Intinti Ramayanam Today Episode April 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆరాధ్య కోసం లంచ్ బాక్స్ ను తీసుకొని స్కూల్ కు వెళ్తాడు. ఆరాధ్య నేను అన్నం తినేశాను నాన్న నాకు అమ్మ అన్నం తినిపించిందని చెబుతుంది. అదివిన్నఅక్షయ్ ఏంటి స్కూల్ కి వచ్చి అన్నం తినిపించిందని అడుగుతాడు. ఇక్కడికి వచ్చి నీకు అన్నం తినిపించిందా అని అనగానే అక్కడికి వస్తుంది. నువ్వు నా కూతురుకి అన్నం తినిపించావా అని అనగానే నేను ఇక్కడ పార్టీని జాబ్ చేస్తున్నానండి గ్రాఫ్ టీచరుగా అందుకే ఇక్కడ ఆరాధ్యకు అన్నం తినిపించాను అని అంటుంది. సరే అయితే నువ్వు తినలేదు కదా.. ఈ బాక్స్ ను తీసుకొని తినేసేయని అక్షయ అంటాడు. కానీ నాకేం అవసరం లేదు ఇక నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతాను ఇంకా అనేసి అవని అనగానే అక్షయ్ కూడా వెళ్ళిపోవాలనుకుంటాడు అప్పుడే ఆరాధ్య నాన్న అమ్మని తీసుకెళ్లండి.. అమ్మని డ్రాప్ చేయాల్సింది నువ్వే అని వాళ్ళిద్దర్నీ కలిసి ఒక కారులోనే పంపిస్తుంది ఆరాధ్య.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. స్వరాజ్యం దయాకర్ ఇద్దరూ అవని జీవితాన్ని చక్కదిద్దుకోమని సలహా ఇస్తారు. కానీ అవని మాత్రం ముందు ప్రణతి జీవితాన్ని చక్కదిద్దాలి. తను ప్రేమించిన వ్యక్తి వల్ల తను మోసపోయింది అన్న విషయం ప్రణతికి తెలియదు. తను మోసం చేసి ఆ వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. ఇక తిరిగిరాడని తెలిస్తే ప్రణతి ఏమవుతుందో ఊహించలేము అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రణతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నావల్ల వదినా చాలా కష్టాలు పడుతుంది. నేను చచ్చిపోతే వదినకు కష్టాలు తీరిపోతాయని ప్రణతి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది.
అవని ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డించి ఇంకా ప్రణతి రాలేదు భరత్ ని తీసుకు రమ్మని చెప్తుంది. లోపలికి వెళ్లి చూస్తే ప్రణతి గదిలో ఉండదు. మనం మాట్లాడుకున్న మాటలు ప్రణతి వినిందా ఏంటి? ఇకనుంచి వెళ్ళిపోయింది పదం వెళ్లి వెతుకుదామని వెతడానికి వెళ్తారు. ప్రణతి నీ వెతుక్కుంటూ అవని భరత్ వెళ్తూ ఉంటే అక్కడ ప్రణతి కింద పడిపోయి ఉంటుంది. అంబులెన్స్ కి ఫోన్ చేసి ప్రణతిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ప్రణతికి స్పృహ వచ్చేసి నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటుంది.
నేను చచ్చిపోతున్న నాకు తెలుస్తుంది వదిన నువ్వు? అమ్మానాన్ననికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పవా నేను అసలు నిజం చెప్పాలి అని అంటుంది. కానీ అవని మాత్రం ముందు పిచ్చిపిచ్చి ఆలోచనలు మానేసి నీకు ఏమీ కాదు డాక్టర్ని పిలుస్తానని చెప్పేసి అంటుంది. డాక్టర్ చెక్ చేసి ఆమె కండిషన్ కాస్త క్రిటికల్ గా ఉంది అబ్జర్వేషన్ లో ఉంచాలి అని చెప్తుంది. ముందు వెళ్లి డబ్బులు కట్టండి అని చెప్తుంది. అవని ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో కడుతుంది. ప్రనతి ఏం కాకుండా చూసుకోవాలని అనుకుంటుంది.
ప్రణతి కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్ చెప్పడంతో టెన్షన్ పడిపోయి బాధపడుతూ ఉంటుంది అవని. దేవుడి దగ్గరికి వెళ్లి ప్రణతి చాలా మంచి అమ్మాయి ఎవరి చేతిలోన మోసపోయి, ఇప్పుడు తన జీవితాన్ని వదిలేసుకునే పరిస్థితుల్లో ఉంది ఆమె జీవితాన్ని నిలబెట్టాలి అని కోరుకుంటుంది. తర్వాత రోజు ఉదయం అదే హాస్పిటల్ కి రాజేంద్రప్రసాద్ వస్తాడు. బెడ్ మీద పడుకున్న ప్రణతిని చూసి ప్రణతి ఏమైందమ్మా అని అడుగుతాడు.. ప్రణతి అసలు విషయాన్ని రాజేంద్రప్రసాద్ కి చెప్తుంది. నేను శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించాను నాన్న వాడు నన్ను నమ్మించి మోసం చేసి ఇప్పుడు విదేశాలకు పారిపోయాడు. ఇందులో అవని వదిన తప్పేమీ లేదు అని ఉంటుంది.
రాజేంద్రప్రసాద్ అవనిని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నానని బాధపడతాడు. అటు అవని ప్రణతి కండిషన్ ఎలా ఉందని టెన్షన్ పడుతూ వస్తుంది. ప్రణతి గదిలో రాజేంద్రప్రసాద్ ఉండడం అవని చూస్తుందేమో సోమవారం ఎపిసోడ్ లో చూడాలి.. ఇక రాజేంద్రప్రసాద్ అవనీని క్షమించి ఇంటికి తీసుకెళ్తాడా లేదా అన్నది సోమవారం చూడాల్సిందే..