Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి మనస్తత్వం తెలుసుకోవాలనుకున్న రణవీర్ అందుకోసం అమర్ ఫ్యామిలీని తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించాలనుకుంటాడు. అందుకోసం అమర్‌కు ఫోన్ చేసి అదే విషయం చెప్తాడు. ఈరోజు డిన్నర్‌కు రావాలని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అని ఏదైనా స్పెషలా అని అడుగుతాడు. స్పెషల్ ఏం లేదని.. కానీ మీరు తప్పకుండా రావాలని గట్టిగా రిక్వెస్ట్ చేయడంతో అమర్ సరే అంటాడు.
హాల్లో నిలబడి ఏదో ఆలోచిస్తుంది మిస్సమ్మ ఇంతలో రాథోడ్ వస్తాడు. ఇదిగో మిస్సమ్మ ఈ కన్ఫీజన్ చూడలేక లోపలికి వెళ్లి ఆ అనామిక కాన్‌సట్రేషన్ మొత్తం పిల్లల మీద ఉండేలా చేశా..? ఇప్పటికైనా నీ కన్ఫీజన్ పక్కన పెట్టు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ సరే అంటుంది. ఇంతలో రాథోడ్ అన్నట్టు చెప్పడం మరిచా.. నేను కూడా ఇప్పటి నుంచి నిను మేడం అని పిలుస్తాను అని చెప్తాడు. ఎందుకని మిస్సమ్మ అడిగితే.. ఇప్పుడు నీ గుర్తింపు ఈ ఇంటి కేర్ టేకర్ మిస్సమ్మ కాదు. ఈ ఇంటి కోడలు భాగమతీ. మా సారే నీకు ఆ స్థానం ఇచ్చేశారు కదా అని చెప్తాడు. ఇంతలో పై నుంచి అమర్ వస్తూ భాగీ అని పిలుస్తాడు. దీంతో రాథోడ్ ఆశ్చర్యంగా భాగీ అంటా.. ఏంటి మేడం అప్పుడే మా సార్‌ను కొంగున కట్టేసుకున్నారా..? ఎప్పుడు నీ నామ జపమే చేస్తున్నారు అంటాడు.
దీంతో మిస్సమ్మ ఊరుకో రాథోడ్ నువ్వు మరీను.. అంటూ సిగ్గు పడుతుంటే.. ఇదిగో మేడం సిగ్గు పడింది చాలు. లోపల మా సార్ పిలుస్తున్నాడు వెళ్లండి..అని చెప్తే.. అలా పిలవగానే ఇలా వెళితే ఎలా రాథోడ్. మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా అంటుంది. దీంతో రాథోడ్ కోపంగా ఎందుకు మధ్యలో ఆ అనామిక వచ్చి సెటిల్ అవ్వడానికా..? అనగానే.. మిస్సమ్మ కోపంగా చూస్తుంది. దీంతో రాథోడ్ లేకపోతే ఇంకేంటి మేడం.. ఇందాక మనం మాట్లాడినప్పుడు ఆ అనామిక ఏమంది. సార్ పిలిస్తేనే వెళ్లానని చెప్పింది కదా అనగానే.. మిస్సమ్మ కోపంగా రాథోడ్.. ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వస్తున్నాను అండి.. అంటూ పరుగెత్తుకుంటూ అమర్ దగ్గరకు వెళ్తుంది. అమర్ కోపంగా ఏయ్ లూజ్ నువ్వేమన్నా చిన్నపిల్లవు అనుకున్నావా..? అలా పరుగెడుతున్నావు.. కాలు జారి కిందపడిపోతే అంటాడు.
దీంతో పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదండి. సారీ ఇంకోసారి పరుగెత్తకుండా నిదానంగా వస్తాను అంటుంది. అమర్ కోపంగా చూస్తూనే.. వెళ్లి రెడీ అవ్వు డిన్నర్‌కు వెళ్దాం.. అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ డేట్‌కు తీసుకెళ్తున్నారేమో..? అని మనసులో అనుకుని.. ఇంత సడెన్‌గా చెప్తే ఎలా అండి. ఈవెనింగ్ చెబితే చాలా బాగా రెడీ అయ్యేదాన్ని.. కదా అంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అంటాడు అమర్. ఆ మాటకు మిస్సమ్మ ఊహల్లో తేలిపోతుంది. మీరంటే ఇంత సింపుల్‌గా ఇలా అనేశారు కానీ నేనైతే ఈ మూమ్‌మెంట్‌ను ఎలా ఊహించుకున్నానో తెలుసా..? అంటూ రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. ఊహల్లో తేలిపోతుంది. అమర్ కోపంగా చూస్తూ.. ఏయ్ లూజ్ నేనేం మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు. అని తిట్టగానే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. రణవీర్ నిన్ను నన్ను పిల్లలను తమ ఇంటికి డిన్నర్‌కు రమ్మన్నారు వెళ్దాం పద అని చెప్తాడు. ఊహల్లోంచి బయటకు వచ్చిన మిస్సమ్మ సరే వెళ్దాం రెడీ అయి వస్తాను అంటూ పైకి వెళ్తుంది.
అందరూ కలిసి డిన్నర్‌కు రణవీర్ ఇంటికి వెళ్తారు. అమర్ వాళ్లు రాగానే గేటు దగ్గరకు వెళ్లి రిసీవ్ చేసుకుంటాడు రణవీర్. వాళ్లకు డిన్నర్ ఏర్పాట్లు చేస్తుండగానే వెనక నుంచి కాళీ కత్తితో రణవీర్‌ను పొడవబోతాడు. కాళీ చేతిని గట్టిగా పట్టుకుని కొడతాడు. కాళీ చేతిలో కత్తి దూరంగా పడుంతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో మనోహరి వచ్చి కిందపడిపోయిన కత్తి తీసుకుని రణవీర్‌ను పొడవబోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?