Intinti Ramayanam Today Episode august 20th : ఒకరు ద్వారా వచ్చిన ఆస్తులని అనుభవించడం నాకు చేతకానితనమవుతుందే తప్ప.. నా కాళ్ళ మీద నేను నిలబడితేనే నాకు ఒక సంతృప్తి ఉంటుంది అని పల్లవి అనగానే అందరూ కూడా చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు.. కానీ పల్లవి ఆ మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. నా డాడీ నుంచి వచ్చిన కంపెనీలు నాకు సెట్ అవ్వవు అంత పెద్ద బాధ్యతల్ని నేను మోయలేను నా కాళ్ళ మీద నేను నిలబడి పైకి రావాలి అని అనుకుంటున్నాను అని పల్లవి చెప్పగానే కమల్ నా భార్యలో ఇంత మార్పు వచ్చిందని అనుకుంటాడు.. పల్లవి నిజంగానే చాలా సంతోషకరమైన వార్త చెప్పింది అని అందరూ కూడా సంతోషంగా ఉంటారు..
పల్లవి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా కమల్ అక్కడికి వస్తాడు. ఏంటి పల్లవి ఇక్కడ ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావ్? ఎందుకు నువ్వు ఇలా చేసావో నాకు అర్థం కావడం లేదు అని కమల్ అడుగుతాడు. అందరి ముందు అడిగితే బాగోదు కదా అని నేను కూడా మౌనంగా ఉన్నాను. మరి నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావో నాకు అర్థం కావడం లేదు అని కమల్ అడుగుతాడు.పల్లవి ఒక కంపెనీకి సీఈఓ అంటే చాలా ఉండాలి మీ నాన్నని స్వయంగా వచ్చి నీకు కంపెనీలు అన్నీ రాసి ఇస్తాను అంటే నువ్వు ఎందుకు వద్దని అంటున్నావు. అని నా కాళ్ళ మీద నేను నిలబడి పైకొస్తే పల్లవి గ్రేట్ అంటారు లేదా.. మా నాన్న బిజినెస్లను చూసుకుంటే మా నాన్న ఇచ్చిన వారసత్వం అని అంటారు నాకు అలాంటి మాటలు వద్దు బావ అని అనగానే కమల్ ఫిదా అయిపోతాడు.
అక్షయ్ కోసమని అవని పాలు తీసుకుని గదిలోకి వెళ్తుంది. నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నానండి అని అవని అంటుంది. ఏమైంది ఎందుకు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావో నాకు అర్థమైంది అని అక్షయ్ అడుగుతాడు. నేను పల్లవిని ఎప్పుడు చూడని విధంగా ఇవ్వాళ చూశాను అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్షయ్ అడుగుతాడు. పల్లవి ఇంత మారిపోతుందని నేను అసలు ఊహించలేదు అని అవని కూడా అంటుంది. పల్లవిలో ఇంత మార్పు నేనేం అస్సలు ఊహించలేదు ఇప్పుడు అందరితో సంతోషంగా ఉంది ఎలా అయితే నేను పల్లవి నీకు కావాలని కోరుకున్నాను. అలానే ఉంది అని అవని చాలా సంతోషంగా ఉంటుంది. మీ చెల్లెలు మారిపోయిందని నువ్వు సంతోషంగా ఉన్నావ్ నువ్వు సంతోషంగా ఉన్నావంటే నాకెంత హ్యాపీగా ఉంటుంది అని అక్షయ్ అంటాడు.
ఆరాధ్య స్కూల్ ఎగ్గొట్టడానికి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది అయితే స్కూల్ యూనిఫామ్ పైన సాస్ వేసి పాడేలా చేస్తే స్కూల్ కి పంపించదు అని అనుకుంటుంది. ఇక ఆ డ్రెస్ మీద సాస్ వేస్తూ ఉండగా కమ్మలు లోపలికి వస్తాడు ఏంటి ఆరాధన చేసే పని ఏంటి అని అడిగితే ఇవాళ స్పోర్ట్స్ కాబట్టి నేను అక్కడ పెద్దగా ఆడేది ఏమీ లేదు అందుకే స్కూల్ కి డుమ్మా కొట్టడానికి ఇలా చేశాను బాబాయ్ అని నిజం చెప్తుంది. ఆరాధ్య కమల్ ఇద్దరూ మాట్లాడుకోవడం విన్న భానుమతి వీళ్ళ సంగతి చెప్తారని అనుకుంటుంది. అవని వచ్చి స్కూల్ కి టైం అవుతుంది ఇంకా నువ్వు రాలేదు ఏంటి అని అడుగుతుంది. షర్టు పాడైపోయిన అమ్మ అందుకే నేను స్కూల్ కి వెళ్ళలేక పోతున్నాను అని ఆరాధ్య అబద్ధం చెప్తుంది. స్కూల్ కి వెళ్లడానికి ఏదో ఒకటి చేస్తున్నావా ఏంటి అని అవని మొదట అనుమానపడిన ఆ తర్వాత కమల్ కూడా ఆరాధ్యకు సపోర్ట్ చేయడంతో అది నిజమే అని నమ్ముతుంది అవని. కానీ అప్పుడే లోపలికి వచ్చిన భానుమతి ఆరాధ్య చేసిన పని గురించి చెప్పడంతో అవనీ సీరియస్ అవుతుంది నువ్వు వెళ్లి స్నానం చేసిరా ఇంకొకటి డ్రెస్ వేసుకొని స్కూల్ కి వెళ్ళాలి అని అనగానే ఆరాధ్య ఫీల్ అవుతుంది.
అక్షయ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అవని పడుకో అక్షయ్ నేను నిద్ర లేపి మీరు పడుకున్నప్పుడు లేపడానికి ఆరోగ్యం స్కూల్ కి రెడీ చేయడానికి నాకు రోజంతా పని అయిపోతుంది నా తల ప్రాణం తోక వస్తుంది అని అవని అంటుంది ఆఫీసులో నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు అని అనగానే అవునా అయితే ఆడవాళ్ళు ఒక రోజు ఇంట్లో ఏం చేస్తారో ఒకసారి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఈరోజు మీరు మేం చేసే పనుల్లో భాగం పంచుకోవాలని అవని అడుగుతుంది. అవని కోపంగా ఉంది అని తనని కూల్ చేయడానికి అక్షయ్ తన వెనకాలే వెళ్ళిపోతాడు.
అటు మీనాక్షి ఇంట్లోనే పనులని చకచకా చేస్తూ ఉంటుంది పార్వతి అన్ని పనులు మీరే చేస్తున్నారు వదిన ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు అని అడుగుతుంది కానీ మీనాక్షి మాత్రం ఇది మన ఇంట్లో కదా మీరంతా మనవాళ్లే కదా అని చేస్తున్నాను. ఆడవాళ్లు ఇంట్లో చేసే పని కదా ఇది అని అంటుంది ఇక వెంటనే వచ్చిన శ్రియ శ్రీకరికి బాక్స్ ప్రిపేర్ చేయాలి అని అడుగుతుంది కానీ మీనాక్షి నేను ఆల్రెడీ కట్టేసానమ్మ ఇదిగో శ్రీధర్ కి ఇవ్వు అని చెప్తుంది. శ్రియ నాకు ఎన్ని రోజులు తల్లి లేదనుకొని బాధపడ్డాను కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ బాధ పోయిందమ్మా అని అనగానే మీనాక్షి ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్..