E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సుమిత్ర టిఫిన్‌ సెంటర్‌లో పని చేయడం చూసి దక్షిణమూర్తి బాధతో విలవిలలాడతాడు. నువ్వు ఇలా కష్టపడటం నేను చూడలేకపోతున్నాను తల్లీ అంటూ ఎమోషనల్‌ అవుతాడు. అందుకు సుమిత్ర కోపంగా దక్షిణమూర్తిని తిడుతుంది. ఈ కష్టాలకు కారణం ఎవరు నాన్న అని ప్రశ్నిస్తుంది. నా భర్తని చంపడానికి లారీ పంపించింది మీరు కాదా..? మీ కూతురు జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది మీరు కాదా..?  మా ఆస్తులన్నీ అన్యాయంగా లాగేసుకుని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది మీరు కాదా..? మా ఇంట్లోంచే మమ్మల్ని గెంటేసింది మీరు కాదా..? ఇవన్నీ కష్టాలు కాదా నాన్న.. ఇప్పుడు మేము బతకడానికి టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుని పని చేసుకుంటుంటే మీకు కష్టంలా కనిపిస్తుందా..? నీ కూతురి మనసు తెలుసుకోకుండా కోడలు చెప్పిందని నాకు నచ్చని సంబంధం తెచ్చింది మీరే నాన్న.. ఆడపడచు కట్నంగా నాకు కన్నీళ్లను కష్టాలను ఇస్తున్నది మీరే నాన్నా.. అంటూ ఎమోషనల్ అవుతుంది సుమిత్ర.

అందుకు దక్షిణమూర్తి బాధపడుతూనే.. సుమిత్ర అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దశరథ, శివనారాయణను తిడుతుంటాడు. నిన్ను ఇలా చూడలేను తల్లి మన ఇంటికి వచ్చేయ్‌ అమ్మా నీకేం కావాలన్నా ఇస్తాను రా తల్లి  అంటూ దక్షిణమూర్తి అడిగితే.. ఏం కావాలన్నా ఇస్తావా..? నాన్న అని సుమిత్ర అడుగుతుంది. నువ్వు అడిగితే ఏమైనా ఇస్తాను తల్లి అంటాడు దక్షిణమూర్తి. అయితే మా ఆస్తులు మాకు తిరిగి ఇస్తావా..? అని సుమిత్ర అడిగితే.. నువ్వు అడిగితే ఆస్తులేంటమ్మా..? నా ప్రాణాలు కూడా ఇస్తానమ్మ ఆంటాడు దక్షిణమూర్తి. ఆ మాటకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా నాన్న ప్రాణాలు ఇవ్వడానికి.. నా పెళ్లి సమయంలో తండ్రిగా చచ్చిపోయావు.. జ్యోత్స్న పెళ్లి సమయంలో తాతగా చచ్చిపోయావు.. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసి మనిషిగా చనిపోయావు అంటూ తిడుతుంది సుమిత్ర.

Advertisement

సుమిత్ర కోపంగా దక్షిణమూర్తిని తిడుతుంటే మాలిని కల్పించుకుని అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా..? సుమిత్ర అంటే ఇంకా ఏం చేస్తావు ఇంత కంటే ఇంకా దిగజార్చలేవు కదా మహా అయితే ప్రాణాలు తీయిస్తావేమో అంటూ సుమిత్ర అంటే మాటలు చాలా ఈజీగా మాట్లాడొచ్చు బతకడమే కొంచెం కష్టంగా ఉంటుంది సుమిత్ర అంటూ దక్షిణమూర్తిని, సూరజ్‌ లను ఇక వెళ్దాం పదండి అంటూ కారు దగ్గరకు వెళ్లిపోతుంది మాలిని. కార్తీక్‌, సూరజ్ తో ఎందుకు ఈ గొడవలు నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే.. నువ్వు మీ తాతకు చెప్పు ఈ గొడవలు వద్దని అంటాడు.

దీప మాత్రం నువ్వు వచ్చింది మాత్రం గొడవకు కాదని అర్థం అవుతుంది సూరజ్‌. నువ్వు జ్యోత్స్న కోసం వచ్చావు.. అప్పటి నుంచి నీ కళ్లు జ్యోత్స్ననే వెతుకుతున్నాయి. ఆ విషయం మీ అమ్మకు తెలియదులే పాపం అంటుంది దీప. వాళ్లతో మాటలేంటి నువ్వు రారా సూరజ్‌ అంటూ మాలిని పిలుస్తుంది. సూరజ్‌ వెళ్లి కారు ఎక్కగానే.. అందరూ కారులో వెళ్తుంటారు. దక్షిణమూర్తి కోపంగా మాలిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసేయ్‌ కానీ నా కూతురు నా మనవరాలు మన ఇంటికి రావాలి అంటాడు. సూరజ్‌ ఇక వదిలేయండి తాత.. ఇప్పటి వరకు రివేంజ్‌ తీర్చుకున్నాము కదా అంటాడు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని వాళ్లకు ఈ మాలిని అంటే ఏంటో చూపిస్తానని మాలిని మనసులో అనుకుంటుంది.

Advertisement

తర్వాత శివనారాయణ టిఫిన్‌ బండికి పోటీగా మాలిని వేరే వ్యక్తుల చేత టిఫిన్‌ బండి పెట్టిస్తుంది. ఏ టిఫిన్‌ అయినా 20 రూపాయలే అని అనౌన్స్‌ చేయిస్తుంది. దాంతో శివనారాయణ బండి దగ్గరకు కస్టమర్లు ఎవరూ రారు.. శివనారాయణ బిజినెస్‌ పడిపోయిందని బాధపడుతుంటే.. కార్తీక్‌ వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. వర్కవుట్‌ అవుతుందా..? అని శివనారాయణ అడిగితే చేసి చూడు తాత అని కార్తీక్‌ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Friday Tv Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

Big Stories

Advertisement
×