Intinti Ramayanam Today Episode April 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని నీ మళ్లి ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నామని అక్షయ్ తో అంటాడు. ఆ మాట వినగానే అందరూ సంతోషిస్తారు ఇక పల్లవి ఆ మాట చెప్పగానే కమల్ చాలా సంతోష పడతాడు. పల్లవి దగ్గరికి వెళ్లి నువ్వేనా ఇలా మాట్లాడుతుందని షాక్ అవుతారు. అక్షయ దగ్గరికి ఆరాధ్య వచ్చి నిజంగానే అమ్మ ఇంటికి వస్తుందని అడుగుతుంది దానికి అక్షయ్ అనగానే ఆరాధ్య సంతోషపడుతుంది. కమల్ దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్లి అవి నేను తీసుకురావాలని అనుకుంటాడు. నువ్వు అర్జెంటుగా రావాలి వదిన అని కమల్ అక్కడికెళ్ళి అవనిని తీసుకొని వస్తాడు. ఇంటికి అవని రాగానే అందరూ సంతోషంగా పలకరిస్తారు. ముఖ్యంగా కమల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఇంట్లోకి రాగానే వదిన వచ్చిందని హడావిడి చేస్తాడు. పార్వతి ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది ఇకమీదట అందరం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పార్వతి మీ తమ్ముడు ప్రణతి ప్రేమించుకున్నారు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళిద్దరు పెళ్లిని మళ్లీ గ్రాండ్గా జరిపించాలని అనుకుంటున్నాం వెళ్లి వాళ్ళిద్దర్నీ తీసుకురావాలి అని చెప్పేసి అంటుంది. దానికి అవని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
మాట్లాడవేంటి అవని నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళిద్దర్నీ దగ్గర చేద్దాం.. మన స్థాయికి తగ్గట్లు పెళ్లి చేద్దామని అనగానే అవని షాక్ అవుతుంది. ఈ పెళ్లి జరగదు అని అక్కడినుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. వెనకాలే రాజేంద్రప్రసాద్ కూడా అవని దగ్గరకు వస్తాడు. ఏమైందమ్మా అవని నీకోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచూశారు కానీ ఇలా నిరాశ పరుస్తావని అస్సలు అనుకోలేదు ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడుగుతాడు.
మావయ్య గారు నేను ఇప్పట్లో ఏ నిజం చెప్పలేను మీ త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి అని అవని అంటుంది. అప్పుడే పార్వతి ఎక్కడికి వచ్చి మనం ఎంతగా బ్రతిమలాడుతున్నా ఈవిడ గారు దిగి రావట్లేదు. ఇక ఆవిడ ఇష్టం ఇంట్లో వాళ్ళందరూ తగ్గి ఇంట్లోకి రాణిస్తే ఇలానే ఉంటుంది మరి అని పార్వతి అంటుంది. చూశారా మనము జరిగినటి అన్ని మర్చిపోయి తనని ఇంట్లోకి రానిస్తే మళ్లీ మన కూతుర్ని మనకి దూరం చేయాలని చూస్తుందని రాజేంద్రప్రసాద్ తో అంటుంది.
ఇక పల్లవి అప్పుడే వచ్చి పెద్దవాళ్లు ఇంతగా అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పలేదు ఏంటి అక్క దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు ఎలాంటి దానివి అని అందరికి తెలుస్తుంది. నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది అక్క అనేసి పల్లవి అంటుంది. అయినా కానీ అవని మాత్రం నిజం చెప్పడానికి ముందుకు రాదు. నేను ఇప్పుడు మీకు ఏమి చెప్పలేను నన్ను మీరు ఎంతగా అనుకున్న పర్వాలేదు త్వరలోనే మీకు అన్ని నిజాలు తెలుస్తాయని అవని అంటుంది. ఇప్పుడు నన్నేం అడక్కండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని.
ఈ విషయాన్ని ప్రణతికి అవని చెప్తుంది. వదినకు వచ్చిన సమస్య తీరిపోవాలంటే నేను అసలు నిజాన్ని బయట పెట్టక తప్పదు అని అనుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎలాగైనా నేను నిజం చెప్తేనే అవని వదిన కష్టాలన్నీ తీరిపోతాయంటూ ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగుపెడుతుంది.. ప్రణతి మీ అందరికి ఒక నిజం చెప్పాలని అంటుంది. నేను ప్రేమించింది భరత్ ని కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి భరత్ కాదు అని బయట పెట్టేస్తుంది. అక్కడితో ప్రోమో కట్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..