Intinti Ramayanam Today Episode May 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని, పార్వతీ రాజేంద్రప్రసాదుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అందరిని ఇలా బయట చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అంటాడు. ఏంటి అందరూ కలిసే వచ్చారు ఏదైనా విశేషమా లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారా అని అతను అడుగుతాడు. అవునండి మేము అనుకోకుండానే కలుస్తాం కానీ కలిసే వెళ్తున్నాం కలిసే ఉంటున్నామని అవని అంటుంది. అక్షయ్ ఆ వ్యక్తికి సమాధానం చెప్పలేక అవని ఏం చెప్తుందని మౌనంగా ఉండిపోతాడు. ఇక తర్వాత కూరగాయలు తీసుకొని అవని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తారు..రాజేంద్రప్రసాద్ తన గెటప్ ని పూర్తిగా మార్చుకుంటాడు అది చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ మీరేంటి ఇలా వంట చేయడం ఏంటి అని అడుగుతారు. అవతారం ఏంటి అని స్వరాజ్యం అడుగుతుంది. వంటవాడు అన్నాక ఇలాంటి వేషంలోనే ఉండాలి ఇలానే కదా వంటవాడు చేసేది షూటు బూటు వేసుకొని చేస్తే బాగోదు కదా అని సెటైర్ వేస్తాడు.. మీరందరూ కాసేపు అలా ఉండండి. కొద్ది నిమిషాల్లో బెండకాయ ఫ్రై కూడా చేసుకొని వస్తాను అందరం కలిసి భోజనం చేద్దామని అంటాడు. అక్షయ్ డాక్యూమెంట్స్ పై సంతకం పెట్టించుకోవాలని వస్తాడు. కానీ రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయని చూసిన అవని రాజేంద్రప్రసాద్ అని పిలుస్తుంది.. ఏంటి ఇలా వచ్చావ్ ఏదైనా పని మీద వచ్చావా లేక ఏదైనా అనడానికి వచ్చావా అని రాజేంద్రప్రసాద్ అక్షయని అడుగుతాడు. ఫైల్ మీద మీరు అర్జెంటుగా చేయాల్సిన సంతకం ఒకటుంది. మీరు చేస్తేనే ఆ ప్రాజెక్టు మనకు వస్తుంది అని డాక్యుమెంట్స్ ఇస్తాడు. నీకు మీ అమ్మకు బానిసలా కనిపిస్తున్నానా..? నేను సంతకం పెట్టను. ఏదైతే అది అయింది అని రాజేంద్ర ప్రసాద్ తెగేసి చెప్పేస్తాడు. మనుషులు అవసరం లేదు గాని వాళ్ళ సంతకాలు అవసరం డబ్బే, మీ ప్రపంచం అని రాజేంద్రప్రసాద్ అడగని అక్షయ్ మీరు దీని మీద సంతకం చేయకపోతే కంపెనీ చాలా లాస్ అవుతుంది.
దాదాపు 150 కోట్లు ఈ ప్రాజెక్టు మీద మనకి వస్తుంది అని వివరిస్తాడు. ఎంత చెప్పినా కూడా రాజేంద్రప్రసాద్ మాత్రం సంతకం పెట్టకుండా ఆ డాక్యుమెంట్స్ ని విస్తరి కొట్టేస్తాడు. అవని ఎంత చెప్పినా కూడా రాజేంద్రప్రసాద్ వినకుండా ఆ డాక్యుమెంట్స్ ని కింద పడేస్తాడు. అవని మాటలు నీకు అంతగా ఎక్కువైపోయాయి నాన్న నువ్వు కొడుకును కాదని ఇక్కడికి వచ్చేసావా ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదని అక్షయ్ అంటాడు. నువ్వు ఎన్ని చెప్పిన సరే నేను సంతకం పెట్టను గాక పెట్టను అని అంటాడు.
ఇక ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని అందరితో చెప్తాడు.. అవని నే ఇలా చేస్తుంది అని అందరూ అనుకుంటారు. ఆస్తులు పోగొట్టుకొని మనం రోడ్డుపాలుని పడాలని అవని కోరుకుంటుందని పార్వతి కూడా అంటుంది. నీ గురించి అందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క లాగా దారుణంగా మాట్లాడుతుంటారు అప్పుడే అవని అక్కడికి వస్తుంది. పల్లవి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. నీ అంతటి నువ్వు ఊహించుకొని మాట్లాడడం నీకు అలవాటే కదా నేను ఎందుకు వచ్చాను అన్నది ఆయనకు చెప్తాను అని అవని అంటుంది.
మావయ్య గారు సంతకాలు పెట్టలేదు అది నా వల్లే అని మీరు బాగానే మాట్లాడుకుంటున్నారు. కానీ మావయ్య గారు సంతకాలు చేశారని చెప్పడానికే నేను వచ్చానని అవని అంటుంది. డాక్యుమెంట్స్ ఇచ్చేసి మావయ్య గారు ఎప్పుడు బంధువులు కుటుంబం కావాలనుకుంటారే తప్ప ఆస్తులు పోగొట్టుకొని అనాధలుగా మిగలరని ఎప్పుడు అనుకోరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళగానే అక్కడ రాజేంద్రప్రసాద్ ని చూసి షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అవని గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
మావయ్య ఇంకా నాకు గ్రిప్ లో ఉన్నాడని చెప్పడానికే ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని తానే ఇంటికి వచ్చిందని పల్లవి అంటుంది. ఇక తెలివి ముందు ఎవ్వరూ పనికిరారు అంటూ పల్లవి దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న కమల్ నియంత తెలివి మా వదినకి లేదులే అని పల్లవి నంటాడు. వదిన ఏమి కావాలని రాలేదు నాన్న కూడా బయటే ఉన్నాడు. నాన్న చేత సంతకం చేయించి మరి తీసుకొని వచ్చింది అని అంటాడు. నువ్వు విన్నట్టే మాట్లాడుతున్నావ్ ఏంటి అని పార్వతి అంటుంది. నువ్వు విన్నాను నాన్న బయటే ఉన్నాడు వదినని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని కమలంటాడు. పార్వతి ఆయన వచ్చారా అని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పటికే రాజేంద్రప్రసాద్ వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..