Illu Illalu Pillalu Today Episode may 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి నర్మదా సాగర్ ని అడ్డంగా ఇరికించాలని అనుకుంటుంది. తను అనుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరినీ బుక్ చేస్తుంది. అయితే శ్రీవల్లి చేస్తున్న పనిపై అందరూ కోపంగా ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా అతని ఇన్వాల్వ్ అయ్యి కావాలని మావయ్య గారితో చెబుతుందని ప్రేమ ఫీల్ అవుతుంది. అయితే శ్రీవల్లి ప్లాను గ్రాండ్ సక్సెస్ అవడంతో వంటగదిలోకి వెళ్లి తీన్మార్ డాన్స్ వేస్తూ ఉంటుంది. రేపు నర్మదాసాగరు అడ్డంగా బుక్ అవడం ఖాయం అంటూ ఫుల్ ఖుషి అవుతు స్టెప్పులెస్తుంది. అప్పుడే ప్రేమ వంటగదిలోకి వస్తుంది. అక్క నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా.. నర్మదా అక్క వాళ్ళ ఫోటోలు మామయ్యకి చూపించమని నిన్ను అడిగారా? మరి నువ్వెందుకు చూపించావు నీకు కొంచమైనా ఉందా? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు నీకు తెలియదా? అంటూ ప్రేమ పెద్ద క్లాస్ పీకుతుంది.. ఇంట్లో జరుగుతున్న గొడవలకి శ్రీవల్లినే కారణమని ప్రేమ కూడా అనుకుంటుంది.. ఉదయం ఎంత సంతోషంగా నర్మదా సాగర్ ఇంటికి వస్తారు.. వచ్చి రాగానే రామరాజు సాగర్ కి షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్, నర్మదా రెండు రోజులు ఒంటరిగా భార్యతో ఎంజాయ్ చేసిన సాగర్ ఆ జ్ఞాపకాల నీ నెమరు వేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లోకి రాగానే ప్రేమ వేదవతి అందరూ వాళ్ళని పలకరిస్తారు. కానీ రామరాజు ఫోన్ చేస్తాడు. అది చూడగానే సాగర్ టెన్షన్ పడతాడు.. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు రా అని రామరాజు అడుగుతాడు. నీకోసం ఇంత చేస్తున్నావ్ తండ్రి చెప్పిన మాటని కనీసం లెక్క చేస్తున్నావా నువ్వు అని నానా మాటలు తిడతాడు… ఎంతో ముఖ్యమైన పని కాబట్టే నీకు అప్పగించాను మొండి బాకీలు కాబట్టే నువ్వు దగ్గరుండి తీసుకొస్తావని నేను అనుకున్నాను కానీ నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీ భార్యతో షికార్లు చేస్తున్నావా అని రామరాజు తిడతాడు.
ఇక మధ్యలో వేదవతి కలుగజేసుకుని, ఏంటండీ కొత్తగా పెళ్లయిన వాళ్లతో ఇలానే నా ఉండేది వాళ్ళ ఇష్టం కదా కాస్త సరదాలనే ఉంటాయి కదా.. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా అని.. ఆ విషయం నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా నేను వాళ్ళిద్దరూ సరదాగా ఉంటే వద్దని చెప్తున్నాను అని రామరాజు అరుస్తాడు. కానీ చందు వదిలేయండి నాన్న ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్తున్నాడు కదా మీరు ఎందుకు అంత కోప్పడుతున్నారు అని అంటాడు. ఈ గొడవ మధ్యలోకి రావద్దు రా అసలు అని రామరాజు అరుస్తాడు.. నువ్వు తప్ప వీరిద్దరూ ఒక పనికైనా పనికొస్తారా..? రామరాజు కొడుకులుగా కాకుండా నెత్తి మీద రూపాయి పెడితే అమ్ముడుపోతారా ఎందుకు పనికి రాకుండా పోతారు.. వాడు ఒక రకం వీడొక రకం ఎలా బ్రతుకుతారో? రేపు నేను లేకున్నా అంటే వీరి పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదని అరుస్తాడు..
ఇక ప్రేమ నర్మదా ఎంత బాధ పడుతుందో అని వెతకడానికి వెళుతుంది. ఇందులో నర్మద లేకపోవడంతో టెన్షన్ పడుతూ వేదవతిని పిలుస్తుంది. ఏమైందే ఎవరో చచ్చినట్లు అలా అరుస్తున్నావ్ ఏంటి అని వేదవతి అంటుంది. ఏం లేదత్తా నర్మదా అక్క రూమ్ లో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో మామయ్య అరిచిందానికి ఎక్కడికైనా వెళ్ళిందేమో? లేదా ఏమైనా చేసుకుందేమో? అని నాకు కంగారుగా ఉంది అని అంటుంది.. ఇంతలో దానికి ఏమైనా చేసుకుంటారా అసలు నర్మద గురించి మీకు తెలిసే ఆలోచిస్తున్నావా మాట్లాడుతున్నావా అని వేదవతి పొంతన లేకుండా ప్రేమపై అరుస్తుంది.
మీ అక్క కోపం వస్తే ఎక్కడుంటుంది నాకు తెలుసు గాని పద చూపిస్తానని వంటగదిలో చూపిస్తుంది. నర్మదా వంటగదిలో జంతికలను తింటూ ఉంటుంది. అత్త ఎక్కడుంది ఏంటి నేను ఇంకా ఏమైనా చేసుకుందేమో అని టెన్షన్ పడ్డాను అని ప్రేమ అడుగుతుంది.. దానికి కోపం వస్తే తింటుంది తిండిపోతు కదా అందుకే ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు అని వేదవతి సెటైర్లు వేస్తుంది. అక్క నువ్వేంటి ఏ బాధ పడతావ్ అనుకుంటే ఇలా తింటున్నవ్ ఏంటి అని ఆ ప్రేమ అడుగుతుంది. ఈ జంతికలు అసలు ఉప్పేలేదు.. వంటల్లో నేను పెద్ద తోపు అని ఎవరో చెప్పుకుంటూ ఉంటారు. కనీసం ఉప్పు కారం కూడా సరిగ్గా వేయాలని తెలియదా అని వేదవతికి రివర్స్లో పంచ్ వేస్తుంది.
ఇక అసలు ఈ ఫోటోలు గురించి మావయ్య గారికి ఎవరు చెప్పారు అని నర్మదా అడుగుతుంది. శ్రీరామ శ్రీరామ ఇదేమైనా బాగుందా? నేనెందుకు చెప్తాను అని అంటుంది. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు ఏదో అత్తయ్య గారు కదా సంతోషపడతారని ఫోటోలు మీకు చూపించాలని అనుకుంటే, మీరు వెళ్లి మావయ్య గారికి చూపిస్తారని నర్మదా నిందలు వేస్తుంది.. నేను చూపించలేదు అత్త చూపించలేదు అక్క శ్రీవల్లి అక్క చూపించింది అని ప్రేమ నిజం చెబుతుంది. నర్మదా ఆ మాట వినగానే కాలు కాలిన కోడిలాగా పరిగెత్తుకుంటూ శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది. అసలు నా గురించి నువ్వు మామయ్య గారికి చెప్పాల్సిన అవసరం నీకేంటి? అసలు నువ్వు ఎవరు అని ఇద్దరు జుట్లు పట్టుకుని వరకు వెళ్తారు.. ఇద్దరి మధ్య వాదనా కాస్త పెరుగుతుంది. వారి మధ్యలో వేదవతి వచ్చి మీరిద్దరు కొట్టుకుంటారా? కొట్టుకోవడానికి మీకు కొంచమైనా లేదా అని అరుస్తుంది. నర్మదా వేదవతిని అరిచేసి లోపలికి వెళ్ళిపోతుంది. మీకు మీ గవర్నమెంట్ కోడలు అంటే నీ ఇష్టం కదా అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…