Bhopal News: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఫలితంగా భర్తలను చంపేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కాకపోతే మూడో భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లో అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామం. భయాలాల్ రజాక్ మహా రసికుడు. ప్రస్తుతం ఆయన వయస్సు 60 ఏళ్లు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలీదుగానీ మొదటి భార్య అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత రెండో భార్యగా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే వారికి సంతానం కలగలేదు.
భర్త మంచివాడు కావడంతో రెండో భార్య తన చెల్లిని భర్తకు ఇచ్చి మూడో వివాహం చేసింది. మూడో భార్య పేరు మున్ని అలియాస్ విమ్లా. మొదట్లో వీరి బంధం బాగానే సాగింది. ఈ క్రమంలో పిల్లలు పుట్టారు. వారితో హాయిగా ఉంటున్న సమయంలో వీరి జీవితాల్లో కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. స్థానిక ప్రాపర్టీ డీలర్ నారాయణ దాస్ కుష్‌వాహ్‌తో మూడో భార్య మున్నికి పరిచయం ఏర్పడింది. అది మరింత దగ్గరైంది.
చివరకు వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలో మున్ని- కుష్‌వాహ్ మిడ్ నైట్ తతంగం మొదలుపెట్టారు. ఈ విషయం భర్త రజాక్ తెలిసింది. ఈ క్రమంలో భార్యని మందలించాడు. తన ఎంజాయ్‌కి భర్త అడ్డువస్తున్నాడని భావించింది. ప్రియుడితో కలిసి భర్తని అంతమొందించాలని ప్రణాళిక రచించింది. ఆగస్టు 30న అర్థరాత్రి దాటక రజాక్‌ను హత్య చేశారు.
ALSO READ: బర్త్ డే చేస్తామని పిలిచి డోర్ లాక్ చేసి, ఆ తర్వాత యువతి
ఇక్కడితో భయాలాల్ రజాక్ పనైపోయింది. హత్య చేయడానికి 25 ఏళ్ల ధీరజ్ కోల్‌తో మాట్లాడుకున్నారు. చంపేసిన డెడ్ బాడీని శారీలో కట్టి స్థానిక బావిలో పడేశారు. భర్త కనిపించడం లేదంటూ రెండో భార్య వెతకడం మొదలుపెట్టింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది రెండో భార్య. దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. చివరకు ఓ బావిలో శారీతో కట్టేసిన మూట కనిపించింది.
చివరకు విచారణ మొదలు పెట్టారు. తొలుత మూడో భార్య మున్ని విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. తన చెల్లెలు భర్తని చంపేయడం జీర్ణించుకోలేకపోయింది రెండో భార్య. తన చెల్లి ఇంత పని చేస్తుందని ఊహించుకోలేకపోయింది. ఈ విషయాన్ని మొత్తం పోలీసులు బయటపెట్టారు. మూడో భార్య మున్నీ, ఆమె ప్రియుడు కుష్వాహా, చంపిన నిందితుడు ధీరజ్‌లను అరెస్టు చేశారు. అక్రమ సంబంధాలు ఎలా జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.