Intinti Ramayanam Today Episode August 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతిని అక్షయ్ గుడికి నమ్మించి తీసుకొని వెళ్తాడు.. అక్కడ పల్లవి వాళ్ళు గుడిలో అన్ని సిద్ధం చేసి రెడీ చేస్తారు. పల్లవి భానుమతి శ్రియ గుడికి వచ్చేస్తారు..అక్కడ ఏర్పాట్లను చూసి భానుమతికి అనుమానం వస్తుంది. ఏదో పూజ వ్రతం అని చెప్పావు. ఇక్కడ ఏదో పెళ్లి లాగా ఉంది అని భానుమతి అడుగుతుంది. పంతులుగారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లుంది అని భానుమతి అడుగుతుంది. పల్లవి నువ్వు కాసేపు మాట్లాడకు నేనేం చేస్తున్నామో నీకు తర్వాత తెలుస్తుంది అని అంటుంది.పల్లవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పార్వతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది. పార్వతి ఆటోలో టెన్షన్ గా బయలుదేరుతూ ఉంటుంది.. ఇటు అవని వాళ్ళందరూ కూడా పెళ్లి ఆపడానికి బయలుదేరుతారు..
అక్షయ్ ప్రణతిని తీసుకొని గుడికి వస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రణతి నాకు పెళ్లి ఇష్టం లేదు నేను భరత్ ని ప్రేమించాను అని అంటుంది. అక్షయ్ మాత్రం నువ్వు ఆ భరత్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అమ్మ చెప్పిన వాటితోనే నీకు పెళ్లి జరిపిస్తాను అని అంటాడు..
భరత్ ని కేసులో ఇరికించిన వాళ్ళు వచ్చి చెప్పిన కూడా అక్షయ్ వినడు. ఇలాంటి వాళ్లు డబ్బులు కోసం ఏదైనా చేస్తారు ఇది ఒక కొత్త నాటకమని పల్లవి అంటుంది. అవని ఎంత చెప్పినా సరే అక్షయ్ మాత్రం వినడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మోసగాళ్లు అని ఎంత చెప్పినా సరే అక్షయ్ మాత్రం వినడు. నీ తమ్ముడు మాత్రమే మంచోడా ఎవర్ని ఎలా నమ్మలో నాకు బాగా తెలుసు అని అక్షయ్ అవనితో వాదిస్తాడు.. నా చెల్లెలు పెళ్లి మా అమ్మ చూసిన వ్యక్తితోనే జరుగుతుంది అని అక్షయ్ తేల్చి చెప్పేస్తాడు. భరత్ ఏ తప్పు చేయలేదని చెప్పినా సరే అక్షయ్ మాత్రం నా చెల్లి పెళ్లి భరత్ తో చేయడానికి వీల్లేదు అని మొండిగా కూర్చుంటాడు.
నా తల్లి నిర్ణయాన్ని నేను కాదనలేను అతనికి ఇచ్చిన చెల్లి పెళ్లి చేస్తాను అని మొండిగా ప్రవర్తిస్తాడు. ఈ తండ్రి చచ్చాడు అనుకున్నావా నా నిర్ణయానికి విలువ ఇవ్వరా అని రాజేంద్రప్రసాద్ ఆవేశపడతాడు. అక్షయ్ మాత్రం మీరు కూతురు గురించి ఆలోచించట్లేదు అంటూ రాజేంద్రప్రసాద్ ని అరుస్తాడు.. అప్పుడే పార్వతి ఎక్కడికి వచ్చి ఆపండి అని అంటుంది.. వచ్చారా మీ కోసమే ఎదురు చూస్తున్నాం.. అలాంటి మంచి సంబంధం మీ అమ్మాయికి దొరకడం మీ అదృష్టం కానీ మీ వాళ్ళు ఇంత రచ్చ చేస్తున్నారు అని పెళ్ళికొడుకు తల్లి అంటుంది.
ఆ మాట వినగానే కోపంతో రగిలిపోయిన పార్వతి ఆమె చెంప చెల్లును పగలగొడుతుంది.. మీరు ఎలాంటి మంచి వాళ్ళు ఇందాకే నాకు తెలిసింది అని అసలు నిజం బయటపెడుతుంది. మీరంతా మోసగాళ్లు అనేది ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసింది అని అంటుంది. అమ్మాయిలని వాడుకొని వదిలేస్తే నీ కొడుకు ఒక మంచోడా అని పార్వతి వాళ్లపై ఒంటికాలు మీద లేస్తుంది.. ఆ పెళ్ళికొడుకు ఏంటి అత్తయ్య మా అమ్మని కొడతారని అడుగుతుంటే నోరు ముయ్యి అని పార్వతి వాణ్ణి కూడా చంప చెల్లుమనిపిస్తుంది.
Also Read : బాలును మోసం చేసిన మీనా.. మౌనికకు చివాట్లు.. శివకు షాకిచ్చిన మీనా..
రాజేంద్రప్రసాద్ ప్రణతి పెళ్లి పీటల వరకు వచ్చింది ఇక మనం ఈ పెళ్లిని భరత్ తో చేసేస్తే బాగుంటుందని రాజేంద్రప్రసాద్ పార్వతిని ఒప్పిస్తాడు. పార్వతి పంతులుగారు వాళ్ళిద్దరు పెళ్లిని జరిపించండి అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి ఇద్దరు అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతారు. అక్షయ్ కూడా ఎంత చెప్పినా పార్వతీ వినడం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి ప్రణతి భరతుల పెళ్లి సవ్యంగా సాగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..