E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీయాకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆస్తి కోసం ఇంట్లో రచ్చ..

Intinti Ramayanam Today Episode: శ్రీయాకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆస్తి కోసం ఇంట్లో రచ్చ..
Advertisement

Intinti Ramayanam Today Episode june 27th: పల్లవి బయటకు వెళ్లిన భరత్ దగ్గరికి వస్తుంది. కన్నా కొడుకు దగ్గరికి కన్న తల్లి వెళ్ళను అని అంటుంది అంటే దానికి కారణం ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలి అని పల్లవి భరత్ నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని అంటే మీ అమ్మ నీ దగ్గరికి రాకపోవడానికి కారణం అవనినే.. నాకు బాగా అర్థమైంది సిస్టర్ అవని ఎలాంటిదో అని భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక పల్లవి చెప్పిన మాట విన్న కమల్ వదిన మీద చాడీలు చెప్తున్నావు నీకు ఎందుకు ఇంత కక్ష అని అంటాడు.. నువ్వు మా వదిన గురించి ఇంకొకసారి ఏదైనా చెప్తే అసలు ఊరుకోను అని పల్లవికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.. అటు శ్రియకి నొప్పులు వస్తున్నాయని బాధపడుతుంది.

అవని దెబ్బకు పల్లవి మైండ్ బ్లాక్..

శ్రియ నొప్పిగా ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అవని తనకోసం జ్యూస్ చేసుకుని వచ్చాను అని చెప్తుంది. ఇప్పుడు నాకొద్దక్క అని అనగానే నువ్వే కదా శ్రియ జ్యూస్ కావాలని అడిగావు అందుకే చేసుకుని వచ్చాను కొంచెం తాగు అని అవని అంటుంది.. నాకు ఇప్పుడు వాంతి వచ్చేలా అనిపిస్తుంది అక్క అందులో కడుపులో నొప్పిగా కూడా ఉంది.. ఇప్పుడేమీ తాగాలనిపించట్లేదు అక్క అని నొప్పితో బాధపడిపోతుంది శ్రియ. శ్రీకర్ నావల్ల కావడం లేదు హాస్పిటల్ కి వెళ్ళాం కదా అని శ్రియ అన్నదని దీనికోసం హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు నేను కషాయం చేసి తీసుకొని వస్తాను అది తాగగానే నీకు వెంటనే రిలీఫ్ వస్తుంది అని అవని అంటుంది.. కానీ పల్లవి మాత్రం తన నొప్పితో బాధపడిపోతుంటే ఏమీ వద్దు అని అంటావేంటి తనకు ఏమైనా జరిగితే నువ్వేం చేస్తావు అని కావాలని శ్రీయాని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అవని కషాయం చేసి తీసుకుని వచ్చిన తర్వాత దానిని బలవంతంగా తాగిన శ్రేయకు 10 నిమిషాలలోనే ఆ నొప్పి తగ్గిపోవడంతో పల్లవికి అవని దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తుంది.

తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న భరత్..

Advertisement

భరత్ చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు.. అది చూసిన ప్రణతి ఏంటి భరత్ ఒక్కడివే వచ్చావు అత్తయ్యని తీసుకొని వస్తానని అన్నావు కదా.. మరి నువ్వు ఒక్కడివే వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. నేను ఒక్కడినే రావడం కాదు. అమ్మ నా దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. అందుకే ఒక్కడినే వచ్చాను.. చిన్నప్పటినుంచి అమ్మ నాకు తోడుగా నన్ను ఎంతో కష్టపడి పెంచింది. కానీ ఈ వయసులో ఆమెని నా దగ్గరే ఉంచుకోవాలని అనుకున్నాను.. అవని చేసిన పనికి మా అమ్మ తన కూతుర్ని దగ్గర నుంచి రాను అని అంటుంది.. అవని వదిన ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భరత్ అని ప్రణతి ఎంతగా చెప్తున్నా సరే భరత్ మాత్రం అసలు వినకుండా ఉంటాడు. తన తల్లికి తనకు దూరం అవడానికి కారణం అవనీని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినడు ఆవేశంగా ఉన్నాడు వదిన గురించి తర్వాత మాట్లాడాలి అని ప్రణతి అనుకుంటుంది.

లాయర్ రావడంతో ఆస్తి కోసం రచ్చ..

లాయరు రావడంతో అందరూ ఏమైంది అని అనుకుంటారు. మీ నాన్నగారు రాసిన వీలునామా మరో 10 రోజుల్లో అయిపోతుంది. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి హెల్త్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి కోర్టు నుంచి స్టే తీసుకొని వచ్చాను అని లాయర్ అంటాడు. మా మావయ్య గారు ఆస్తులు ఏం రాశారు లాయర్ గారు అని శ్రీయా అడుగుతుంది. అయితే లాయరు మా ఆస్తులు మాకు వస్తాయని అన్న శ్రేయకు ఇప్పుడే మీ హ్యాండ్ వర్క్ రావమ్మ ఇంకా టైం పడుతుంది అని చెప్పి షాక్ ఇస్తాడు.. నీకు పుట్టబోయే పిల్లలకు ఆస్తులు వస్తాయి.. మీకు పిల్లలు పుట్టే వరకు ఈ ఆస్తి అంతటికి అవని గార్డెన్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఆస్తులు వచ్చినా మాకు పెద్దగా ప్రయోజనం లేదు కదా అని శ్రీయా అంటుంది. కానీ లాయర్ మాత్రం మీరు ఆస్తులు అమ్మడానికి లేదు కానీ వాటి నుంచి వచ్చిన ఫలితాలు అనుభవించడానికి ఉంది అని చెప్పగానే శ్రీయా చాలా సంతోషంగా ఉంటుంది..

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఆస్తులు వస్తాయని లాయర్ చెప్పగానే శ్రీయ చాలా సంతోషంగా గాల్లో తేలిపోతుంది. అవును అక్కకు బిడ్డ పుట్టారు కాబట్టి ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి. ఇక మాకు కొద్దిరోజుల్లో బిడ్డ పుట్టబోతుంది కాబట్టి ఆస్తులు కూడా మాకు దక్కుతాయి. కానీ పల్లవికి ఇప్పట్లో ఆస్తి దక్కేలా కనిపించలేదు. ఆమె కడుపుతో లేదు కదా పిల్లలు కంటేనే ఆస్తులు సొంతమవుతాయి కదా అని గోరంగా అవమానించాలని మాట్లాడుతుంది.. మరి పల్లవికి ఆస్తి రాదు కాబట్టి అవి అక్క ఏం చెప్తే అది చేయాలి కదా అంటూ తనతో మాట్లాడడంతో పల్లవి చాలా సీరియస్ అవుతుంది.. దీనికి ఎలాగైనా సరే దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వాలి అని అనుకుంటుంది పల్లవి.. శ్రేయ కి కడుపు పోతే తను ఎగిరి పడదు అని ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : చక్రీ స్టోరీతో కేశవ ఎమోషనల్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. అడ్డంగా ఇరుక్కున్న మహా..

Related News

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Big Stories

Advertisement
×