Intinti Ramayanam Today Episode March 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రియుడుతో ఎలాగైనా ఈ రాత్రికి వెళ్ళిపోవాలని ప్రణతి రాత్రి లేచి అందరూ ఉండరు కదా అని బయటికి వెళ్లాలనుకుంటుంది కానీ ఎదురుగా పల్లవి కనిపించి నిన్ను ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వను కదా అనేసి అనుకుంటుంది ప్రణతి పల్లవిని చూసి లోపలికి వెళ్తుంది ఉదయం లేచి చూస్తే అప్పటికే అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు. ప్రణతిని రెడీ చేయడానికి తన ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. వాళ్ళందరిని చూసి ప్రణతి షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఇంట్లోంచి ఎలా వెళ్లాలి ఇంట్లోంచి తప్పించుకునే మార్గం లేదు నాకు వదిన ఉంటే ఏదో ఒక మార్గం చూపించేది అని ప్రణతి ఆలోచిస్తూ ఉంటుంది.. అవని ఎంట్రీ కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా కమ్మలు, శ్రీకర్ వదిన కోసం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని అనుకుంటారు.. అవినీ కోసం శ్రీకర్ కమల్ హడావిడి చేస్తారు.. పల్లవి శ్రియాలు మాత్రం అవనీని ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించాలని పక్కా స్కెచ్చులు వేస్తారు.. పల్లవి మాత్రం పెళ్లిని ఎలాగైనా ఆపేలా చేసి రాజేంద్రప్రసాద్ కుటుంబం పరువు తీయాలని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి అవనీని పిలవడం పల్లవి చూస్తుంది. విషయాన్ని వెంటనే పార్వతికి చెప్తుంది. అవని ప్రణతితో మాట్లాడడానికి పైకి వెళుతుంది ప్రణతి నువ్వేదో నాకు చెప్పాలని చూస్తున్నావు ఏంటో చెప్పమ్మా అని అడగ్గాని పార్వతి నువ్వు అసలు నా కూతురుతో నేను మాట్లాడొద్దని చెప్పాను అలాంటిది తన గదిలోకి వస్తావా ఈ పెళ్లయ్యేంతవరకు ఒక మూలన ఉండి నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి పార్వతి అవని బలవంతంగా కిందకు తీసుకొస్తుంది. అప్పుడే పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వస్తారు. పార్వతి వాళ్ళు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తారు. ఇంట్లోకి రాగానే మీ పెద్ద కోడలు ఇంకా రాలేదేంటండి ముహూర్తం కూడా దాటిపోతుంది ముహూర్తం లోపల మీ పెద్ద కోడలు ఇంట్లో ఉండాల్సిందే అనేసి పెళ్లి వాళ్ళు పట్టుబట్టి కూర్చుంటారు. పార్వతి మాత్రం ఎదురుగా ఉన్న అవనిని తన పెద్ద కోడలు అని చెప్పకుండా దారిలో ఉంది వస్తుందండి అని అబద్ధం చెప్తుంది.
ఇక అవని బాధపడుతూ ఉంటే అక్షయ అవని దగ్గరికి వెళ్లి నువ్వేం బాధపడకు అవని అమ్మ చెప్పకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు నా ఎదురుగా నా భార్య ఉండి కూడా నువ్వే నా భార్యని గొంతు తెచ్చి చెప్పలేకపోతున్న పరిస్థితి నాది నువ్వు టీచర్ అని చెప్పారు కదా అందుకే వాళ్ళు ఫీలవుతున్నట్టున్నారు. అమ్మ చెప్పకపోతే మీ పెళ్లయ్య లోపల నేనే అందరి ముందర నువ్వే నా భార్యవని చెప్తాను నువ్వేం బాధపడొద్దు అవని అని అక్షయ్ అంటాడు అప్పుడే కమల్ ప్రణతిని గౌరీ పూజకు తీసుకు రమ్మని పంతులుగారు చెప్పారు వదిన నువ్వు బొట్టు పెట్టి ప్రణతిని తీసుకురా అనేసి అంటాడు..
కమలు వదిన అని అనగానే పెళ్ళికొడుకు వాళ్ళ అత్త అక్కడే ఉండి వదిన అంటున్నారు ఏంటి నువ్వు రాజేంద్రప్రసాద్ చిన్న కొడుకు కదా అంటే నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళు లేదని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారా ఈ విషయాన్ని నేను వెంటనే తేల్చేయాలని అక్కడ తీసుకెళ్తుంది. ఈమె రాజేంద్రప్రసాద్ పెద్ద కోడలు కానీ ఎందుకు వీళ్ళు నిజం చెప్పలేదు ఈ విషయాన్ని ఎందుకు దాచారో అడుగు తమ్ముడు అని అనగానే ప్రణతిని చేసుకోబోతున్న అబ్బాయి నువ్వు అందర్నీ ఇలా అనుమానంతో చూడదత్త ఆమె టీచర్ అని మా అందరికీ తెలుసు అని మేనేజ్ చేస్తాడు.
ఇక తర్వాత పంతులుగారు అమ్మాయిని గౌరీ పూజకు తీసుకురమ్మని పిలుస్తారు. అయితే అక్కడ పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో అందరూ అక్కడే ఉండి చూస్తూ ఉంటారు అప్పుడే దయాకర్ తన ఫోన్ ని చెక్ చేసుకుని ప్రణతి 32 మిస్డ్ కాల్ ఇచ్చిందని అవనీకి చెప్తాడు.. నీతో ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలి ఏమో అవని అందుకే ఇన్నిసార్లు ఫోన్ చేసిందేమో నువ్వు వెళ్లి ఏదో మాట్లాడేసి రా అనేసి అంటాడు. ఇక అవని ప్రనితితో ఎలాగైనా మాట్లాడాలని పైకి వెళుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి పైనుంచి కిందకు దిగివస్తూ ఉంటుంది. ఇది నీకు ఆఖరి అవకాశం కదా బొట్టు పెట్టి ప్రణతిని కిందకు తీసుకురా అనేసి అంటుంది. అవని పైకి వెళ్లి ప్రణతి కోసం వెతుకుతుంది కానీ రూమ్లో ప్రణతి ఉండదు కానీ ఒక లెటర్ అయితే అక్కడ ఉంటుంది ఆ లెటర్ ని చదివి అవని షాక్ అవుతుంది.
ఎంత పని చేసావ్ ప్రణతి నువ్వు చెప్పాలనుకున్న విషయం ఇది ఇప్పుడు పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలి మామయ్య గారు పరువు పోతుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అటు పంతులు ముహూర్తం దాటిపోతుంది అమ్మాయిని తీసుకురండి అని అంటాడు. అక్షయ్ నేను వెళ్లి చెల్లిని ఇక్కడ తీసుకొస్తాను అమ్మని పైకి వెళ్తాడు. అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రణతి ఎక్కడ అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది కానీ నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావని అక్షయ్ అడుగుతాడు. ఆ లెటర్ ని చూసి అక్షయ్ షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రణతి ఇంట్లోంచి వెళ్లిపోయిన విషయం పెళ్లి వాళ్ళకి తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…