Intinti Ramayanam Today Episode august 17th : శ్రియ అవని అక్క అని గట్టిగా పిలుస్తుంది. అక్క నేను స్టార్ట్ అప్ కంపెనీ గురించి చెప్పాను కదా.. వాళ్ళు ఇవాళ రమ్మని చెప్పారు నేను అక్కడికి వెళ్లాలి అని అంటుంది. అయితే మీరు బాబుని చూసుకుంటారు కదా నేను వెళ్లేసి వస్తాను అని శ్రీ అంటుంది. బాబు సంగతి నువ్వు మర్చిపో నేను చూసుకుంటాము నువ్వు హ్యాపీగా వెళ్లి మంచి న్యూస్ ని చెప్పాలి అని పార్వతి అంటుంది. అంతే కదూ భానుమతి శ్రేయ డ్రెస్ ని బాగోలేదని తిడితే.. పార్వతి మాత్రం నీ డ్రెస్ చాలా బాగుందమ్మా అని అంటుంది. పక్కనే ఉన్న భానుమతి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు అని చెప్పాల్సింది పోయి డ్రెస్ బాగుంది అని అంటున్నావ్ ఏంటి అని తిడుతుంది. ఇక అవని నువ్వు దీంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. మంచిగా క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి అని దీవించి పంపిస్తుంది అలాగే పల్లవి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. ఇంకా పల్లవి నాకు వేరే పని ఉంది అత్తయ్య నేను బయటికి వెళ్లి వస్తాను అని అడుగుతుంది.
అసలు పల్లవి ఎక్కడికి వెళుతుంది ఇంత టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది అంటే ఏదో జరుగుతుంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది.. పల్లవి ఇంత సడన్గా బయటకు వెళ్లాలి అని అనుకుంది అంటే తను ఏదో సమస్యలో ఉందని నాకు అర్థమైంది అని అవని అనుకుంటుంది. నిజంగానే పల్లవి ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అన్నది కనిపెడితే తన సమస్యను నాకు తెలుస్తుంది అని అవని ఆలోచిస్తుంది.. పల్లవి బయలుదేరగానే అవని పల్లవికి తెలియకుండా ఫాలో అవుతూ వస్తుంది.. పల్లవి ఏదో కంగారు పడుతూ వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద సమస్యలోనే ఉంటుంది అని అవని కూడా అనుకుంటుంది. పల్లవిని ఫాలో అయిన అవనికి అశ్విన్ కనిపించడంతో దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది. పల్లవి కంగారు పడిపోతూ ఉంది అంటే ఏదో పెద్ద సమస్యలోనే తను ఉంది కాబట్టి ఇంతగా బాధ పడిపోతుంది భయపడుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని ముందుకు వెళుతుంది అవని..
అశ్విన్ ను అడుక్కున్న పల్లవి..
పల్లవి రాగానే అశ్విన్ నీకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదా నాకు డబ్బులు కావాలి అని చెప్పాను కదా మరి నువ్వెందుకు ఇప్పటివరకు డబ్బులు ని అరేంజ్ చేయలేదు అని అంటాడు. నేను ఇప్పటికే 10 లక్షలు ఇచ్చాను. ఇక మీదట నా దగ్గర డబ్బులు లేవు నేను తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాను అని ఎంత చెప్తున్నా సరే అశ్విన్ మాత్రం అసలు మాట వినడు. నువ్వు డబ్బులను తీసుకురావాల్సిందే లేదంటే మాత్రం నేను ఊరుకోను అని అశ్విన్ పల్లవి కి వార్నింగ్ ఇస్తాడు.. కానీ పల్లవి మాత్రం నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని బ్రతిమలాడుతుంది.. అశ్విన్ ను చేతులు పట్టుకొని నా పరిస్థితిని అర్థం చేసుకో అని బ్రతిమలాడుతుంది పల్లవి.. పల్లవి అంతగా అశ్విన్ ను బ్రతిమలాడుతుంది ఎందుకు అని అవనికి అనుమానం మొదలవుతుంది.
అశ్విన్ ను చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతూ ఉండగా అవని ఏంటి పల్లవి ఏం చేస్తున్నావని అడుగుతుంది. అక్క నువ్వేంటి ఇక్కడ అని పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి అడుగుతుంది. ఎందుకు నువ్వు అతని పట్టుకుని బ్రతిమిలాడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది కానీ పల్లవి చెప్పకపోవడంతో అశ్విన్ ను బెదిరించి అడుగుతుంది.. అసలు నా చెల్లెల్ని ఎందుకురా ఏడిపిస్తున్నావు? ఎవర్రా నువ్వు అని కాలర్ పట్టుకుని అవని అడుగుతుంది. ఆ మాట వినగానే నీ చెల్లెల్ని అడుగు నేను ఎవరో తెలుస్తుంది అని అంటాడు. అయితే పల్లవి ఎంతగా అడిగినా కూడా చెప్పకపోవడంతో చివరికి నిజం చెప్తుంది. వాడు నా ప్రైవేట్ వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో బయటపెడతానని అంటున్నాడు. నాకు ఇప్పటికే నేను పది లక్షలు ఇచ్చాను అక్క కానీ ఇప్పుడు ఇంకా కావాలని అంటున్నాడు నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని పల్లవి అంటుంది..
పల్లవి తన గురించి చెప్పగానే నువ్వేం బాధపడకు పల్లవి నేను చూసుకుంటాను అని అవని అంటుంది. వాడికి నేను డబ్బులు ఇచ్చి వాడు నీ జోలికి రానివ్వకుండా నేను చేస్తాను అని పల్లవితో అని అంటుంది. ఇక పల్లవి అవని అక్క ధైర్యం చెప్పింది కాబట్టి నా సమస్యను త్వరలోనే తీరిపోతుంది అని అనుకుంటుంది.. ఈ అశ్విన్ కోసం డబ్బులను తీసుకొచ్చిన అవని అతనికి ముందు ఇవ్వకుండా వీడియోలు ఫోటోలు ఇస్తేనే ఇస్తాను అని చెప్తుంది. ఇక మాట వినగానే అశ్విని నిజమే అనుకోని నమ్మి ఆ వీడియోలు ఇవ్వగానే అతనికి డబ్బులు ఇచ్చే టైం కి పోలీసులు సడన్గా ఎంట్రీ ఇస్తారు. అతని పోలీసులు అరెస్ట్ చేయగానే అవని వాడు దుర్మార్గుడు అక్క వాడిని అరెస్ట్ చేసినందుకు నా మీద పగ పెంచుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అలానే చేస్తాడేమో అని భయపడుతుంది. కానీ అవని ఏం చేస్తాడు నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :నటి పై పోలీస్ కేసు.. పోలీస్ పైనే దాడి.. జైలుకే..?