CM Chandrababu: రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీయాలంటే ఆదాయం చాలా అవసరం. అందుకే ఆదాయార్జన శాఖలపై స్పెషల్ ఫోకస్ చేశారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో రైతులకు మద్దతు ధర విషయంలో కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక శాంతి భద్రతల విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు సీఎం చంద్రబాబు.
17-06-2025 ( మంగళవారం) సీఎం భరోసా
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన అమానుష ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని బాధితురాలికి తెలిపారు చంద్రబాబు. పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఆమెకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
17-06-2025 ( మంగళవారం) సర్క్యూలర్ ఎకానమీపై సమీక్ష
వ్యర్ధ పదార్ధాల నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ అభివృద్ధి చేసే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిద్ధం చేసిన ప్రతిపాదనలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్క్యులర్ ఎకానమీ పార్కులపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.
17-06-2025 ( మంగళవారం) 11 రంగాలపై ఫోకస్
సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపల్, పాత వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాలతో పాటు.. గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను కూడా గుర్తించింది. ఈ విధానంతో నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది. వ్యర్ధాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు ప్రోత్సాహకంగా స్వచ్ఛత అవార్డులను వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని సీఎం సూచించారు.
18-06-2025 ( బుధవారం) సీఎం సమీక్ష
ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు రెవెన్యూ లక్ష్యాలను నిర్దేశించి, పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేయడం ఇకపై కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చునని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
18-06-2025 ( బుధవారం) రూ.1.24 లక్షల కోట్ల ఆదాయం!
ఈ ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం వసూళ్లు పెరిగాయి. స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖలో 2025 ఏప్రిల్‌లో 906 కోట్లు, మేనెలలో 916 కోట్ల ఆదాయం వచ్చినట్టు సీఎంకు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల విభాగంలో 43 వేల 20 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.
18-06-2025 ( బుధవారం) మద్దతు ధరలపై సమీక్ష
మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు.
18-06-2025 ( బుధవారం) మద్దతు ధరలపై సమీక్ష
మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల పొగాకును ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
18-06-2025 ( బుధవారం) కేంద్రంతో చర్చలు
అదే సమయంలో పామ్ ఆయిల్‌పై పన్ను తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది కోకో 12 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం జరిగిందని అధికారులు తెలిపారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.
19-06-2025 ( గురువారం) సీఎం మాస్ వార్నింగ్
రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే వదిలిపెట్టనన్నారు సీఎం చంద్రబాబు. విగ్రహాలు పెట్టి రౌడీలు, గంజాయి స్మగ్లర్ల ను హీరోలుగా మారుస్తున్నారని, రౌడీయిజం చేయాలని అందరికీ మార్గ దర్శనం చేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని, భవిష్యత్ ను తీర్చిదిద్దే నాయకుడి గురించి మాత్రమే ప్రజలు ఆలోచించాలని స్పష్టం చేశారు.
19-06-2025 ( గురువారం) ఇది పద్ధతి కాదు..
చంపండి, నరకండి అంటూ ఎవరైనా మాట్లాడతారా, హింసను ప్రోత్సహిస్తూ పోలీసులపై నిందలు మోపుతారా అంటూ మండిపడ్డారు ఆయన. తమ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదని, చట్టం తన పని తానూ చేస్తోందని అన్నారు
19-06-2025 ( గురువారం) వివాదాలు వద్దు..
జల వివాదాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు సీఎం చంద్రబాబు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు.
19-06-2025 ( గురువారం) పెట్టుబడులకు ప్రోత్సాహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 28 వేల 546 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 19 ప్రాజెక్టుల ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 30 వేల 270 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటి వరకూ నిర్వహించిన 7 ఎస్‌ఐపీబీ సమావేశాల ద్వారా 5 లక్షల 34వేల 684 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 4 లక్షల 73 వేల 969 మందికి ఉపాధి లభించనున్నట్టు చర్చించారు.
19-06-2025 ( గురువారం) వారికి అండగా ఉంటాం
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులతో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని, స్థానికులకు ఉపాధి లభించడం ద్వారా సంపద అన్ని చోట్లకూ విస్తరిస్తుందన్నారు. క్లస్టర్ల వారీగానూ పరిశ్రమల మ్యాపింగ్ జరగాలని అధికారులకు సూచించారు.
21-06-2025 ( శనివారం) సాగరతీరంలో యోగా
విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారీ స్థాయిలో నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలి వచ్చారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, డప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
21-06-2025 ( శనివారం) అందరికీ ధన్యవాదాలు
విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న వారికి, నిర్వహణలో సహకరించిన వారికి సీఎంచంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 లక్షల 2 వే 87 మంది పాల్గొని యోగా చేశారని ఆయన తెలిపారు. యోగాంధ్ర-2025 కార్యక్రమాలతో ఏపీ 2 గిన్నిస్ రికార్డులను, 21 వరల్డ్ బుక్ రికార్డులను నమోదు చేసింది. ఇంతటి ఘనతను సాధించేందుకు కృషిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలను సీఎం చంద్రబాబు గారు అభినందించారు.
21-06-2025 ( శనివారం) యోగా డే డిక్లరేషన్
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖ డిక్లరేషన్ తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. యోగ ధ్యాన్ పరిషత్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యోగా గేమ్ ఛేంజర్ అని.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఆయన. యోగా, నేచురోపతి, ఆయుర్వేదం మన వారసత్వ సంపద అన్నారు చంద్రబాబు.
21-06-2025 ( శనివారం) సత్తా చాటిన స్టూడెంట్స్
విశాఖలో నిర్వహించిన యోగాంధ్రలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 22 వేల122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు.
20-06-2025 ( శుక్రవారం ) ప్రధానికి స్వాగతం
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. అనంతరం యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఇరువురు నేతలు చర్చించారు.
Story By vamsi krishna, Bigtv Live