Intinti Ramayanam Today Episode june 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవనికి పార్వతి వాళ్లను దూరంగా ఉంచాలని లేకుంటే అక్షయ్ అవన్నీ కలిసిపోతారని పల్లవి మాస్టర్ ప్లాన్ వేసి ఒక ఇంటిని చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం పల్లవి వచ్చి కొత్త ఇల్లు దొరికింది వెళ్దాం అంటే అక్షయ్ నేను రాను అని అంటాడు. అవని అంటే నాకు కూడా కోపం అమ్మ నేను అవనితో కలుస్తానని మీరు అస్సలు అనుకోకండి.. నాకు నా కూతురు ఇప్పుడిప్పుడే దగ్గరవుతుంది. నా కూతుర్ని వదిలిపెట్టి నేను ఎలా వస్తానని అనుకుంటున్నావు అని అడుగుతాడు. భానుమతి వాడి కూతురు అంటే ఎంత ప్రాణమో తెలుసు కదా? వాడు కూతుర్ని వదిలిపెట్టి ఎలా వస్తాడు పల్లవి అని భానుమతి అంటుంది. వీళ్లు రివర్స్లో షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదు.. అయితే అవని స్కూల్ కి మీ నాన్నతో వెళ్ళు అని ఆరాధ్యను పంపిస్తుంది. పల్లవి మాట విని అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆరాధ్య ఆడుకోడానికి ఆ వీధిలోని పిల్లల దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న పిల్లలు మీ అమ్మానాన్న ఎవరో చెప్పు అని మాట్లాడుతారు దాంతో ఆరాధ్యకు కోపం వచ్చి ఒక పిల్లని చంప పగలగొడుతుంది. వాళ్ల పేరెంట్స్ అక్షయ్ దగ్గరికి తీసుకొని వస్తారు. తుని ఇలానే నా పెంచేది మీ ఆవిడ ఎక్కడ బయటకు తీసుకురండి నేను మాట్లాడుతాను అని అవతల ఆవిడ అనడంతో అక్షయ్ అవని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. నీ దగ్గర ఉంటే ఆరాధ్య ఎలా తయారవుతుందో చూసావా ఇంటి మీదకి గొడవలు తీసుకుని వచ్చింది అని అక్షయ్ అంటాడు. కూతుర్ని ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అవని అక్షయ్ కి రివర్స్లో షాక్ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్ ఏమో తన కొడుకు కోడలు విడిపోవడానికి గల కారణాలను వాళ్ళకి వివరిస్తారు..
నా కొడుకు కోడలికి దూరంగా వాళ్ళ అమ్మకు దగ్గరగా ఉన్నాడు. నేను నా కోడలు మంచితనానికి ఫిదా అయ్యాను అందుకే నాకు కోడలితో కలిసి ఉన్నాను అని అంటాడు. అయితే వాళ్లు మామగారుగా మీరు చేస్తున్నది చాలా సంతోషించే వలసిన విషయం అని రాజేంద్రప్రసాద్ పై ప్రశంసలు కురిపిస్తారు. గొడవలు పడ్డ పిల్లలు కలిసిపోయారు మీరు కూడా భార్యాభర్తలు గా కలిసిపోతే బాగుంటుంది అని వాళ్లంతా అంటారు. ఇక రాజేంద్రప్రసాద్ బయట నుంచి వచ్చిన వాళ్లే అర్థం చేసుకున్నారు ఇక మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అంటాడు.
అయితే పార్వతి నా కొడుకుకి చెప్పాల్సిన అవసరం లేదు వాడికి ఏం చేయాలో వాడికి తెలుసు అని అంటుంది. ముందు పిల్లల్ని ఎలా పెంచాలో మీ కోడలికి చెప్పండి అని రాజేంద్రప్రసాద్ తో అంటుంది. నాకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసు అత్తయ్య ముందు మీ అబ్బాయిని మీరు చూసుకోండి అని అవని సీరియస్ అవుతుంది. చూశారా ఎంతగా ఎదిరించి మాట్లాడుతుందో అని అంటే అవని అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆరాధ్యను తీసుకుని లోపలికి వెళ్ళిన అవని ఏం జరిగింది అని అడుగుతుంది..
దానికి ఆరాధ్య నేను ఊరికే ఏమీ కొట్టలేదమ్మా కావాలని అలా చేశాను అని చెప్తుంది. ఎదురింట్లో ఉన్న నాన్నని నువ్వు కలవడానికి వెళ్లిన మాట్లాడడానికి వెళ్లిన ఈ కాలనీ వాళ్లు తప్పుగా అనుకోకూడదు అని మీరిద్దరు భార్యాభర్తలుగా అందరికీ తెలియాలనే ఇలా చేశానని ఆరాధ్య అంటుంది. ఆరాధ్య చేసిన పనికి అవని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కమల్ బయట బైక్ మీద వెళుతూ ఉంటాడు.. భానుమతికి ఎలాగైనా మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని నాటకం మొదలు పెడతాడు కమల్. భానుమతి కమల్ ని ఏమైందని అడుగుతుంది. అవని వదినని అన్నయ్యను కలిపి ప్రయత్నం చేయట్లేదు కదా.. అందుకే తాతయ్య అలిగి నీ దగ్గరికి రావట్లేదని అంటాడు.
శ్రియ పల్లవి ఇద్దరు కలిసి ఒకే కారులో వడ్డానంని తూకం వేయించడానికి వెళ్తారు. అయితే మధ్యలో భానుమతి కనిపించడంతో కారాపి ఆమెతో మాట్లాడతారు. అవని మాట గురించి మాట్లాడటంతో భానుమతి సీరియస్ అయి ఇద్దరికీ చెంపలు వాయిస్తుంది. అటు అవని శ్రీకర్ కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది.. అయితే పల్లవి మేటర్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళకి అక్షయ్ తో సంతకం పెట్టించుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన చక్రధర్ తో ఫోన్లో మాట్లాడడం విని అతని ఫాలో అవుతారు..
Also Read : బాలును రావొద్దని ప్రభావతి కండీషన్..శోభన ప్లాన్ సక్సెస్.. మీనా మాటకు సీరియస్..
ఆ వ్యక్తిని ఫాలో అవుతూ అవని శ్రీకర్ చక్రధర్ ఇంటికి వెళ్తారు. కచ్చితంగా చక్రధర్ మనిషి అని అభిప్రాయానికి వస్తారు.. అసలు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు వీడియో తీయాలని అనుకుంటారు. ఇద్దరు కలిసి కిటికీలోంచి చక్రధర్ మాటల్ని రికార్డ్ చేస్తారు. అక్షయ్ తో సంతకాలు పెట్టించుకోవడానికి మేము చాలా రిస్క్ చేశామని పర్సంటేజ్ ను పెంచాలని అతను అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ చక్రధర్ అడ్డంగా ఇరుక్కుంటాడేమో చూడాలి..