OTT Movie : పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే యానిమేషన్ సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అందులో కావలసినంత కామెడీ ఉంటుంది. అలాగే ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి జానర్ లో వచ్చిన యానిమేటెడ్ మూవీ ‘ఇన్సైడ్ అవుట్’కు మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి ఒక మంచి మూవీనే. ఇందులో టీనేజర్స్ మనోభావాలు, ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారు. ఇక ఈ మూవీ కథ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళ్తే…
మీలిన్ “మీ” లీ టొరంటోలో నివసించే 13 ఏళ్ల చైనీస్-కెనడియన్ అమ్మాయి. ఆమె బాగా ఆత్మవిశ్వాసం ఉన్న ఎనిమిదో తరగతి విద్యార్థిని. ఈ పాప తన తల్లి మింగ్ నడిపే కుటుంబ ఆలయాన్ని సంరక్షించడంలో సహాయం చేస్తుంది. మీకి తన స్నేహితులు మిరియమ్, ప్రియ, మరియు అబ్బీతో కలిసి సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. అలాగే 4 టౌన్ అనే బాయ్ బ్యాండ్‌పై క్రష్ ఉంటుంది.
ఒక రోజు నిద్రలేచి చూసేసరికి మీ ఎర్రటి రెడ్ పాండాగా మారిపోతుంది. తన టీనేజ్ ఎమోషన్స్ (ఒత్తిడి, ఉత్సాహం, ఇబ్బంది) అధికమైనప్పుడు మారుతున్నట్టు తెలుసుకుంటుంది. ఇలా మారడం అన్నది ఆమె కుటుంబంలోని స్త్రీలకు వంశపారంపర్యంగా వచ్చిన ఒక మాయాజాల శాపం. ఇది చైనీస్ పురాణాల ఆధారంగా సూర్య దేవుడితో ముడిపడి ఉంటుంది. మింగ్ ఈ శాపాన్ని ఒక రిచువల్ ద్వారా తొలగించగవచ్చని చెబుతుంది. కానీ మీ ఈ పాండా రూపాన్ని అంగీకరించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇది ఆమె స్వేచ్ఛగా ఉండటానికి, తనను తాను ఎక్స్ ప్రెస్ చేయడానికి సహాయ పడుతుంది. మరోవైపు మీ అమ్మమ్మ పూజ చేసి ఈ శాపాన్ని తొలగించడానికి రెడీ అవుతుంది. అసలు మింగ్ కు ఉన్న సమస్య ఏంటి? ఆ అమ్మాయి రెడ్ పాండాగా మారడం వెనక ఉన్న శాపం కథ ఏంటి? చివరికి ఆ శాపం నుంచి మీ విముక్తి పొందిందా ? అనే విషయాలు ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా మీ టీనేజ్ జీవితంలోని సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. తల్లి ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉండడం, ఆమె అంచనాలను రీచ్ కావడానికి కూతురు చేసే ప్రయత్నం, తన స్నేహితులతో 4 టౌన్ కాన్సర్ట్ కు వెళ్లాలనే, ఈ కొత్త పాండా శక్తిని నియంత్రించడం, మంచి అమ్మాయి ఇమేజ్, తన నిజమైన ఫన్-లవింగ్ స్వభావం మధ్య మీ ఎదుర్కొనే సంఘర్షణ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ మూవీ పేరు “టర్నింగ్ రెడ్” (Turning Red). ఇదొక అమెరికన్ యానిమేటెడ్ కామెడీ సినిమా. డోమీ షీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పిక్సార్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా 2022 మార్చి 11న డిస్నీ+ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మూవీ amazon prime videoలో కూడా ఉంది. ఇది 2023లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ కోసం అకాడమీ అవార్డ్‌కు నామినేట్ అయింది. టీనేజ్ కామెడీ, కమింగ్-ఆఫ్-ఏజ్ స్టోరీలు, లేదా పిక్సార్ సినిమాలు (ఇన్‌సైడ్ అవుట్, సోల్) వంటివి ఇష్టపడే వారికి “టర్నింగ్ రెడ్” ఒక అద్భుతమైన ఆప్షన్.