E-Paper
Advertisement

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

West Godavari Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద ఓ కారు అదుపు తప్పి పక్కనేవున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువతీయువకులు గల్లంతు అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి పక్కనేవున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. గల్లంతు అయినవారిలో లక్ష్మీభాను-18 ఏళ్లు, రాజారాం-17, నాగిరెడ్డి దుస్వంత- 18, సాయి సూర్య-19 గల్లంతు అయినవారిలో ఉన్నారు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Advertisement

తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు యువతీయువకులు ఫ్రెండ్ పెళ్లి కోసం పెరవని వెళ్లారు. అక్కడ మ్యారేజ్ తర్వాత స్నేహితుడ్ని కలవడానికి ఓ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ప్రయాణించే దారిలో భారీగా వర్షం పడుతోంది. దారి కనిపించపోవడంతో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. నీరు ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోయారు.

నలుగురు యువతీయువకులు గల్లంతు

ఓ యువకుడు చెట్టు కొమ్మ పట్టుకుని స్థానికుల సహకారంతో బయటపడ్డాడు. స్థానికులు ట్రాక్టర్ సహకారంతో కారుని బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్, మిగతా నలుగురికి ఫోన్ చేసినప్పటికీ పని చేయలేదు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతు అయివారి కోసం గాలింపు చేపట్టారు. ఘటన గురించి తెలియగానే యువతీయువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Advertisement

ALSO READ: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×