E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 9th: నాన్న నేను మీకు ఈ మధ్య నిజం చెప్పాలి అని చాలాసార్లు ప్రయత్నాలు చేశాను కానీ మీ నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటానని అందుకే నిజం చెప్పలేకపోయాను. ఏ కోడలు అయితే నన్ను ఇంటికి తెచ్చుకున్నారో ఆఫ్ కోడలే చాలా మోసాలు చేసింది అంటూ ఒక్కొక్క నిజాన్ని చందు బయట పెట్టేస్తాడు.. రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఇదే కాదు నాన్న ఒక్కొక్కటిగా వీళ్ళు చేస్తున్న మోసాలన్నీ ఇవే నన్ను నిండా ముంచేశారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. రామరాజుకు నిజం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవడంతో పాటు గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అయితే వల్లిని పట్టుకోవద్దు అని రామరాజు అంటాడు. అయితే ఒక్కసారిగా వల్లి కూడా షాక్ అవుతుంది.

భద్రావతితో వల్లి కనెక్షన్..

నర్మద కూడా అన్ని నిజాలు చెప్పడంతో వల్లి తన బండారు మొత్తం బయటపడింది అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. కనెక్షన్ గురించి కూడా బయటపడడంతో ఆమె ఇకమీదట నా ఆటలు సాగవు మావయ్యకు అన్ని నిజాలు తెలిసిపోయాయని కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి.. భద్రావతి తో కలిసి చేతులు కలిపి వల్లి తన కుటుంబం మీదే కక్ష సాధించేలా ఉంది అని రామరాజు ఒక్కసారిగా కంగారు పడిపోతాడు. అయితే రామరాజుకి నిజం తెలియడంతో కుప్పకు వెళ్ళిపోతాడు. వల్లి చేసిన మోసాలు ఎలాగైనా సరే బయటపడతాయని నర్మదా చేస్తున్న ప్లాను మొత్తానికి ఫలిస్తుంది రామరాజుకి వల్లి గురించి అన్ని నిజాలు తెలుస్తాయి. అయితే వల్లి మావయ్యకి నిజం తెలిసిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటుంది.

రామరాజకు గుండెపోటు..

Advertisement

వల్లి చేసిన మోసాలుచుకొని రామరాజుకి గుండెపోటు వస్తుంది. ఇన్ని రోజులు నిన్ను నా పెద్ద కోడలు దేవత అని నమ్మాను. అలాంటిది నువ్వు ఇంత మోసం చేసి నా ఇంట్లోని వాళ్ళ మీదే కక్ష సాధించాలని చూస్తావా? నేనేం తప్పు చేశానమ్మ నీకు ఏం లోటు చేశాను అమ్మ అంటూ రామరాజు ఎమోషనల్ అయిపోతాడు.. నేను నా కూతురు కొడుకుల కంటే నిన్నే ఎక్కువ నమ్మాను కానీ నువ్వు నన్ను ఈ రోజు ఇంత బాధ పెడతావని నేను అసలు ఊహించలేదు అంటూ రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. గుండె నొప్పితో కింద పడిపోవడంతో అందరూ రామరాజుకి ఏమైందో అని భయపడిపోతూ ఉంటారు. చివరిగా వల్లి మావయ్య గారు అంటూ దగ్గరకు రావడం చూసిన రామరాజు అస్సలు నా దగ్గరికి రావద్దమ్మా అని సీరియస్ అవుతాడు. అయితే వల్లి నేను ఏ తప్పు చేయలేదు మావయ్య గారు నాకు కాపురం నిలబెట్టుకోవడానికి చేశాను అని ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం వల్లికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూనే ఉంటుంది.

భాగ్యంకు మైండ్ బ్లాక్..

రామరాజు భాగ్యం వాళ్ళని పిలిపించాలి అని చెప్పగానే ప్రేమ సుఖ నేను ఫోన్ చేసి అర్జెంటుగా ఈ విషయం చెప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటుంది. ఇక సుకన్య కూడా అర్జెంటుగా ఇక్కడికి రమ్మని పిలవగానే చెప్పు అంటుంది ఇక సుకన్య వెంటనే పిలవగానే భాగ్యం వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు. ఏం తమ్ముడు ఏదైనా విశేషమా అర్జెంటుగా రమ్మన్నారు నువ్వు మళ్ళీ తల్లి కాబోతున్నావా అంటూ భాగ్యం అడగగానే.. అక్కడికి వచ్చిన రామరాజు మీ కూతురు ఏం చదివింది చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆనందరావు నేను ఆల్రెడీ నా కూతురు ఎం ఏ ఇంగ్లీష్ చదివింది అని చెప్పాను సర్టిఫికెట్ కూడా తెచ్చాను. మీరు ఇంగ్లీష్ టీచర్గా జాబ్ కూడా ఇప్పించారు కదా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు.

రామరాజు దెబ్బ అదుర్స్..

Advertisement

ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశారు. మీ అమ్మాయి చదువు గురించి అంతా తెలిసిపోయింది అని చందు అంటాడు. నాకు ప్రిన్సిపల్ ఎప్పుడో చెప్పాడు మీ అమ్మాయి దొంగ చదువు దొంగ సర్టిఫికెట్ గురించి అని అనగానే భాగ్యం ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే భాగ్యం నా కూతురు చేసిన తప్పు ఏంటి మీరు ఎందుకు నా కూతుర్ని ఇలా అంటున్నారు అని అంటుంది. అయితే వేదవతి నీ కూతురు చేసిన తప్పులని ఇంకా క్షమించే ఓపిక మాకు లేదు మా ఇంట్లో నుంచి ఎక్కువ తిని తీసుకొని వెళ్ళిపొండి. వేదవతి మాట వినగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నా కూతురు మాత్రమే తప్పు చేసిందా మీ ఇంట్లో ఎవరు తప్పు చేయలేదా నా కూతురు ఎందుకు నిందిస్తున్నారు.. నా కూతురు ఏ తప్పు చేయలేదు అని ఎంతగా భాగ్యం బాధిస్తుంది. శ్రీవల్లిని ఎంత వెనకోసుకొని వచ్చినా కూడా వేదవతి నా ఇంటి పిల్లలని నాశనం చేయాలని చూసిన నీ కూతురు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది. అలాగే రామరాజు కూడా శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం రామరాజు నీ బతిమిలాడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Friday Tv Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

Big Stories

Advertisement
×