Intinti Ramayanam Today Episode june 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి, చక్రధర్ దగ్గరికి అవని వెళ్లిన విషయాన్ని తెలుసుకొని పార్వతి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద రచ్చ చేస్తుంది. అత్తయ్య బావగారు అంటూ కేకలు పెట్టి అరవడంతో రాజేంద్రప్రసాద్ ఏమైందో అని బయటకు వస్తాడు. ఆ అవని ఏం చేసిందో తెలుసా మా నాన్న దగ్గరికి వెళ్లి క్రిమినల్ అని అనుమానించింది. అంతగా మా నాన్న ఏం చేశాడు. ఎవరిని మోసం చేశాడు..? అసలు మా నాన్న ఏం చేశారని అనుమానించడానికి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే మర్యాదగా ఉండదు అని పల్లవి అవని పై సీరియస్ అవుతుంది. కంపెనీ దివాలా తీసినందుకు మా నాన్నకి ఏంటి సంబంధం? అసలు నువ్వు మా ఇంటికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి..? మా డాడీ ఏదైనా అనే ముందర నీ గురించి నువ్వు ఆలోచించుకోవా..? తల్లిదండ్రుల గురించి నీకేం తెలుసు నువ్వు ఒక అనాధవి అని పల్లవి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అయితే పల్లవి మాటలు విన్న రాజేంద్రప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి వెళ్ళిపోతుంటే అవని అడ్డుపడుతుంది. మీ తండ్రి కూతురు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది.. నువ్వు మీ నాన్న కలిసి ఇలాంటి ప్లాన్ వేశారని నాకు క్లియర్గా అర్థం అయిపోయింది అని అవని అంటుంది. నువ్వు తెలివైన దానివే అక్క కానీ ఎందుకిలా తెలిసి కూడా చెప్పలేకపోతున్నావు అని అడుగుతుంది. నేను కేవలం నీ గురించి ఆలోచించాను తప్ప వేరే ఆలోచన లేదు. కుటుంబం ముక్కలవ్వడానికి అందరూ దూరం అవడానికి కారణం నువ్వే అని తెలిస్తే కమల్ ఆవేశానికి నువ్వు బలవుతావు.. కమల్ కోపం గురించి నీకు తెలుసు కదా చంపేస్తాడు.
నువ్వు ఇంతదాకా వచ్చిన తర్వాత నీ గురించి ఎలా చెప్పకుండా ఉంటానని అని అవని అంటుంది.. ఇకమీదట నుంచి నీ పప్పులు ఉడకవు నీ తప్పులని బయటపెడతాను అని అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎంత అనుకున్నా నీ వల్ల కాదు అని పల్లవి అంటుంది. ఇవన్నీ చేసింది నేనే అని ఈ కుటుంబం ముక్కలవ్వడానికి కారణం నేనే అని నీకు బాగా తెలుసు. ఇకముందు కూడా నీకు తెలిసే అన్ని జరుగుతాయని పల్లవి అంటుంది. అయితే పల్లవి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు జరగబోయేది మాత్రం నువ్వు అసలు ఊహించలేవు అని అంటుంది.
నీ కూతుర్ని కూడా నీకు దూరం చేస్తాను. ఈ భర్తతో నీకు విడాకులు ఇప్పిస్తాను. ఇంకా నీ జీవితం ఎటు కాకుండా పోయేలా చేస్తానని పల్లవి వార్నింగ్ ఇస్తుంది. ఆ మాట వినగానే కోపంతో రగిలిపోయిన అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఇది పసుపు తాడే నీకు ఉరితాడు అవుతుంది గుర్తుపెట్టుకో అని అంటుంది. ఇప్పటివరకు ఒకే ఎత్తు ఇప్పుడు నీకు కౌండన్ మొదలైంది అని అంటుంది. ఇక నువ్వెళ్ళు అని పల్లవిని పంపిస్తుంది. పల్లవి నేరుగా చక్రధర్ ఇంటికి వెళుతుంది. ఏమైంది ఎందుకు వెళ్లావమ్మా అక్కడికి అని చక్రధర్ అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని రాజేశ్వరి కిందకొస్తుంది.
రాజేశ్వరికి దొరికితే ఖచ్చితంగా క్లాసులు పీకుతుందని పల్లవి కాఫీ పేరుతో తప్పించుకుంటుంది.. ఇక అక్షయ్ భోజనం చేస్తుంటే పార్వతి ఫీల్ అవుతుంది. ఒకప్పుడు మనం నాలుగైదు కూరలు చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు కేవలం ఒక కూరతోనే తినాల్సి వస్తుంది.. నేను మళ్లీ జాబ్ చేసి మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని అక్షయ్ అంటాడు.. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. షర్ట్ ఎక్కడ అని పార్వతిని అడుగుతాడు. అవని వాళ్ళింట్లో షర్టు పడటం చూసి దొంగగా ముఖానికి టవల్ చుట్టుకొని అక్కడికి వెళ్తాడు. దొంగ దొంగ అని అవని అరుస్తుంది. ఏమైంది ఎందుకు వచ్చారు అని అడిగితే నా షర్టు మీ ఇంట్లో పడింది అందుకే వచ్చాను అని అంటాడు.
Also Read: బాలును వెంటాడుతున్న ఇద్దరు..రోహిణి కి టెన్షన్.. సత్యంకు ఘోర అవమానం..
అవని అరుపులు విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని కర్రతో చితకబాదుతాడు. మధ్యలో అవని అడ్డుపడి అతను దొంగ కాదు మీ అబ్బాయే అంటుంది.. మీరెవరు మా ఇంటికి రాకూడదనే కదరా అవన్నీ అడ్డుపెట్టాం మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. గేటు దూకి లోపలికి వచ్చాను నా షార్ట్ ఇక్కడ పడిపోయింది అని అంటాడు అక్షయ్. రాజేంద్రప్రసాద్ మాత్రం వీడొక గజదొంగ అని పెద్ద క్లాస్ పీకుతాడు. ఇక పార్వతిని పిలిచి రాజేంద్రప్రసాద్ రచ్చ రచ్చ చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..