Illu Illalu Pillalu Today Episode july 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఊళ్లో దొంగలు పడి ఇళ్లని దోచేయడంతో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుని బ్యాంక్ లాకర్‌లో పెట్టేయమని వేదవతితో చెప్తాడు రామారాజు. ఆ మాటతో శ్రీవల్లి గుండెల్లో రాయి పడిపోతుంది. తన దగ్గర ఉన్న నగల్ని బ్యాంక్ లాకర్‌లో పెడితే.. అవి గిల్టు నగలు అని తెలిసిపోతుందని భయపడిచస్తుంది. హగ్ చేసుకొని మ్యానేజ్ చేసుకుంది. అలాగే తర్వాత రోజు వేదవతి నగల కోసం కోడళ్ళను అరుస్తుంది. నర్మద, ప్రేమలకు నగలను తీసుకొచ్చి ఇవ్వమని చెప్తుంది.. శ్రీవల్లి చేతులు నలుపుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారూ పిలిచారా? అని అడుగుతుంది శ్రీవల్లి. ‘ఏం లేదమ్మా.. ఊరిలో దొంగలు పడ్డారంట.. మనందరి నగలు లాకర్‌లో పెట్టమని మీ మామయ్య గారు చెప్పారు. మీరు వెళ్లి మీ నగల్ని తీసుకుని రండి అని అంటుంది వేదవతి. ఇద్దరు కోడళ్లు వెళ్తారు కానీ.. శ్రీవల్లి మాత్రం అతితెలివి ప్రదర్శించి.. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య కానీ వేదవతి మీ మామయ్య అస్సలు వినడు. నన్ను అరుస్తాడు అని అంటుంది. శ్రీవల్లి వెళ్లి భాగ్యంకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ దొంగలు పడ్డారట.. బ్యాంకులో నగలు తాకట్టు పెట్టడానికి చెక్ చేస్తారు కానీ దాచిపెట్టడానికి చెక్ చేయరు ఇచ్చేసేయని భాగ్యం అనగానే శ్రీవల్లి ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా ధీరజ్ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది. రామరాజు సార్ గారు ఇంకా రాలేదా ఏంటి అని అడుగుతాడు. మరి మా నాన్న వాడు ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అన్నారు కదా మీకు ఎందుకండి మధ్యలో అని వేదవతి అంటుంది. చందు ఫోన్ చేసి ధీరజ్ ని అడుగుతాడు.. చందు ధీరజ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. వాడేదో డ్యూటీలో ఉన్నాడంట నాన్న అందుకే రాలేకపోయాడంట అని చందు అంటాడు.. సరేగాని డ్యూటీ అంటున్నాడు మరి తిన్నాడా లేదా కనుక్కోవచ్చు కదా అని చందు పై సీరియస్ అవుతాడు రామరాజు.
కొడుకు మీద కోపమే కానీ మనసులో మాత్రం కొడుకు కంటే ఎంత ప్రేమ అని వేదవతి అంటుంది.. అయితే సాగర్ నర్మదా మాత్రం ధీరజు కార్ డ్రైవింగ్ కోసం వెళ్ళాడేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న శ్రీవల్లి మావయ్య గారు అండి నర్మదా సాగర్ మరిదికి ఈ విషయం తెలుసనుకుంటానండి అని ఇరికించేస్తుంది. నర్మద సాగర్ లు మాత్రం మాకు ఏమీ తెలియదని అంటారు. రామరాజు ఏ బుజ్జమ్మ నీకు తెలియకుండా నీ చిన్న కొడుకు ఏదైనా చేస్తాడా అని అడుగుతాడు. అయ్యో శ్రీరామచంద్ర నాకేం తెలుసండి నన్ను అడుగుతారు ఏంటి అని వేదవతి అంటుంది.
నీకు తెలియకుండా వాడు ఏది చేయడు కదా నీ ముద్దుల కొడుకు కదా అనేసి రామరాజు అంటాడు. కానీ వేదవతి నర్మదను మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి లేదంటే మాత్రం ఆయన చాలా సీరియస్ అవుతాడు అని అంటుంది. అయితే నర్మదా నాకేం తెలియదు అత్తయ్య గారు అని అంటుంది. వాళ్ళు మాట్లాడుకోవడం శ్రీవల్లి రామరాజు తో చెబుతుంది. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి లేదంటే మాత్రం ఈసారి ఏదైనా తప్పు జరిగితే ఇంక జన్మలో క్షమించను అని రామరాజు అంటాడు. నాకు తెలియకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం గానీ ఇంకేదైనా చేయడం గాని చేస్తే నేను అస్సలు ఊరుకోను అని వేదవతి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
ప్రేమ మాత్రం ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రేమ దగ్గరికి వచ్చిన వేదవతి ధీరజ్ ఎక్కడికెళ్లాడు నీకు నిజంగా తెలియదా అని అంటుంది. డ్యూటీ కి నేను చెప్పాడు కదా అత్తయ్య అక్కడే ఉన్నట్లు ఉన్నాడు నేను కూడా ఫోన్ చేయలేదు అని అంటుంది.. ఇదంతా కాదు నువ్వు ఈసారి ఎటువంటి తప్పులు చేయొద్దు మీ మావయ్య గారు అన్న మాటలు విన్నావు కదా అని అంటుంది. ట్యూషన్ చెప్పడం కానీ డాన్స్ క్లాసులు చెప్పడం లాంటివి గాని చేశావంటే మీ మామయ్యకు అస్సలు ఇష్టం ఉండదు ఇది గుర్తుపెట్టుకో అని అంటుంది.
Also Read:శ్రీకర్ సేఫ్..అక్షయ్ కు అవని క్లాస్.. పార్వతికి దిమ్మతిరిగేలా ప్రణతి కౌంటర్..
బయట వంద మందికి సమాధానం చెప్పగల మీ మామయ్య మన పుట్టింటి వాళ్లకు మాత్రం ఎన్ని అవమానాలు చేసినా సమాధానం చెప్పడు. నువ్వు ఇంటి కోడలు అవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పొరపాటున కూడా ఎలాంటి తప్పులు చేయొద్దని వేదవతి ప్రేమ దగ్గర మాట తీసుకుంటుంది. తెలిసి తెలియక ఎలాంటి తప్పులు చేయను అని వేదవతి కి మా మాటిస్తుంది. తర్వాత ధీరజ్ ఏ అర్ధరాత్రి కు వచ్చి ఓపిక లేక పడుకుంటాడు. ధీరజ్ అలా పడుకోవడం చూసి ప్రేమ బాధపడుతుంది. ఈ దెబ్బ తగలడంతో ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కాలికి మందు వేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కు తన వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..