Gundeninda GudiGantalu Today episode April 18 th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు తన తల్లి గురించి తన మనసులోని బాధను బయటపెడతాడు. తల్లి కోసం తన ఎంత ఆరాటపడుతున్నాడో అందరికీ తెలిసేలా చేస్తాడు. తన మనసులో ఇంత బాధ ఉందని ప్రభావతికి అప్పుడే తెలుస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ తన మనసులోని బాధ విని బాధపడతారు. బాలు మనసులో ఇంత బాధ తాగి ఉందని శృతిరవిలు మాట్లాడుకుంటారు. అటు రోహిణి కూడా బాలుమనసులు ఇంత బాధను పెట్టుకున్నాడని బాధపడుతుంది. చెయ్యను తప్పుకు నేరం నేను అనుభవించానని చెప్పబోతూ ఉంటే సత్యం బాలుని ఆపుతాడు. బాలు మనసులో ఇంత బాధ ఉందా అని అందరు ఫీల్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు తన మనసులోని బాధను బయటపెట్టిన తర్వాత అందరు బాలు మనసులో ఇంత బాధ ఉందా అందరిని ఏడిపించేశాడు అని అంటారు. ఆ తర్వాత బాలు కఠినమైన మనసులో ఇంత బాధ నిజంగా గ్రేట్ అని శృతి అంటుంది. ఇక బాలు ఒంటరిగా బాలు బాధ పడతాడు. మీనా వచ్చి ఏంటి ఒంటరిగా బాధపడుతున్నారు అని అడుగుతుంది. నేను ఒంటరిగా లేను నువ్వు ఉన్నావు కదా అని అంటాడు. తన బాధను చెప్పుకొని బాధ పడతాడు. అప్పుడే సుశీల అక్కడకు వచ్చి మీ ఇద్దరు విడిపోవద్దు అని కంగారు పడుతూ వస్తుంది. ఇద్దరికి దిష్టి తీస్తుంది.
బాలు ఎమోషనల్ కావడం చూసి మీనా ఓదార్చుతుంది. కన్నీళ్లతో మీనా ఒడిలో తల పట్టుకొని అలాగే బాలు నిద్రపోతాడు. మీనా, బాలు గొడవపడినట్లు సుశీల కలగంటుంది. కలలో బాలును వదిలేసి మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. ఇంక మీరు మారరు. మీతో కలిసి ఉండలేనని మీనా కోపంగా అంటుంది. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను. ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించు అని మీనాను బతిమిలాడుతాడు బాలు..
బాలు, మీనాలను లోపలికి తీసుకొచ్చి దిష్టితీస్తుంది సుశీల. ఏమైందని, ఎందుకు కంగారు పడుతున్నావని బామ్మను అడుగుతాడు బాలు. ఏదో పీడకల వచ్చిందని, మీరిద్దరు కలకాలం కలిసి మెలిసి ఉండాలని, బాలు, మీనాలతో అంటుంది సుశీల. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని, మీరు మాత్రం ఎప్పుడు విడిపోవద్దని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక బాలు మీనా ఇద్దరు కలిసి మాట ఇస్తారు. ఎప్పటికీ విడిపోమంటూ మాటే వినడంతో సుశీల సంతోషపడుతుంది.
బాలు ఇదివరకటిలా లేడని, తనను ప్రేమగా చూసుకుంటున్నాడని, ఒక్క మాట పడనివ్వడం లేదని మీనా అంటుంది. ఎన్ని గొడవలు జరిగినా కలిసే ఉంటామని సుశీలకు మాటిస్తుంది మీనా. పల్లెటూరి నుంచి సిటీకి వస్తారు. వచ్చిరావడంతోనే ప్రభావతి పూలకొట్టుకు సెలవు అనే బోర్డ్ చూసి చిందులు తొక్కుతుంది ప్రభావతి. అప్పుడే ఓ కస్టమర్ వచ్చి పూలకొట్టు ఓనర్ ప్రభావతి అని పొరపడి ఆమెపై కోప్పడుతుంది. షాప్ మూసేస్తే మేము ఎంత ఇబ్బంది పడతాం. ఆ మాత్రం బాధ్యత లేదా ఫైర్ అవుతుంది. కస్టమర్ మాటలతో ప్రభావతి కోపం మరింత పెరుగుతుంది. ఈ కొట్టు నువ్వు నేనే పీకిపారిస్తేను అని బోర్డ్ పట్టుకుంటుంది ప్రభావతి.
ఇక సత్యం ప్రభావతి కోపాన్ని సత్యం కూల్ చేస్తాడు. ఆ పూల కొట్టు నీకు ఏం అన్యాయం చేసిందని సత్యం అంటాడు. రేపే ఇది ప్రభావతి పూల కొట్టు కాదని బోర్డ్ పెట్టిస్తానని బాలు అంటాడు. అయినా వినకుండా తన పేరును రోడ్డు పాలు చేశావని బాలుపై నిప్పులు చెరుగుతుంది ప్రభావతి. ఊళ్లో అందరూ మంచి ఫ్యామిలీ అని మెచ్చుకున్నారని, కానీ కొట్టుకుచచ్చే ఫ్యామిలీ అని పేరు తీసుకురావద్దని ప్రభావతిపై ఫైర్ అవుతాడు. అయినా ప్రభావతి కోపం తగ్గకపోవడంతో ఆమెను పబ్బీ అని పిలిచి కూల్ చేస్తాడు.
మేక మామ అని మాణిక్యను దారుణంగా అవమానిస్తాడు. దానికి రోహిణి ఫీల్ అవుతుంది. ప్రభావతి వాడి గురించి మీకు తెలిసిందే కదా మళ్లీ ఎందుకు అనడం అనేసి అందరినీ కూల్ చేస్తుంది. ఇక మీ నాన్న కాఫీ పెట్టమని అడుగుతుంది. ఆ తర్వాత కామాక్షి అక్కడకు వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..