OTT Movie : ఇప్పుడు ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్లతో ఈ సినిమాలు హోరెత్తిస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్స్ ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి పేర్లు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘రహస్య’ (Rahasya)
2015 లో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకి మనీష్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇది 2008 నోయిడాలో జరిగిన డబుల్ మర్డర్ కేసు (ఆరుషి తల్వార్ కేసు) నుండి స్ఫూర్తి పొందింది. ఇందులో కే కే మీనన్ (CBI ఆఫీసర్ సునీల్ పరాస్కర్), అశిష్ విద్యార్థి (డాక్టర్ సచిన్ మహాజన్), టిస్కా చోప్రా (డాక్టర్ ఆర్తి మహాజన్), మీతా వశిష్ట్, అశ్విని కల్సేకర్ (రెమీ ఫెర్నాండెస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2015జనవరి 30న ఈ సినిమా విడుదలైంది. 2 గంటల 5 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.5/10 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ సినిమా ఆరుషి కేసుతో పోలికలు ఉన్న కారణంగా, తల్వార్ కుటుంబం నుండి వివాదాన్ని ఎదుర్కొంది. కానీ దర్శకుడు ఇది ఫిక్షనల్ స్టోరీ అని, నిజ జీవిత పేర్లను ఉపయోగించలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ZEE5 లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
‘రేఖాచిత్రం’ (Rekhachithram)
2025 లో వచ్చిన ఈ మలయాళం మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించారు. దీనిని కావ్య ఫిల్మ్ కంపెనీ, ఆన్ మెగా మీడియా బ్యానర్‌లలో వేణు కున్నప్పిల్లి, ఆంటో జోసెఫ్ నిర్మించారు. ఇందులో ఆసిఫ్ అలీ (వివేక్ గోపీనాథ్), అనస్వర రాజన్ (రేఖా పాత్రోస్), మనోజ్ కె. జయన్, సిద్ధిక్, జగదీష్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్, ఇంద్రన్స్, జరీన్ షిహాబ్, భామ అరుణ్, మేఘా థామస్, నిషాంత్ సాగర్, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025న జనవరి 9న థియేటర్లలో విడుదలై, మార్చి 7 నుండి సోనీలీవ్ Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 27 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో 7.9/10 ను కలిగి ఉంది. ఈ స్టోరీ 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది.
‘ది స్మైల్ మ్యాన్'(The Smile Man)
2024 లో వచ్చిన ఈ తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ప్రవీణ్ దర్శకత్వం వహించారు. ఇది శరత్‌కుమార్ నాటినచ్చిన 150వ చిత్రంగా నిలిచింది. ఇందులో సిజా రోజ్, ఇనియా, కలైయరసన్, జార్జ్ మరియన్, సురేష్ చంద్ర మీనన్, రాజ్‌కుమార్, కుమార్ నటరాజన్, బేబీ ఆజియా వంటి నటులు నటించారు. గవస్కర్ అవినాష్ దీనికి సంగీతం అందించారు. 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2025 జనవరి 24 నుండి ఆహా తమిళ్ (Aha Tamil) లో స్ట్రీమింగ్ అవుతోంది. 122 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో 7.4/10 రేటింగ్ ను కలిగి ఉంది.ఈ స్టోరీ కోయంబత్తూరు సమీపంలో జరిగే వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. “స్మైల్ మ్యాన్” అనే సీరియల్ కిల్లర్‌ను,
మతి మరపు ఉన్న ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆతరువాత స్టోరీ ఊహించని ట్విస్టులతో నడుస్తుంది.
‘టేబుల్ నం. 21’ (Table No. 21).
2013 లో వచ్చిన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య దత్ దర్శకత్వం వహించారు.ఇందులో పరేష్ రావల్, రాజీవ్ ఖండేల్వాల్, టీనా దేశాయ్, ధ్రువ్ గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2 గంటల 2 నిమిషాల రన్ టైమ్‌తో,IMDbలో 7.2/10 రేటింగ్ ను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5 లలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ స్టోరీ ఫిజీలో ఒక జంట రూ. 21 కోట్ల కోసం ‘టేబుల్ నం. 21’ అనే గేమ్ షోలో పాల్గొనడం చుట్టూ తిరుగుతుంది. ఈ గేమ్ ఒక జీవన్మరణ పోరాటంగా జరుగుతుంది.
‘అంజామ్ పతిరా’ (Anjaam Pathiraa)
2020 లో వచ్చిన ఈ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకి మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఇందులో కుంచాకో బోబన్, షరఫ్ యూ దీన్, శ్రీనాథ్ భాసి, ఉన్నిమాయ ప్రసాద్, జిను జోసెఫ్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. షైజు ఖాలిద్ సినిమాటోగ్రఫీ, సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. అషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ మరియు మాన్యువల్ మూవీ మేకర్స్ బ్యానర్‌లలో ఈ సినిమాను నిర్మించారు. ఇది 2020న థియేటర్లలో విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. IMDbలో 7.9/10 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ సినిమా 1980లో కేరళలోని సీరియల్ కిల్లర్ రిప్పర్ చంద్రన్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. Aha లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : భార్యను ప్రతిరోజూ ఒంటిపై నూలు పోగు లేకుండా చెక్ చేసే భర్త… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్