద 8.3 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే పనితీరును అందించడంతో పాటు, మంచి ఫ్యూయల ఎఫిషియెన్సీని కలిగి ఉంటుంది.

ఇంజిన్ లో కీలక మార్పులు

ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యవస్థకు అనుగుణంగా బైక్‌ లలో కొన్ని కీలక మార్పులు చేశారు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) కాలిబ్రేషన్‌ ను అప్ డేట్ చేయడంతో పాటు, కొత్త ఫ్యూయల్ పంప్, అడిషనల్ ఫ్యూయల్ ఫిల్టర్ లాంటి భాగాలను అమర్చారు. ఇవి హై ఇథనాల్ మిశ్రమాలతో కూడా ఇంజిన్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి.

పెట్రోల్‌ వినియోగాన్ని తగ్గిస్తూ, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచాలనే  ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా హీరో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లను తీసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.4,000 తగ్గింపు కారణంగా ఈ మోడళ్లకు మార్కెట్లో మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.

Read Also: కవాసకి నింజా బైక్‌లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.2.89 లక్షల వరకు తగ్గింపు!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×