Gundeninda GudiGantalu Today episode November 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల ప్రభావతికి షాక్ ఇచ్చేలా మీనాను వెనకేసుకొని వస్తుంది. మీనా బాలును కలపాలనే ప్రయత్నాలు చేస్తుంది. అది చూసిన ప్రభావతి అది చూసి కోపంతో రగిలిపోతుంది. మీనా ఇంట్లో పని ఏమి చెయ్యకుండా వెళ్ళిపోయింది. ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? ఇంత టైం అవుతున్నా కనీసం గారెలు కూడా వెయ్యలేదు. దానికి మీనా గుడికి వెళ్లొచ్చాము కదా అత్తయ్య ఇప్పుడు వేస్తాను అంటుంది. దానికి సుశీల మాత్రం ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. ఆ మాత్రం వేసుకోలేరా అని అంటుంది. నీ ముద్దుల కోడలితో వేయించు అంటుంది. ప్రభావతి చదువుకున్న అమ్మాయి కదా అత్తయ్య ఆమెకు ఇలాంటివి రావు. వంట చెయ్యడం అస్సలు రాదు అని అంటుంది. నీకు పెళ్ళైన కొత్తలో వంట చెయ్యడం వస్తుందా.. నేను మెల్లగా నేర్పించాను కదా అంటుంది. ఇక అత్త మాటను విన్న ప్రభావతి రోహిణి దగ్గరకు వెళ్తుంది. ఇక రోహిణి రెండు గారెలు వెయ్యగానే నా చేత గారెలు అన్ని వేయించేలా ఉన్నారని అనుకుని డ్రామా ఆడుతుంది. కోడలి మీద ప్రేమతో ప్రభావతి వత్తాసు పాడుతుంది. ఇక అనుకున్నట్లుగానే దినేష్ చేసిన ఒక కాల్ తో రోహిణిని చూడాలని సుగుణమ్మ అక్కడికి వస్తుంది. రోహిణి అడ్డంగా ఇరుక్కున్నా అని అనుకుంటుంది. ఇక సత్యం పండుగ పూట మా ఇంట్లో ఉండాలని పట్టుపడితే ఉండిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ లో.. రోహిణి సుగుణమ్మతో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకమ్మ ఇక్కడకు వచ్చావు.. మీనా, బాలును అస్సలు కలవొద్దు అని చెప్పినా నువ్వు వినవే. ఇక నేను చచ్చినా కూడా ఇక్కడకు రావొద్దు అనగానే సుగుణమ్మ కన్న కూతురు కు ఏదైనా అయితే చూడకుండా ఉండాలా అని ఇంక నేను బ్రతికి ఏమి ప్రయోజనం అనుకుంటుంది. నా లాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు అని అంటుంది. ఇక ఫీల్ అవుతుంది. అప్పుడే మీనా వాళ్ళ దగ్గరకు వస్తుంది. మీనా రావడం గమనించిన రోహిణి మరో డ్రామాను మొదలు పెడతారు. నేను పడ్డానని అనుకున్నారు ఆంటీతో అదే మాట్లాడుతున్న అని రోహిణి మీనాతో అంటుంది. గారెలు తీసుకొని వచ్చావా చింటూ కోసమా అని అడుగుతుంది. ఇవ్వు చింటుకు అని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. ఇక రోహిణి బయటికి వెళ్లగానే.. మీకు రోహిణి ముందే తెలుసు కదా అంటూ సుగుణమ్మను ప్రశ్నిస్తుంది.. రోహిణి ప్రవర్తన చూసిన మీనాకు అనుమానం వస్తుంది. రోహిణి రూమ్ లో నుండి వెళ్ళగానే.. మీకు ముందే రోహిణి తెలుసు కదా అని సుగుణను అడుగుతుంది మీనా. దీంతో కంగారుపడిన సుగుణ.. అదేం లేదు.. అంటూ అబద్దం చెప్పి తప్పించుకుంది.
ఇక దీపావళి పండుగ రోజు.. ఇంట్లో వారందరూ సంతోషంగా పటాసులు కాలుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ దీపావళి సంబరాలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తన కుటుంబాన్ని దూరంగా ఉండి రవి చూస్తూ ఉండిపోతాడు. రవికి శృతి ఫోన్ చేస్తూనే ఉంటుంది. రవి ఫోన్ తియ్యట్లేదు అసలు ఏమైంది రవికి కనీసం ఫోన్ లిఫ్ట్ చెయ్యొచ్చు కదా అని టెన్షన్ పడుతుంది. రవిని బాలు ఏమైనా చేశాడా అని అనుకుంటుంది. ఇక రవి దగ్గరకు రావాలని అక్కడకు బయలుదేరుతుంది. రవి ఇంట్లో వాళ్ళు రానిస్తారేమో అని ఆశగా చూస్తాడు. ఇక చివరకు బాలుకు తెలిసిపోతుంది. మరోవైపు రోహిణి బండారం ఎక్కడ బయటపడుతుందో అని ఇంట్లో వాళ్ళు నన్ను గెంటేయ్యడం పక్కా అని అనుకుంటుంది.
రోహిణి కొడుకు చింటూ కూడా దీపావళి సంబరాలు వారితో కలిసి పోతాడు. కానీ, చింటూని చూసి మనోజ్ చిరాకు పడతాడు. వాడు ఎవడికి పుట్టాడో.. కానీ దర్జాగా మన ఇంట్లో మనమడిలా టపాసులు కాలుస్తున్నాడు చూడు అంటూ రోహిణి చూపిస్తాడు. ఈ సమయంలో అనుకోకుండా చింటూ పై నిప్పురవ్వలు పడతాయి. దీంతో రోహిణి కంగారుపడి పరిగెత్తి చింటూని దగ్గరకు తీసుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యులందరికీ రోహిణి పై అనుమానం వస్తుంది. బాలు అయితే ఏకంగా రోహిణి దగ్గరకు వచ్చి ఏమైనా జరిగిందేమో అని టెన్షన్ పడుతుంది. ఇక వాడిని పట్టుకొని టెన్షన్ పడుతుంది. అది చూసిన అందరు షాక్ అవుతారు. ఇక బాలు చూసి టెన్షన్ పడతాడు. చింటూకు ఎదో అయ్యిందని టెన్షన్ పడుతుంది. ఎందుకు ఏమైంది పార్లరమ్మా అని అడుగుతాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్నలు అడుగుతారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..