Brahmamudi serial today Episode: రేఖ దగ్గరకు వెళ్లిన రాజు కళ్ల ముందు కన్నకొడుకు ఉన్నా కూడా నీ తల్లి మనసు కరగడం లేదు.. నాకో డౌటు పిన్ని మదన్ కూడా ఇలాగే వదిలేస్తావా..? అని అడగ్గానే.. రేఖ కోపంగా చూస్తుంది. అవునులే వాడు నీ లైఫ్‌కు అడ్డొస్తే.. అదే చేసేదానివేమో అయినా లక్కీ నీ కొడుకు అని నిజం చెప్పడానికి నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాను.. రేపు నువ్వు నిజం ఒప్పుకోకపోతే.. అంటూ చెప్తుండగానే.. రేఖ కోపంగా ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది. అందరికీ నిజం చెప్పేస్తానని రాజు చెప్తాడు. రేఖ కోపంగా చెప్పుకో చెప్తా చెప్తా అని బెదిరిస్తున్నావు ఎవరికి చెప్తావు.. మదన్‌కు చెప్తావా..? భూషణ్‌కు చెప్తావా..? ఎవరికి చెప్తావు అంటూ అడగ్గానే..
పిన్ని నన్ను రెచ్చగొడుతున్నావు.. నేను నిజంగానే చెప్తాను అనగానే.. నేను నిజంగానే చెప్పమంటున్నాను.. అయినా నిజం చెబితే నిన్ను ఎవరు నమ్ముతారు అంటూ రేఖ అడిగితే.. సాక్ష్యం చూపిస్తాను కదా అని రాజు చెప్పగానే.. ఆ సాక్ష్యం లేకుండా చేశాను కదా..? ఆంటోని గాడు నీకు దొరకడు కదా..? ఇన్ని రోజులు నేను సైలెంట్‌గా ఉంటే.. ఏం చేయలేకపోతున్నాను అనుకున్నావా..? అంటూ చెప్పగానే.. రాజు కోపంగా పిన్ని తప్పు చేస్తున్నావు.. లక్కీ గాడు ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు అని చెప్పగానే.. రేఖ కోపంగా నువ్వు నన్ను ఏమీ పీకలేవు అంటూ వెళ్లిపోతుంది.
రాజును పడగొట్టడానికి లవ్ సింబల్ ఉన్న కాఫీ రెడీ చేస్తుంది ఇందు. అప్పుడే కిచెన్‌లోకి వెళ్లిన స్వాతి ఏం చేస్తున్నావు అక్కా అంటూ అడగ్గానే.. ఇందు తాను రాజు కోసం ప్రిపేర్ చేసిన కాఫీ గురించి చెప్తుంది. అందుకు స్వాతి నాకు ఒకటి అర్థం అయింది. బావ నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని ఆరోజు చెప్పావు కానీ ఇప్పుడు బావే ప్రపంచంగా బతుకుతున్నావు అని అర్థం అయింది.. ఆ హార్ట్ సేపులో నీ ఇష్టం నీ కష్టం కనిపిస్తుంది అనగానే.. ఇందు కాఫీ తీసుకుని వెళ్లిపోతుంది. రూంలో రాజు నిద్రపోతుంటాడు. రాజు చూసి నా హార్ట్‌లో నువ్వు ఉన్నావని ఈ కాఫీలో హార్ట్ సింబల్ చూసి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను బావ అంటూ మనసులో అనుకుంటూ రాజును కిస్ చేసి నిద్ర లేపి కాఫీ ఇస్తుంది. రాజు కాఫీ తాగి కిందకు వెళ్తాడు.
రాజు చెంప మీద కిస్ సింబల్ చూసి అందరూ నవ్వుకుంటారు. భ్రమరాంబ వచ్చి అసలు నీకు బుద్దుందా..? సంసారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలి కానీ ఇలా బహిరంగంగా చేస్తారా..? ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు అంటూ తిడుతుంటే.. రాజు కోపంగా భ్రమరాంబను తిడుతుంటే.. ఐశ్వర్య కోపంగా ఏయ్ ముందు ఇక్కడి నుంచి వెళ్లు నీ ముఖం చూడాలంటేనే ఆసహ్యంగా ఉంది అనగానే.. శేషు మనసులో భయంగా మ్యాటర్ చాలా సీరియస్ అయ్యేలా ఉంది.. అల్లుడికి నిజం చెప్పాలి అనుకుంటూ రాజును పట్టుకుని తన ఫోన్‌లో రాజు ఫోటో తీసి చూసిస్తూ.. ఇప్పుడు చూడు నీ ముఖారవిందానికి ఏమైందో..? అంటూ చూపించగానే..
రాజు కంగారుపడుతూ.. ఏయ్ ఏంటిది..? అంటూ సిగ్గు పడుతూ అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్లిపోతాడు. ఏంటిది అని అడిగితే.. నేను అడుగుతున్నాను ఏంటిది ఈ ముద్దుల బాగొతం ఏంటి…? నీకు కచ్చితంగా సెకండ్ సెటప్ ఉన్నట్టుంది అంటూ అనుమానిస్తుంది. ఇద్దరి మధ్య చిలిపి గొడవ జరుగుతుంది. వాళ్లను చూసిన ఐశ్వర్య ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతూ.. మీరు మాత్రం సరదాగా ఉంటారా..? ఉండండి మీ సంగతి చెప్తా అనుకుంటూ వెళ్లిపోతుంది ఐషు.
రాజుకు ఒక కొరియర్ వస్తుంది. అది ఓపెన్ చూసి హ్యాపీగా ఉంటాడు. ఇందు వచ్చి ఏంటి రాజు ఏంటిది ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు.. అని అడగ్గానే.. రాత్రి రేఖ పిన్ని లక్కీ విషయంలో నేనేం చేయలేనని వెంట్రుక కూడా పీకలేనని చెప్పి వెళ్లిపోయింది. అదే వెంట్రుకతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించాను. లక్కీది రేఖ పిన్నిది డీఎన్‌ఏ రిపోర్ట్ మ్యాచ్ అయింది. ఇప్పుడు జరిగేదంతా పై నుంచి చూస్తుండు అని చెప్పి రాజు, రేఖ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.