E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: విడిపోయిన ధీరజ్, ప్రేమ.. పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. వల్లి ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: విడిపోయిన ధీరజ్, ప్రేమ.. పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. వల్లి ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 29th: ప్రేమ నీ స్వార్థం కోసం నువ్వు గొప్ప అనిపించుకోవడం కోసం నా గతాన్ని అందరి ముందు బయట పెడతావా…? జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు అని ప్రేమ ధీరజ్ ని అడుగుతుంది. ప్రేమ నువ్వు మంచివాడు అనిపించుకోవడానికి నా జీవితాన్ని బయటపెట్టి అందరి ముందు నన్ను తలపించుకునేలా చేసావు కదా అని అంటుంది.. ఆ మాట వినగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నువ్వు మా అమ్మ బాధపడింది మాత్రం ఆలోచించవారని ధీరాజు ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం అస్సలు వినకుండా నీ భార్యని అందరి ముందర బయటపెట్టి అవమానిస్తావా అని బాధపడిపోతుంది.. ప్రేమ సేన రెచ్చగొట్టడంతో ఇంకాస్త రెచ్చిపోయి ధీరజ్ పై గొడవకు దిగుతుంది..

నువ్వంటే అసహ్యం..

ప్రేమ నువ్వు నా గురించి ఇన్ని విషయాలు బయట పెట్టావు కదా కొంచమైనా నీకు గుర్తుకు రాలేదా నా గురించి ఇలా చెప్తున్నాను అని. నీ భార్య గురించి నువ్వే ఇలా చెప్తే ఎలా తట్టుకోవాలి రా.. అసలు ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతుంది. ఈ గొడవ జరగడానికి కారణం మీ నాన్నని అసలు వీడే దీనికి అంతటికి కారణం అని ధీరజ్ మల్లీ కొట్టబోతాడు. ప్రేమ ధీరజ్ ను కొట్టగానే అందరూ షాక్ అవుతారు.. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అని ప్రేమ అనగానే ధీరజ్ నువ్వు నన్ను అసహ్యించుకోవడం కాదే నేనే నేను అసహ్యించుకుంటున్నాను. ఐ హేట్ యు అని అనగానే ప్రేమ గుండె ముక్కలు అవుతుంది.. కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతుంది ప్రేమ..

పుట్టింటికి వెళ్లిన ప్రేమ..

Advertisement

వాడే నువ్వంటే అసహ్యం అని చెప్తున్నాడు కదే ఇక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకేంటి పద వెళ్లిపోదామని భద్ర ప్రేమను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతుంది.. ఇక భద్ర వాళ్లు వెళ్తూ ఉంటే శారదాంబ ఎంతగా ఆపడానికి ప్రయత్నించిన సరే అస్సలు వినకుండా ప్రేమ వాళ్లు వెళ్లిపోతారు.. నా మేనకోడలిని నా ఇంటికి తెచ్చుకోవాలన్న కోరిక తీరింది ఏంటో భద్ర ప్రేమని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక ఎవరు ఎంత చెప్పినా సరే వినకుండా ఉండడంతో ప్రేమ తన అత్తతో పాటే పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక సేన వాళ్ళు నా కూతురు నా ఇంటికి వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ప్రేమ వెళ్ళిపోయింది అని వేదపతి వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు..

వేదవతికి షాకిచ్చిన రామరాజు..

వేదవతి నా తప్పేమీ లేదు అండి అని రామరాజు తో మాట్లాడుతూ ఉండగా.. రామరాజు మాత్రం నువ్వు ఏది మాట్లాడదు ఇన్ని గొడవలు జరగడానికి కారణం నువ్వే కదా అని అరుస్తాడు.. ఇకపోతే వల్లి మీరు చేసింది తప్పే కదా అత్తయ్య మీ వల్లే కదా ధీరజ్ జీవితం ఇప్పుడు ఇలా మారిపోయిందని అంటుంది. మధ్యలో వల్లి కావాలనే రామరాజుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అసలు ఇన్ని జరగడానికి కారణం అత్తయ్యే ఆవిడ వల్లే కదా.. ఇప్పుడు ధీరథ ప్రేమలో బాధపడుతున్నారు అని కావాలని వేదవతిని ఇరికించేలా మాట్లాడడంతో వేదవతి సీరియస్ అయ్యి వల్లి చెంప పగలగొడుతుంది.. వల్లిని కొట్టగానే రామరాజు బుజ్జమ్మ కొట్టాల్సింది తనని కాదు నిన్ను నువ్వే కదా ఇదంతా చేసింది అని సీరియస్ అవుతాడు.. నేనేం చేశాను అండి ఒక ఆడపిల్ల జీవితం బాగుపడాలి అని ఇలా ఆలోచించను తప్ప వేరేలా చేయడం నేనేం చేశాను అసలు అని వేదవతి అడుగుతుంది. మీ వాళ్లను వదిలేసే వచ్చాను అని అంటున్నావు కదా.. ఇప్పుడు మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావా నువ్వు జన్మలో నాతో మాట్లాడద్దు అని రామరాజు తేల్చి చెప్పేస్తాడు.. ఆ మాట వినగానే వేదవతి గుండెలు పగిలేలా ఏడుస్తుంది.

వల్లి ప్లాన్ సక్సెస్..

Advertisement

వేదవతిని ఓదార్చేందుకు అందరూ ఎంత ప్రయత్నిస్తున్నా సరే.. తను మాత్రం తన భర్తకి దూరమైపోయాను అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇన్ని రోజులు నేను ఎవరికోసమైతే నా వాళ్ళని అన్ని వదులుకొని వచ్చాను వాళ్లే ఇలా అనడం ఏంటి అని కుమిలి కుమిలి ఏడుస్తుంది వేదవతి. వేదవది తన భర్త కోసం ఇంతగా ఏడుస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం నన్ను కొట్టినందుకు బాధగా కన్నా ఈవిడ గారు ఏడుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ తన మనసులో సంతోష పడిపోతూ ఉంటుంది.. ఇన్ని రోజులు ఇద్దరి కోడల్ని చూసి తెగ మురిసిపోయింది. కదా ఇప్పుడు ఈవిడ ఏడుస్తూ ఉంటే ఎంత బాగుందో అంటూ శ్రీవల్లి మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.. ఇకపోతే శ్రీవల్లి నా కాపురని కూల్చాలి అనుకున్న ఆ పొట్టి మిరపకాయ కాపురం ఇప్పుడు కూలిపోయింది అని అనుకుంటుంది.. ఇక ప్రేమ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు భద్ర మాత్రం నా మేనకడలు నా ఇంటికి వచ్చేసింది అని సంతోషపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి సేఫ్.. అవనిపై అక్షయ్ సీరియస్.. పల్లవిలో ఇంతమార్పేంటి..?

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

పిల్లలు లేరంటూ విమర్శలు… ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది: నటరాజ్ మాస్టర్

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

Big Stories

Advertisement
×