Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ అక్కా అంటూ పరుగెడుతూ వెళ్తుంది. ఇంతలో మనోహరికి డాష్ ఇస్తుంది. మనోహరి కోపంగా ఏంటా పరుగు చూసుకుని వెళ్లొచ్చు కదా అంటుంది. దీంతో మిస్సమ్మ కంగారుగా మను నేను ఆరు అక్కను చూశాను అంటుంది. ఫ్లోలో మనోహరి రోజూ చూస్తూనే ఉన్నావు కదా అంటుంది. మిస్సమ్మ షాకింగ్ గా ఏంటి మను ఏమంటున్నావు నేను రోజూ చూడటమేంటి అని అడుగుతుంది. వెంటనే మనోహరి సారీ ఊరికే అన్నానులే అసలు నువ్వు ఆరును చూడటమేంటి..? పిచ్చి కానీ పట్టిందా..? అంటుంది. దీంతో మిస్సమ్మ కోపంగా మను నువ్వు ఆరు అక్కా అని ఫోటో చూపించావు కదా నేను ఆ అక్కను ఇందాకే చూశాను మను అని చెప్తుంది. దీంతో కంగారుగా మనోహరి ఏంటి ఇక్కడికి వచ్చిందా..? అది ఉండేది ఇక్కడ కాదు కదా అంటుంది. దీంతో మిస్సమ్మ ఏయ్ అక్క ఏమైనా మనిషా..? నువ్వు ఎక్కడ చెబితే అక్కడ ఉండటానికి అక్క మిస్ అయింది నేను వెతకాలి జరుగు అంటూ మిస్సమ్మ వెళ్లిపోతుంది.
దీంతో మనోహరి భయంగా కొంపదీసి ఆ లావణ్య కానీ వచ్చిందా..? అయ్యో ఈ భాగీ కానీ దాన్ని కలిస్తే నేను అబద్దం చెప్పానని తెలిసిపోతుంది అయ్యో ఇప్పుడు ఎలా అనుకుంటూ మనోహరి అక్కడి నుంచ వెళ్లిపోతుంది. ఆరును వెతుక్కుంటూ వెళ్లిన మిస్సమ్మ దగ్గరకు వస్తుంది. ఏమైంది భాగీ సార్ ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. అక్కా నేను ఆరు అక్కను చూశాను అని చెప్తుంది. దీంతో అనామిక షాక్ అవుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు భాగీ చనిపోయినవాళ్లు ఎక్కడైనా తిరిగి వస్తారా..? అంటూ తిడుతుంది. ఆత్మలు కనిపిస్తాయి అని మాత్రం చెప్పకు అంటుంది. దీంతో మిస్సమ్మ లేదు అక్కా నాకు కనిపించింది అంటూ వెతుక్కుంటూ వెళ్తుంది.
మరోవైపు మనోహరి వెళ్లి లావణ్యను కలుస్తుంది. లావణ్య హయ్ మను ఎలా ఉన్నావు.. ఎన్ని రోజులు అయిందే నిన్ను చూసి అంటుంది. మనోహరి బాగున్నాను.. లావణ్య నాకోసం ఒక ఫేవర్ చేస్తావా అని అడుగుతుంది. లావణ్య అడగవే చేస్తాను అని చెప్తుంది. దీంతో మనోహరి వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవా..? అని చెప్తుంది. ఇన్ని రోజులు తర్వాత కలిస్తే అలా మాట్లాడతావేంటి..? అంటుంది లావణ్య. దీంతో మనోహరి నేను ఒక ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోవడానికి నీ ఫోటో చూపించి చాలా దూరం వెళ్లిపోయిన ఫ్రెండ్ అని చెప్పాను. కావాలంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాను అంటుంది. దీంతో లావణ్య కోపంగా ఇప్పుడు కూడా నీ స్వార్థానికే వచ్చి పలకరించావు కదా అయినా నీ ప్రాబ్లమ్‌కు నేను ఎందుకు హెల్ప్ చేయాలి నేను చేయను అంటూ లావణ్య వెళ్లిపోతుంది.
అమర్ పిల్లల దగ్గరకు వెళ్లి అనామిక భాగీ ఎక్కడ అని అడుగుతాడు. అనామిక ఏమీ చెప్పకపోయే సరికి ఏమైంది తనకు ఉన్నట్టుంది ఏదోలా మాట్లాడుతుంది. మీరు పిల్లలను చూస్తూ ఉండండి నేను వెళ్లి భాగీని తీసుకుని వస్తాను అని వెళ్లిపోతాడు. తర్వాత పిల్లలను తీసుకుని అనామిక వెళ్తుంది. అంజు తాను తిన్న చాక్లెట్ వేపర్ డస్ట్‌బిన్‌లో వేయడానికి వెళ్తుంటే.. వెనక నుంచి వచ్చిన రణవీర్ అంజును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంజుకు మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోగానే చెత్త ఆటోలో అంజలిని తీసుకెళ్తుంటారు. మరోవైపు లావణ్య కోసం వెతికి వెతికి అలసిపోయిన మిస్సమ్మ ఒక దగ్గర కూర్చుని ఉంటే మనోహరి వచ్చి దూరం నుంచి గమనిస్తుంది.
ఇంతలో రణవీర్ రాగానే.. నువ్వు అంజలిని ఎలా కిడ్నాప్ చేయాలో ఆలోచించావా..? అని అడుగుతుంది. ఆలోచించడం ఏంటి కిడ్నాప్ చేసేశా అని చెప్తాడు రణవీర్. దీంతో మనోహరి షాక్ అవుతుంది. మా వాళ్లు అంజలిని బయటకు కూడా తీసుకెళ్లిపోయారు అని చెప్తాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అనామిక, పిల్లలు మిస్సమ్మ దగ్గరకు వస్తారు. భాగీ అయిందేదో అయిపోయింది కదా దాని గురించి వదిలేసెయ్ అని చెప్తుంది అనామిక. లేదక్కా నేను నిజంగా అక్కను చూశాను. కానీ మీరు ఎవ్వరూ నమ్మటం లేదు.. అని చెప్తుంది. సరే ఇక బయల్దేరుదాము ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు అని అనామిక అడుగుతుంది. తెలియదు అక్కా నా మీద కోపంతో ఎక్కడున్నారో ఏంటో..? అంటూ మనోహరి, రణవీర్‌ను చూసి షాక్ అవుతుంది మిస్సమ్మ..
అంజును తీసుకుని వెళ్తున్న ఆటోను ఎగ్జిబిషన్ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్లు చెక్ చేస్తారు. అందులో ఉన్న అంజును సేవ్ చేస్తారు. రణవీర్ మనుషులు ఆటో వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు. అందరూ అంజును తీసుకుని ఇంటికి వెళ్లిపోతారు. అంజు పడుకుని ఉంటుంది. అనామిక కోపంగా సార్‌ను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పు అంటుంది అనామిక. ఈ పని చేసిన వాళ్లు వాళ్లకు సాయం చేసిన వాళ్లను ఎవ్వరినీ వదలకూడదు అని చెప్తుంది. కింద హాల్లో రణవీర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముంది అంకుల్ అంటాడు.
దీంతో అమర్ కోపంగా వాళ్లు లైఫ్‌లో నా ఫ్యామిలీ జోలికి రాకుండా చేయాలి అని చెప్తాడు. పైన రూంలో కూడా మిస్సమ్మ ఈ సారి ఆయన నిజం తెలుసుకునే వరకు ఆగరు.. తెలుసుకున్నాక వాళ్లు ప్రాణాలతో ఉండరు అని చెప్తుంది. కింద అమర్ వాళ్లు ఎవ్వరైనా ఎంత తెలివైన వాళ్లైన ఈసారి నా నుంచి తప్పించుకోలేరు అంటాడు. దీంతో పైన మనోహరి, కింద రణవీర్ భయంతో వణికిపోతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?