BJP Leader Shoots Wife | ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. రాష్ట్రంలోని సహారన్‌పూర్ జిల్లాకు చెందిన ఒక బిజేపీ నాయకుడు తన భార్య, ముగ్గురు పిల్లలను తుపాకీతో కాల్చి చంపబోయాడు. కానీ ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలలోని గంగోహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. సహారన్ పూర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యనిర్వహక సభ్యుడు, పేరొందిన నాయకుడైన యోగేష్ రోహిల్లా గత కొన్ని రోజులుగా తన భార్యతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అతను శనివారం తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి ఆమెను చంపేందుకు ఒక తుపాకీతో కాల్చాడు. ఆమెకు పుట్టిన పిల్లలు కూడా తన పిల్లలు కాదని అపనమ్మకంతో పిల్లలను సైతం చంపాలను కున్నాడు. అందుకే ముగ్గురు బిడ్డలను కూడా వెంటనే తుపాకీ షూట్ చేశాడు.
కానీ ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోగా.. అతని భార్య, ఒక పాప గాయాల పాలై ఆసత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. కాల్పులు ఘటన గురించి స్థానికులు సమాచారం అందించగా గంగోహ్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందతుడు హత్యలు చేసిన తరువాత అక్కడే ఉన్నాడని.. అతని వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు సహారన్ పూర్ ఎస్ఎస్‌పి రోహిత్ సాజ్వాన్ తెలిపారు.
Also Read: భార్యను హత్య చేయమంటే కొడుకును చంపిన కిరాయి హంతకులు.. ఎందుకు చేశారంటే
“నిందితుడు యోగేష్ రోహిల్లాను అరెస్ట్ చేశాం. అతని వద్ద నుంచి హత్యలు చేసేందుకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నాం. భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన నిందితుడు ఆమెకు పుట్టిన పిల్లలు తన పిల్లలు కాదని భావించి అనాలోచితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిందితుడికి చెందిన పిల్లలు ఒక అబ్బాయి (13), ఒక కూతురు (11) స్పాట్ లోనే చనిపోయారు. మూడో బిడ్డ అంటే ఒక కూతురు, యోగేష్ భార్య కూడా గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్నారు. వారిద్దరు కూడా చనిపోయారని నిందితుడు భావించాడు. కానీ వారు బతికే ఉన్నారని గుర్తించి వారిని సహారన్ పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించాం,” అని ఎస్ఎస్‌పి రోహిత్ సాజ్వాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
స్థానికుల ప్రకారం.. గత కొన్ని రోజులుగా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదు. పైగా ఇంట్లో తరుచూ గొడవలు జరిగేవి. స్నేహితులు, బంధువులు కూడా అతను ఏదో సమస్యలో ఉన్నాడని.. కానీ తమతో ఏ విషయం చెప్పేవాడు కాదని తెలిపారు.