Brahmamudi serial today Episode: గుడిలో కావ్య, రాజ్ మాట్లాడుకోవడం పక్క నుంచి చూస్తుంది అపర్ణ. దేవుడిని మొక్కుతుంటే.. పూజారి వచ్చి దంపతులిద్దరూ సీతారాముల్లా చూడముచ్చటగా ఉన్నారు. గోత్రం చెప్పండి నాయన అని అడగ్గానే. అపర్ణ హ్యాపీగా ఫీలవుతుంది. రాజ్ షాక్ అవుతాడు మేము భార్యాభర్తలం కాదని తెలిసిన వ్యక్తి అని చెప్తాడు. అయితే ఎవరి పేరు మీద అర్చన చేయించాలి అని అడుగుతాడు పూజారి. దీంతో రాజ మా అమ్మ పేరు మీద చేయించండి ఇవాళ మా అమ్మ పుట్టినరోజు అని చెప్తాడు. మీ అమ్మ పేరు చెప్పండి అని పూజారి అడగ్గానే.. రాజ్ భానుమతి అని చెప్తాడు. తర్వాత గోత్రం అడిగితే రాజ తెలియదని చెప్తాడు. దేవుడి గోత్రంతో అర్చన చేస్తానంటాడు పూజారి.
ఫోన్ చూస్తూ ఆలోచిస్తున్న యామిని దగ్గరకు వైదేహి కాఫీ తీసుకుని వస్తుంది. యామిని కాఫీ తీసుకో అని గట్టిగా అరవగానే… యామిని కోపంగా అబ్బా ఎందుకు మమ్మీ అంతలా అరుస్తావు. మెల్లగా చెప్పొచ్చు కదా అంటుంది. దీంతో వైదేహి.. నేను మెల్లగా చెబితే నీకు వినిపించడం లేదు కదా అందుకు గట్టిగా అరిచాను కానీ ముందు కాఫీ తీసుకో.. నువ్వే పరధ్యానంలో ఉన్నావు అంటుంది వైదేహి. కాఫీ తీసుకుని యామిని బావ శివాలయానికి వెళ్లింది నిజమే కానీ ఇంకా అక్కడే ఉన్నాడు. ఓన్లీ దర్శనం అయితే రెండే నిమిషాలు చాలు ఒకవేళ ప్రదక్షిణ చేస్తే పది నిమిషాలు కానీ ఇంకా అక్కడే ఉన్నాడంటే.. అర్చన కూడా చేయిస్తే దానికి ఇంకో పది నిమిషాలు.. మొత్తం అరగంట కావొచ్చు కానీ వెళ్లి గంటకు పైగా అవుతుంది. ఇంతసేపు అక్కడే ఏం చేస్తున్నాడో అంటూ అనుమానంగా అంటుంది.
దీంతో వైదేహి భక్తి పారవశ్యంలో ముగినిపోయాడేమో అంటుంది. దీంతో యామిని అంత భక్తి పారవశ్యంలో ముగినిపోవడానికి ఆయన భక్త కన్నప్ప కాదు మామ్. జస్ట్ రామ్‌గా మారిన రాజ్ అంటుంది. దీంతో వైదేహి అయితే అక్కడ ఏం చేస్తున్నాడంటావు అని అడుగుతుంది. యామిని అనుమానంగా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్లు కలిసి ఉండాలి. లేదా తనే ఎవరినైనా కలవడానికి వెళ్లి ఉండాలి. రెండిట్లో ఏది జరిగినా మనకే ప్రమాదం మమ్మీ అంటుంద. దీంతో వైదేహి.. నువ్వు చెప్తుంటే నాకు డౌటు వస్తుంది బేబీ. మన ప్రమేయం లేకుండా అల్లుడు గారు డ్రెస్ ఆన్‌లైన్ లో బుక్ చేయడం ఏంటి..? ట్రెడిషనల్‌గా రెడీ అయి గుడికి వెళ్లడం ఏంటి..? ఎదుకైనా మంచిది నువ్వు కూడా గుడికి వెళ్లడం మంచిది అని చెప్తుంది. యామిని కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను మమ్మీ అని చెప్తుంది.
కానీ నువ్వు తనని చూస్తున్నావు కదా..? నేను ఎక్కడికి వస్తానన్నా కూడా సీరియస్ అవుతున్నాడు. ప్రతి విషయానికి నా మీద సీరియస్ అవుతున్నాడు. నేనేదో తన వెంట పడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నేను గుడికి వెళితే ఎంత పెద్ద గొడవ చేస్తాడో అని ఆలోచిస్తున్నాను అంటుంది. దీంతో వైదేహి గొడవ చేస్తాడని ఆలోచిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టం వేస్ట్ అవుతుంది. చూడు యామిని రాజ్ మిస్ అయ్యాడని నువ్వు మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్తే ఆ బాధ పడే ఓపిక మాకు మళ్లీ లేదు. తిడితే తర్వాత సర్ది చెప్పుకోవచ్చు. కానీ తను నీ చేయి దాటి పోకుండా చూసుకో వెళ్లు అంటూ సజెస్ట్ చేస్తుంది. దీంతో యామిని ఎస్ మమ్మీ ఇప్పుడే వెళ్తాను అంటూ బయలుదేరుతుంది.
మరోవైపు రాజ్ గుడిలో అన్నదానం చేస్తుంటే.. అపర్ణ తినడానికి వెళ్తుంది. రాజ్ వెళ్లి మిమ్మల్ని చూస్తుంటే పది మందికి అన్నం పెట్టే వారిలా ఉన్నారు. కానీ మీరు ఇక్కడ వచ్చి భోజనం చేయడం ఏంటని అడుగుతాడు. ఎందుకో నువ్వు అన్నదానం చేస్తుంటే తినాలనిపించింది అందుకే వచ్చాను బాబు అంటూ అందులో ఇవాళ నా పుట్టినరోజు అని చెప్తుంది. దీంతో రాజ్ ఆశ్చర్యంగా ఉందే ఇవాళ మా అమ్మ పుట్టినరోజు కూడా హ్యాపీ బర్తుడే అమ్మా అంటూ విష్ చేయగానే అపర్ణ హ్యాపీగా ఫీలవుతుంది. ప్రతి సంవత్సరం నా కొడుకు వచ్చి ఇలాగే అన్నదానం చేసేవాడు. కానీ ఈ సంవత్సరం రాలేదు. కాలం మమ్మల్ని దూరం చేసింది బాబు అని అపర్ణ చెప్పగానే.. ఏం లేదమ్మా ఆ దేవుడు మీకు మీ కొడుకును దగ్గర చేరుస్తాడు అని చెప్తాడు రాజ్. దీంతో అపర్ణ నీ నోటి చలువ అది త్వరగా జరిగితే బాగుండు అంటుంది. దీంతో రాజ్ నేను చెప్పాను కదమ్మా అది త్వరలోనే జరుగుతుందిలే అంటాడు.
అపర్ణకు అన్నం వడ్డించి మీ కొడుకు గురించి ఆలోచిస్తూ ఆ బాధలో సగం సగం తినకండి.. నన్ను కూడా మీ కొడుకే అనుకుని కడుపు నిండా తినండి అంటాడు రాజ్. అలాగే బాబు అంటుంది అపర్ణ. తర్వాత కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్ అక్కడ కూర్చుని భోజనం చేస్తున్న ఆవిడను చూశారా ఆవిడను చూస్తుంటే.. నాకు చిన్నప్పుడు దూరం అయిన మా అమ్మే గుర్తుకు వస్తుందండి అని చెప్తాడు. దీంతో కావ్య ఎమోషనల్ గా ఫీలవుతుంది. ఆవిడ కొడకు స్థానంలో మనం ఉండి ఆవిడ చేత ఒక కేక్ కట్ చేయిస్తే బాగుంటుందండి అని రాజ్ చెప్పగానే.. కావ్య హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అందరూ భోజనం చేసి రాజ్‌ను మెచ్చుకుని వెళ్లిపోతారు. అపర్ణ దగ్గరకు వెళ్లి రాజ్ అమ్మా మా అమ్మ పుట్టినరోజు మీ పుట్టినరోజు ఒకటే అవ్వడం నాకు చాలా సంతోషం వేసింది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను మా అమ్మగా అనుకోవచ్చా అని అడుగుతాడు. మీరు కాదనరు అనే కేక్ కూడా తెప్పించాను అని చెప్పగానే అపర్ణ ఎమోషనల్‌గా ఫీలవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?