Illu Illalu Pillalu Today Episode March 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొడుకు పెళ్లి ఇలా ఆగిపోతుంది అని అస్సలు అనుకోలేదంటూ బాధపడిపోతుంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ చందున అరెస్ట్ చేయడంతో దిగులుగా కూర్చుని ఉంటారు. ధీరజ్ ఇంట్లోకి రావడం చూసి రామరాజు కోపం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇంట్లోకి అని అరుస్తాడు. ధీరజ్ నీకు కొడతాడు నీ వల్లే కదా ఇప్పుడు పెద్దోడు అలా జైల్లో ఉన్నాడు పెళ్లి కావలసిన వాడు ఇలా జైలు పాలు అవ్వడానికి కారణం నువ్వు కాదా అనేసి అరుస్తాడు. నా తండ్రి మీద దెబ్బ పడితే ఎలా ఊరుకుంటాను అని దీరజ్ అంటాడు. కానీ రామ రాజు మాత్రం నువ్వు తప్పు చేశావు అని అరుస్తాడు. అన్న జీవితాన్ని పాడు చేసిన తమ్ముడివి అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్ నుంచి అర్జంట్ గా రమ్మని ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్తారు. రామరాజు ఫ్యామిలీ ఇటు భద్ర వల్ల ఫ్యామిలీ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ ప్రేమను చూసి షాక్ అవుతారు నువ్వేంటి ప్రేమ ఎక్కడున్నావంటే.. ఈ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య కొట్టాడని కేసు పెట్టింది ఇంట్లోంచి మెడ పట్టు గెంటేసాడు అంటూ క్రిమినల్ కేసు పెట్టడంతో ఈ కేసు స్ట్రాంగ్ ఏంది విశ్వం ఆ కేసును వెనక్కి తీసుకుంటే ఈ అమ్మాయి ఆ కేసును వెనక్కి తీసుకుంటానని అంటుంది ఇది చాలా క్రిటికల్ కేసు. ఈ కేసులో బెయిల్ కూడా రాదు ఆ అబ్బాయి చందుకు నాలుగు రోజులు అయిన తర్వాత బెయిల్ రావచ్చు. ఎస్ఐ అనగానే భద్ర టెన్షన్ పడుతుంది వెంటనే మేము కేసు వెనక్కి తీసుకుంటామని అంటుంది. విశ్వం చేత కేసు వెనక్కి తీసుకునేలా చేస్తుంది. ఇక ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చి నువ్వు బాగా చేశావు పుట్టింటికి నువ్వు మంచి పని చేశావు ఆ దుర్మార్గున్ని పెళ్లి చేసుకొని నువ్వు చాలా మారిపోయావు అనేసి అంటుంది. ఎంత చెప్పాలని చూసినా కూడా భద్ర వినకపోగా ప్రేమనే తిడుతుంది..
ప్రేమ ఎంత చెప్పినా కూడా భద్ర వినదు నోరు ముయ్ ఇక మాట్లాడితే అసలు ఊరుకోను అంటుంది. ఇక విశ్వం కూడా పాముకు పాలు పోస్తే కాటేస్తుందని తెలిసిందే కదా మనకు శత్రువులు ఆ రామరాజు అనుకున్నాం కానీ మన ఇంట్లోనే మనం పెంచిన అమ్మాయి మనకు శత్రువు అవుతుందని అస్సలు అనుకోలేదని విశ్వం కూడా అంటాడు. అటు సేన మా గుండెల మీద పెట్టుకుని పెంచాం కానీ నువ్వు ఇలా చేస్తావని సొంత అన్న మీద కేసు పెడతామని అస్సలు ఊహించలేదంటూ ప్రేమను అంటాడు.
ఇక ప్రేమ తన ఇంట్లో వాళ్ళ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నర్మదా అక్కడికి వెళ్లి నీ వల్ల తప్పు జరిగిందని నువ్వు అనుకున్నావు ఇప్పుడు నీ వల్లే బావగారు బయటకు వచ్చారని అందరూ సంతోషంగా ఉన్నారు నువ్వెందుకు ఏడుస్తున్నావ్ అంటే ఇక్కడ సంతోషంగా ఉన్నారు కానీ నా ఇంట్లో వాళ్లకి నేను శాశ్వతంగా దూరమైపోయాను ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు అక్క అని బాధపడుతుంది.
ప్రేమ చేసిన పనికి భద్ర సేన విశ్వం ముగ్గురు కోపంగా ఉంటారు. అమ్మ ఇదేమి తప్పులేదు ఆ రామరాజు వల్లే ఇలా చెప్పించారు ఇలా చేశారేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. జైలుకెళ్లకపోయిన పర్లేదు వాడికి పెళ్లయితే క్యాన్సిల్ అయింది కదా అది మన సంతోషంగా ఫీల్ అవుదామని అంటారు. అప్పుడే భాగ్యం శ్రీవల్లిని తీసుకొని రామ రాజు ఇంటికి వెళ్తుంది. ఏమైంది చెల్లెమ్మ ఏం జరిగింది అని అడిగితే మా అమ్మాయి మీ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదంట. మీ అబ్బాయి మంచితనము తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద మా అమ్మాయికి బాగా నచ్చేసాయి అంట చేసుకుంటే జీవితంలో అతనే చేసుకుంటానని అంటుంది మీరే న్యాయం చెప్పండి అన్నగారు ఏం చేయాలో అని భాగ్యం అంటుంది.
అది కావాలనే వాళ్ళు పెట్టారు అన్న కేసు తప్ప మా వాడు నిజంగానే తప్పు చేయలేదమ్మా అని అనగానే భాగ్యం మీ కూతురు లాగా నా కూతుర్ని ఆలోచించి చెప్పండి అని అంటే నా కొడుకు చాలా మంచివాడు పెద్దలంటే గౌరవం ఉన్నవాడు నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు అని చెప్పగానే భాగ్యం మీరు ఇంతగా చెప్తున్నారు కదా మరి ఈ పెళ్లి నాకు ఓకే రేపు నిశ్చితార్థం పెట్టేసుకుందామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు భాగ్యం గుడిలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..