Intinti Ramayanam Today Episode May 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య సోఫాలో కూర్చుని ఉండటం చూసిన రాజేంద్రప్రసాద్ స్కూల్ కి ఎందుకు వెళ్లలేదమ్మా అని అడుగుతాడు.. అటు అవని ప్రిన్సిపల్ దగ్గరకొచ్చి నేను నా కూతురు కోసమే ఈ స్కూల్లో చేస్తున్నానని చెప్పాను కదా మేడం.. ఇప్పుడు నా కూతురు కనిపించట్లేదు. వాళ్ళ నాన్న స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అని అడుగుతుంది.. ప్రిన్సిపల్ అక్షయ్ కి ఫోన్ చేసి ఆరాధ్య స్కూల్ కి రాలేదు ఏంటి సార్ హెల్త్ బాలేదా..? మరి ఏదైనా కారణం ఉందా అని అడుగుతుంది. అక్షయ్ నేను మా ఆరాధ్యను స్కూల్ మార్పించే ఆలోచనలో ఉన్నానని చెప్తాడు. ప్రిన్సిపల్ ఆ విషయాన్ని అవినీకి చెప్తుంది. ఆ మాట విన్నావని షాక్ అవుతుంది.. నావల్లే ఆరాధన స్కూల్ మార్పిస్తున్నాడా అని అవని బాధపడుతుంది. అక్షయ్ ను రాజేంద్రప్రసాద్ ఆరాధ్య స్కూల్ ఎందుకు మారుస్తున్నావు అని అడుగుతాడు. మీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని చిన్నపిల్ల భవిష్యత్తుతో ఆడుకోకూడదు అలా అని రాజేంద్రప్రసాద్ అంటాడు దానికి కోపంతో రగిలిపోయిన అక్షయ్ ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ నేను చూసుకుంటాను మీకు ఇందులో సంబంధం లేదని అరుస్తాడు దాంతో రాజేంద్రప్రసాద్ బాధపడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. అవని నీ దెబ్బ కొట్టేందుకు పల్లవి ప్లాన్ చేస్తుంది ఆ విషయాన్ని అక్షయ పార్వతితో చెప్తే వాళ్ళు అలానే చేద్దామని అంటారు. మొత్తానికి పల్లవి ఇంట్లో వాళ్ళందరిని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇంటికి శాశ్వతంగా దూరం చేసేందుకు ప్లాన్ వేస్తుంది. అవని తన కూతురు గురించి ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. ఎదురుగా అక్షయ్ రావడం చూసి అవని కారుకి అడ్డుపడుతుంది. ఎందుకు స్కూల్ మార్పించాలనుకుంటున్నారు.. తల్లి కూతుర్లను వేరు చేయాలని మీరు అనుకుంటున్నారా నేనేంటో మీకు అర్థం కాదు కనీసం మా ఇద్దరిని కూడా కలిసి ఉండనివ్వకూడదు అని అనుకుంటున్నారా అని అవని అడుగుతుంది..
నీలాంటి దాని దగ్గర నా కూతురు పెరగడం నాకు ఇష్టం లేదు నీలాంటి బుద్ధులే వస్తాయని నాకు భయమేస్తుంది అందుకే నేను ఆ స్కూల్ నే మాన్పించేసాను. ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం నీకు ఎటువంటి సంబంధం లేదు అని అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. మొన్నటివరకు నా భార్యతో ఎలా మాట్లాడాలని ఆరాటపడిన భర్తను చూశాను ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. నేను చేసిన తప్పేంటి అసలు నేను నిజంగానే తప్పు చేశాను అని మీరు నమ్ముతున్నారా అని అవని అక్షయ్ ని దుమ్ము దులిపేస్తుంది.
ఆరాధ్య భవిష్యత్తును కోరుకునే దానివైతే నువ్వు ఆ స్కూల్ మానేశాయి అప్పుడే ఆ స్కూల్ కి నేను ఆరాధ్యను పంపిస్తానని అక్షయ్ అంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం అవని ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయ్యి వస్తుంది. నీకు నీ కూతురికి లంచ్ బాక్స్ రెడీ చేసానమ్మా తీసుకొని వెళ్ళు అని స్వరాజ్యం అంటుంది. అయితే అవని ఒక లంచ్ బాక్స్ మాత్రమే తీసుకుంటుంది.. అదేంటి అవని ఎప్పుడు నీకు నీ కూతురికి రెండు బాక్సులు పెట్టమని అడుగుతావు కదా ఇప్పుడేంటి ఒక బాక్స్ తీసుకెళ్తున్నావని అడుగుతారు.
అవని నేను స్కూల్ మానేశాను స్కూల్ కి వెళ్లట్లేదు పిన్ని ఆఫీస్ కి వెళ్తున్నాను అని అంటుంది. నేను ఆ ఇంట్లో మనుషుల్ని సంతోషంగా లేకుండా చేస్తున్నానని ఆయన అన్నారు. నేను వాళ్లకి దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారు కదా అందుకే నా కూతురికి నేను దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని అవని అంటుంది. అవని బాధను చూసి స్వరాజ్యం అందరూ బాధపడతారు. అవని ఆరాధ్య కోసం స్కూల్ కి వెళ్లి దొంగ చాటుగా ఆరాధ్యను చూసి బాధపడుతుంది. ఆ తర్వాత అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అవనిని చూసినా పల్లవి చూసావా అక్క నా దెబ్బ ఎలా ఉంటుందో అని అంటుంది. నీకు ఇప్పుడు నీ కూతురుని దూరం చేశాను ఇక నీ మొగుడిని కూడా నీకు దూరం చేసేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అవని నా విషయాల్లో నువ్వు ఎంత జోక్యం చేసుకుంటున్నావో నీకే అర్థం కావట్లేదు మీ జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టే ఇలా నువ్వు మాట్లాడుతున్నావ్ చేయగలుగుతున్నావు అని అవని అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..